Rahul Gandhi: రాజకీయాల్లో దురదృష్టం అంటే రాహుల్‌దే. ఆయన పొలిటికల్‌గా యాక్టివ్ అయినప్పటి నుంచీ కాంగ్రెస్ అధికారంలోకి రాలేకపోయింది. ప్రధాని పీఠంపై ఆశలు పెట్టుకున్న యువరాజుకు.. ఆ సీటు అందని ద్రాక్షే అవుతూ వస్తోంది. హస్తం పార్టీకి ప్రస్తుతం దేశంలో అత్యంత క్లిష్ట పరిస్థితులు ఉన్నాయి. అందుకేనేమో, పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకూ ఆయన వెనకాడుతున్నారు. కొడుకు సైడ్ అయిపోవడంతో పాపం సోనియానే ఇన్నాళ్లూ వయోభారంతో పార్టీ బరువును మోశారు. ఇప్పుడు మరో కురవృద్ధుడు ఖర్గే భుజాలపై భారం మోపారు. రాహుల్ మాత్రం భారత్ జోడో యాత్రతో దేశవ్యాప్త పాదయాత్ర చేసి.. సొంత ఇమేజ్ పెంచుకుంటున్నారు.
రాహుల్‌గాంధీ తన రాజకీయ ప్రస్థానంపై దూరదృష్టితో వ్యవహరిస్తున్నారు. అనువుగాని సమయంలో ఎంత హడావుడి చేసినా వేస్ట్ అనుకున్నట్టున్నారు. అందుకే, సరైన సమయం కోసం ఓపిగ్గా ఎదురుచూస్తున్నారు. మోదీ మీద ప్రజల్లో మోజు తీరేంత వరకు ఆగుతున్నారు. ఐడియా అయితే బాగానే ఉండొచ్చు. కానీ, ఆలోగా బీజేపీ మరింత బలపడుతోంది. కాంగ్రెస్‌ను తొక్కేస్తోంది. రాహుల్‌కు బిగ్ డ్యామేజ్ చేస్తోంది.
రెండేళ్ల జైలు శిక్షను సాకుగా చూపించి.. ఎంపీగా రాహుల్‌గాంధీపై అనర్హత వేటు పడింది. దీంతో ఆయన తన లోక్‌సభ సభ్యత్వం కోల్పోవాల్సి వస్తుంది. వాట్ నెక్ట్స్? వయనాడ్‌లో మళ్లీ ఎలక్షన్ వస్తుందా? వస్తే, రాహుల్ మళ్లీ పోటీ చేస్తారా? చేస్తే, మళ్లీ గెలుస్తారా? ఇవేవీ అంత ఈజీ విషయాలు కావంటున్నారు.
2019 సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్‌గాంధీ రెండు స్థానాల్లో బరిలో దిగారు. వారసత్వంగా వస్తున్న అమేథితో పాటు కేరళలోని వయనాడ్ నుంచీ పోటీ చేశారు. అమేథిలో తాను ఓడిపోతానని ముందే గుర్తించారో ఏమో.. బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ చేతిలో ఓటమి పాలై పరువు పోగొట్టుకున్నారు. వయనాడ్‌లో గెలిచి పవర్ నిలబెట్టుకున్నారు.
ఎంపీగా లోక్‌సభలో బాగానే రాణిస్తున్నారు రాహుల్. అనేక అంశాలపై కేంద్రాన్ని ఇరుకునపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సభలోనే కాదు.. పార్లమెంట్ బయటా.. భారత్ జోడో యాత్రతో బీజేపీని ఎండగడుతున్నారు. రాహుల్ ఫామ్‌లోకి వచ్చేశారు అనుకుంటూ పార్టీ శ్రేణులు సంబరపడుతున్న సమయంలోనే.. ఓ పరువునష్టం కేసులో రెండేళ్లు జైలు శిక్ష పడటం.. ఆ వెంటనే ఎంపీ పదవిపై వేటు వేయడం.. చకచకా జరిగిపోయాయి. ఎంపీ రాహుల్‌గాంధీ కాస్తా.. ఉత్త రాహుల్‌గాంధీ కానున్నారు.
న్యాయ పోరాటం చేస్తామని కాంగ్రెస్ చెబుతోంది. పదవి నిలబడితే ఓకే. లేదంటే..? వయనాడ్‌కు ఉప ఎన్నిక వస్తే..? రాహుల్ పోటీ చేసి గెలుస్తారా? గతంలో కేరళకు రాహుల్ కొత్త కాబట్టి ఈజీగానే గెలిచారు. మరి, ఈ మూడేళ్లలో ఆయన మార్క్ పెద్దగా కనిపించే అవకాశం లేదు. అందుకే, మళ్లీ బరిలో దిగితే గెలుస్తారనే నమ్మకం తక్కువే. గెలిచినా మెజార్టీ పడిపోయే ప్రమాదం ఉంది. ఒకవేళ వయనాడ్‌లో మళ్లీ పోటీ చేయకుండా ఉంటే.. రాహుల్ పారిపోయాడనే ప్రచారం చేస్తుంది బీజేపీ. అది మరింత డ్యామేజ్. ఇలా ఎలా చూసినా.. రాహుల్‌గాంధీకి రాబోయే కాలం అగ్నిపరీక్షే. కమలనాథులు కరెక్ట్ టైమ్‌లో రాహుల్‌ను, కాంగ్రెస్‌ను కోలుకోలేని దెబ్బ కొట్టారని అంటున్నారు.