Dhankhar Resign: 2022 ఆగస్ట్‌లో ధన్ ఖడ్ భారత 14వ ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టారు. 2027 ఆగస్ట్ వరకు పదవీకాలం ఉంది. ఏమైందో ఏమోగానీ.. ఆల్ ఆఫ్ సడెన్ గా రిజిగ్నేషన్ ఇచ్చేశారు. అదీ జులై 21న రాత్రి తొమ్మిదిన్నర గంటలకు. అదీ మాన్ సూన్ సెషన్ తొలిరోజే. పైకి ఆరోగ్య కారణాలు చూపారు. కట్ చేస్తే ప్రశాంతంగానే, ఫిట్ గా ఉన్నట్లే కనిపించారు. కానీ రాజీనామా ఆమోదం జరిగిపోయింది. ఇందుకు కారణమేంటన్నది రకరకాల థియరీస్ బయటికొస్తున్నాయి. మరి ఏం జరిగింది?
దైవాజ్ఞ వస్తేనే రిటైర్మెంట్ అని ప్రకటన
చూశారుగా ధన్ ఖడ్ కామెంట్స్. జగదీప్ ధన్‌ఖడ్ కొద్ది రోజుల క్రితం జేఎన్‌యూలో జరిగిన కార్యక్రమంలో ఈ మాటలన్నారు. తాను సమయం వచ్చినప్పుడు అంటే ఆగస్ట్ 2027లో రిటైర్ అవుతానని, మధ్యలో దైవాజ్ఞ లేకపోతే అన్న మాట మాట్లాడారు. ఈ మాట ఎందుకు అన్నారో గానీ 74 ఏళ్ల ధన్‌ఖడ్ ఆల్ ఆఫ్ సడెన్ గా ఆరోగ్య కారణాలను చూపించి రిజైన్ చేసేశారు. నిజంగానే మధ్యలో దైవాజ్ఞ వచ్చిందా? ఆ ఆజ్ఞ ఇచ్చింది ఎవరు? ఈ ఏడాది మొదట్లో ఆయనకు గుండె సమస్యల కోసం ట్రీట్మెంట్ తీసుకున్నారు. అయినా సరే ఆకస్మికంగా రాజీనామా చేయడంతో డౌట్లు పెరుగుతున్నాయ్.
దాల్ మే కుచ్ కాలాహై క్యా..!?
భారత ఉపరాష్ట్రపతి పదవి నుంచి జగ్ దీప్ ధన్ ఖడ్ రాజీనామా చేయడం ఇప్పుడు దేశంలో హాట్ డిబేట్ కు దారి తీసింది. ఆరోగ్య కారణాలు అని చెప్పినప్పటికీ అదంతా వట్టిదే అని చాలా మంది అనుకుంటున్న మాట. ఏదో బలమైన కారణం లేకుండా ఇలా మాన్సూన్ సెషన్ తొలిరోజే రిజైన్ చేయడం అంటే మాటలు కాదు అనుకుంటున్నారు. దాల్ మే కుచ్ కాలాహై అన్న చర్చ ఢిల్లీలో నడుస్తోంది. అసలు ధన్ ఖడ్ రిజైన్ తో మొదట షాక్ తిన్నవి విపక్షాలే. ఎందుకంటే తాము ఓ స్ట్రాటజీతో వస్తే ధన్ ఖడ్ వారికే షాక్ ఇచ్చారు. ఎవరి తీరుతోనైనా హర్ట్ అయ్యారా.. ఎవరి మాటలైనా బాధించాయా.. పదవికి ఎసరు వస్తుందని గ్రహించారా.. ముందే తప్పుకోవడం బెటర్ అనుకున్నారా.. తన లైన్ కు పార్టీ లైన్ కు తేడా ఉందనుకున్నారా.. కచ్చితమైన రాజకీయ కారణాలు ఏమున్నాయన్న చర్చలతో రకరకాల రాజీనామా సిద్ధాంతాలు తెరపైకి వస్తున్నాయ్.
నడ్డా చేసిన కామెంట్స్ హర్ట్ చేశాయా?
2027 దాకా టైమ్ ఉన్నప్పటికీ ధన్ ఖడ్ ఎందుకు రాజీనామా చేశారో అన్న విషయాలపై రకరకాల లెక్కలు తెరపైకి వస్తున్నాయ్. అందులో ఒకటి ఇప్పుడు మీరు చూడబోయేది. రైట్ చూశారుగా జేపీ నడ్డా కామెంట్స్. రాజ్యసభలో ఈయన లీడర్ ఆఫ్ ది హౌస్. ప్రతిపక్షాల ప్రశ్నలకు కౌంటర్లు ఇస్తూ నథింగ్ గో ఆన్ రికార్డ్.. తాను మాట్లాడేదే రికార్డులోకి వెళ్తుందన్నారు. బహుశా ఈ మాట ఏమైనా రాజ్యసభ ఛైర్మన్ హోదాలో ఉన్న ధన్ ఖడ్ ను హర్ట్ చేసిందా అన్నది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇంకా కొన్ని పాజిబులిటీస్ చూద్దాం.. సరే జగ్ దీప్ రాజీనామా చేయాలి అనుకుని ఉంటే.. రాజ్యసభ సమావేశాలకు ముందే అనౌన్స్ చేసి ఉండాలి అదీ జరగలేదు. పోనీ అనారోగ్య కారణాలైతే సభలోనే హుందాగా అనౌన్స్ చేసి ఉండాలి. అదీ జరగలేదు. వర్షాకాల సమావేశాల్లో రాజ్యసభను తొలి రోజు హుషారుగా హ్యాండిల్ చేశారు. ఎప్పటిలాగే ఆయన ప్రవర్తన కనిపించింది. ఇంకో హైలెట్ ఏంటంటే.. నిన్న సాయంత్రం అంటే జులై 21న జైపూర్ టూర్ షెడ్యూల్ రిలీజ్ అయింది. అంటే అప్పటి వరకు కూడా రాజీనామా ఆలోచన లేదు. రాత్రి తొమ్మిదిన్నరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ గ్యాప్ లో ఏం జరిగిందన్నదే టాప్ సీక్రెట్.
ఘనమైన వీడ్కోలూ కష్టమే..
ధన్ ఖడ్ రాజీనామా చేసిన 15 గంటల తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు. ఆరోగ్యం బాగుండాలని కోరుకున్నారు. మంత్రుల నుంచి ధన్‌ఖడ్‌కు ఎలాంటి అభినందనలు రాలేదు. ఫేర్ వెల్ స్పీచ్ కూడా కష్టమే. ఎందుకంటే ఫుల్ టర్మ్ పూర్తి చేసుకున్న వారికి ఘనంగా వీడ్కోలు పలకడం, ఫేర్ వెల్ స్పీచ్ ఉంటుంది. కానీ ఇవేవీ ధన్ ఖడ్ కు ఉండేలా కనిపించడం లేదు. సభ రెండో రోజు ధన్ ఖడ్ రాజ్యసభకు రాలేదు. దీంతో డిప్యూటీ చైర్మన్ జేడీయూ నాయకుడు హరివంశ్ నారాయణ్ సింగ్ సభను నిర్వహించారు. హరివంశ్ 2020 నుంచి ఈ పదవిలో ఉన్నారు. ఒక అంచనా ప్రకారం జేడీయూ హరివంశ్ ను రాజ్యసభ ఛైర్మన్ గా చేస్తారన్న ప్రచారం జరుగుతుంది. నితీష్ కుమార్ పేరు కూడా వినిపిస్తోంది. బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇదొక ప్లస్ పాయింట్ అవుతుందని ఎన్డీఏ లెక్కలు వేసుకుంటోంది. 68 ప్రతిపక్ష ఎంపీల సంతకాలతో వచ్చిన ఒక నోటీస్‌ను ధన్‌ఖడ్ పరిశీలించారు. ఆ నోటీస్ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మా ను తొలగించాలని కోరింది. ఆయన దీన్ని స్వీకరించారు. ఇదేమైనా ఎఫెక్ట్ చూపిందా అన్న చర్చ నడుస్తోంది. అలాగే సుప్రీం కోర్టు తీర్పులపైనా కీలకంగా మాట్లాడారు ధన్ ఖడ్. ఈ కామెంట్స్ ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారాయా అన్న చర్చ జరుగుతోంది.
రాజకీయాల్లో ప్రతిదీ సరిగ్గా ఉండదు. ఇది సరిగ్గా జగ్ దీప్ ధన్ ఖడ్ ఆకస్మిక రాజీనామాకు అతికినట్లు సరిపోతుంది. ఎందుకంటే ఉత్సాహంగా బీఏసీ సమావేశాలు నిర్వహించిన పెద్దాయన రాత్రికి రాత్రి రిజైన్ చేయడం అంటే కచ్చితంగా ఏదో పెద్ద విషయమే జరిగి ఉంటుందన్న చర్చ జరుగుతోంది. ఇది ఎప్పటికీ బయటకు వచ్చే అవకాశాలు లేవు. కేవలం ఊహాగానాలు తప్ప. మరి నెక్ట్స్ ఏం జరగబోతోంది?
గతంలో బెంగాల్ గవర్నర్‌గా పని చేసిన ధన్ ఖడ్
హర్ట్ అయితే రాజీనామా చేసే మనస్తత్వం జగ్ దీప్ ధన్ ఖడ్ ది కాదు. ఎందుకంటే ఆయన ఈ పదవిలోకి రాకముందు బెంగాల్ గవర్నర్ గా పని చేశారు. 2019 జులై 30 నుంచి 2022 జులై 18 వరకు బెంగాల్ గవర్నర్‌గా బాధ్యతల్లో ఉన్నారు. ఆయన పనితీరు చూసి ఉపరాష్ట్రపతి అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. వస్తూనే ఉపరాష్ట్రపతిగా, రాజ్యసభ ఛైర్మన్ గా తనదైన ముద్ర వేశారు. వయసు 74 అయినా ఉత్సాహంగా ఉండే వారు. రోజూ ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా బిజీ షెడ్యూల్ ఖరారు చేసుకునే వారు. తన అనుభవాలు చెప్పే వారు. ముఖ్యంగా విద్యార్థులను ఉత్సాహపరిచే వారు. అయితే రాజకీయాల్లో ఏదీ అనుకున్నట్లుగా జరగదు. అనుకున్నట్లుగా ఉండదు కదా. జగ్ దీప్ విషయంలో ఇదే జరిగింది.
ఉపరాష్ట్రపతిని అవమానించారన్న కాంగ్రెస్
బీఏసీ సమావేశం పెడితే రాజ్యసభ లీడర్ రావాలి. ఆ పదవిలో నడ్డా ఉన్నారు. బీఏసీ పెట్టేది రాజ్యసభ ఛైర్మన్. సీన్ కట్ చేస్తే ఉదయం జరిగిన BACకి వచ్చారు. రెండో బీఏసీ మీటింగ్ కు నడ్డా, రిజిజు రాలేదు. ముఖ్యమైన పనిలో బిజీగా ఉన్నారని, రాజ్యసభ ఛైర్మన్ కు ముందుగానే తెలియజేశామని నడ్డా చెప్పుకొచ్చారు. ఉపరాష్ట్రపతిని అవమానించారని కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది. నిజంగా ఏం తప్పు జరిగిందో చెప్పాలంటున్నారు. జులై 21న BAC నుండి కేంద్రమంత్రులు నడ్డా, రిజిజు ఉద్దేశపూర్వకంగా గైర్హాజరు కావడానికి అలాగే 21న మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 4:30 గంటల మధ్య చాలా తీవ్రమైన విషయంలో ఏదో జరిగే ఉంటుందని జైరాం రమేశ్ అనుమానం వ్యక్తం చేస్తూ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. జగ్ దీప్ తీరుపై సొంత పార్టీ, ప్రభుత్వమే అసంతృప్తిగా ఉందా అన్న చర్చ జరిగింది.
మై వే.. లేదంటే హైవే.. ఇదే ధన్ ఖడ్ పాలసీ
ధన్ ఖఢ్ పొజిషన్ ఏంటంటే.. MY WAY or HIGHWAY అప్రోచ్ ఉంటుంది. ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడుతారు. ముక్కుసూటిగా ఉంటారు. చమత్కరిస్తారు. చలాకీగా ఉంటారు. సీనియర్ మోస్ట్ లాయర్ కూడా. ముఖ్యంగా న్యాయవ్యవస్థపై ఆయన చేసిన పదునైన వ్యాఖ్యలకు సంబంధించి, ప్రభుత్వంలోని కొంతమందికి కోపం తెప్పించి ఉండొచ్చు అంటున్నారు. జాతీయ న్యాయ నియామకాల కమిషన్ చట్టాన్ని రద్దు చేసినందుకు సుప్రీంకోర్టు తీరుపైనా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయంపై కాంగ్రెస్ తీవ్రంగా రియాక్టైంది. ఉపరాష్ట్రపతి రాజీనామా వెనుక కారణాలు ఆయన చెప్పిన ఆరోగ్య సమస్యల కంటే చాలా లోతైనవన్నది. ఆరోగ్య కారణాలను గౌరవించాలి. కానీ ఆయన రాజీనామాకు చాలా లోతైన కారణాలు ఉన్నాయన్నది కూడా వాస్తవం అని విపక్షాలు అంటున్నాయి. అంతే కాదు ధన్ ఖడ్ తన మనసు మార్చుకునేలా ఒప్పించాలని కాంగ్రెస్ నేతలు ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు కూడా. ధన్ ఖడ్ తీసుకున్న ఈ అసాధారణ నిర్ణయం వెనుక కారణాలను మోడీ, అమిత్ షా మాత్రమే వివరించగలరని సీపీఐ అన్నది. కచ్చితంగా చెప్పాలంటే ఆయన ఆరోగ్య కారణాల వల్ల రాజీనామా చేయలేదని, సభను నడపడంలో ఆయన చాలా ఉత్సాహంగా కనిపించి ఎలా రిజైన్ చేస్తారని క్వశ్చన్ చేస్తున్నారు.
Also Read: గాడిలో పెడతారా? వదిలేస్తారా? బండారు శ్రావణిపై బాబు ప్లాన్ ఏంటి?
విపక్షాల తీర్మానానికి ప్రాధాన్యత ఇచ్చారా?
జస్టిస్ వర్మపై ప్రభుత్వం అభిశంసన తీర్మానాన్ని ఉభయ సభలలో ప్రవేశపెట్టాలనుకున్నదని, అయితే ధన్ ఖడ్ ఊహించని విధంగా BAC సమావేశంలో ప్రతిపక్ష తీర్మానాన్ని ప్రస్తావిస్తూ, మరుసటి రోజు మధ్యాహ్నం 1 గంటలకు దానిని చర్చకు తీసుకుంటానని ప్రకటించడంతో ఆశ్చర్యపోవడం ఎన్డీఏ వంతైందంటున్నారు. అంతే కాదు.. ధన్ ఖడ్ కొంతకాలంగా పార్టీ పరంగా అబ్జర్వేషన్ లో ఉన్నారన్న చర్చ కూడా తెరపైకి వస్తోంది. ఉపరాష్ట్రపతి హోదాలో ఆయన ప్రవర్తిస్తున్న తీరు తగదన్న హెచ్చరికలు ఇంటర్నల్ గా వచ్చాయన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఈ వ్యవహారం ఎందుకని ముందస్తుగానే రిజైన్ చేశారంటున్నారు. సో కారణాలు ఏవైనా ధన్ కఢ్ రాజీనామా ఒక్కసారిగా దేశ రాజకీయాలను షేక్ చేసింది. ఇప్పుడు ఆ పదవిని జేడీయూకి ఇవ్వడం ద్వారా బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బెనిఫిట్ పొందడం లేదంటే వేరే నాయకుడికి పగ్గాలు అప్పగించడం విషయంలో ఏం జరుగుతుందన్నది చూడాలి.
Story By Vidya Sagar, Bigtv