HBD Sunny Leone : సన్నీలియోన్.. ఒకప్పుడు అలాంటి వీడియోలతో సంచలనం సృష్టించిన ఈ ముద్దుగుమ్మ.. ఆ ఊబి నుండి బయటకు వచ్చి ఫిలిం స్టార్ గా మారి, ప్రస్తుతం తన అందంతో, నటనతో ప్రేక్షకులను మెప్పిస్తోంది. అందానికి తగ్గ అందం, అంతకుమించి అభినయంతో, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సన్నీలియోన్ (Sunny Leone) ప్రత్యేక పాత్రలు, స్పెషల్ సాంగ్ లలో నటిస్తూ మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది. ప్రధానంగా బాలీవుడ్లో తన హవా కొనసాగిస్తున్న ఈమెకు చెప్పుకోదగ్గ హిట్స్ లేనప్పటికీ ఆమె ప్రస్తానాన్ని మాత్రం కొనసాగిస్తోందని చెప్పవచ్చు. ఇదిలా ఉండగా తాజాగా ఈరోజు ఈమె పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈమెకు సంబంధించిన కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అందులో భాగంగానే ఈమె నెలవారీ ఆదాయం ఎంత? ఇప్పటివరకు ఎన్ని వందల కోట్ల ఆస్తులు కూడబెట్టింది? ఈమెకు ప్రధాన ఆదాయ వనరు ఏంటి? అనే విషయం ఇప్పుడు వైరల్ గా మారింది.
సన్నీలియోన్ ప్రధాన ఆదాయ వనరు ఏంటంటే..?
సన్నీలియోన్ సినిమాల ద్వారానే కాకుండా పలు వాణిజ్య ప్రకటనలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది. ఇక అంతేకాదు ఒక్కొక్క వాణిజ్య ప్రకటనలో నటిస్తున్నందుకు గానూ సుమారుగా రూ.3 నుండి రూ.4కోట్ల వరకు తీసుకుంటుందట సన్నీలియోన్. ఇంకా స్పెషల్ సాంగ్స్ లో నటించాలి అంటే సుమారుగా ఒక్కో స్పెషల్ సాంగ్ కోసం రూ.2కోట్ల వరకు తీసుకుంటుందని.. ఇప్పుడు ఈమె రేంజ్ పెరగడంతో దానిని రెట్టింపు చేసిందని కూడా వార్తలు వినిపిస్తుంటాయి. అంతేకాదు సొంతంగా బ్యూటీ ప్రొడక్ట్స్ బ్యాండ్ ను కూడా నడుపుతోంది. దీని ద్వారా నెలకు కోటి రూపాయలకు పైగా సంపాదిస్తోంది. ఒక రకంగా చెప్పాలి అంటే సన్నీలియోన్ కి ప్రధాన ఆదాయ వనరుగా నిలిచింది ఈ రంగం. అలా బ్యూటీ ప్రొడక్ట్స్ తో వ్యాపార రంగంలో మరింత సక్సెస్ గా దూసుకుపోతోంది సన్నీలియోన్.
సన్నీ లియోన్ ఆస్తుల విలువ..
ఇక తెలుగు, హిందీ సినిమాలలో అవకాశాలు అందుకుంటూ భారీ పాపులారిటీ సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తున్న ఈమె.. హీరోయిన్ గా పేరు సొంతం చేసుకోలేక పోయిందికానీ ఇలా స్పెషల్ సాంగ్స్ తోనే ఆకట్టుకుంటుంది. ఇక నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫోటోలు షేర్ చేస్తూ.. ఈమె పెట్టే పోస్టుల ద్వారా కూడా భారీగా సంపాదిస్తోంది. ఇక సినిమాలు, ప్రకటనలు, సొంత వ్యాపారాల ద్వారా భారీగా ఆర్జిస్తున్న సన్నీ లియోన్.. ఇప్పటివరకు సుమారుగా రూ.150 కోట్లకు పైగా ఆదాయాన్ని కూడబెట్టినట్లు సమాచారం. అటు సోషల్ మీడియాలో కూడా లక్షల సంఖ్యలో అభిమానులు ఈమెను అనుసరిస్తున్నారు. ఇక అంతే కాకుండా లగ్జరీ కార్లు, ఖరీదైన బంగ్లాలు, పలు ప్రాంతాలలో ఆస్తులు భారీగా పోగేసినట్లు సమాచారం. సన్నిలియోన్ వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే 2017 జూలైలో డేనియల్ వెబర్ ను వివాహం చేసుకుంది. ఇక ఆ తర్వాత మహారాష్ట్రలోని ఒక మారుమూల ప్రాంతం నుండి లాటూర్ అనే ఒక అమ్మాయిని దత్తత తీసుకున్నారు. ఇక వివాహం తర్వాత వీరికి ఇద్దరు మగ పిల్లలకి జన్మనిచ్చిన విషయం తెలిసిందే.
ALSO READ:Anasuya Bharadwaj: కొత్తింటిలోకి అనసూయ.. ప్రత్యేకతలు, ఖరీదు తెలిస్తే షాక్..!