HHVM First Review: శ్రీ మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏఎం రత్నం (AM Ratnam) అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న చిత్రం హరిహర వీరమల్లు (Harihara Veeramallu). ప్రముఖ డైరెక్టర్ జ్యోతి కృష్ణ (Jyoti Krishna) దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య జూలై 24న థియేటర్లలో విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో అభిమానులలో అంచనాలు మరింత పెరిగిపోయాయి.. అయితే ఇప్పుడు ఆ అంచనాలను రెట్టింపు చేసేసారు యూట్యూబర్ నా అన్వేషణ అన్వేష్ (Anvesh). ఇకపోతే ఈ మధ్యకాలంలో బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్న వారిపై కొరడా ఝులించిన అన్వేష్.. రియల్ హీరో సోనూసూద్ ను సైతం వదలలేదని చెప్పవచ్చు. అలాంటి ఈయన ఇప్పుడు తాజాగా హరిహర వీరమల్లు సినిమా చూశానని, తన ఫస్ట్ రివ్యూ ఇదే అంటూ ట్విట్టర్ వేదికగా ఒక వీడియో పోస్ట్ చేశారు.
వీరమల్లు ఫస్ట్ రివ్యూ ఇదే – నా అన్వేషణ అన్వేష్..
నా అన్వేషణ అన్వేష్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా..” ఇప్పుడే హరిహర వీరమల్లు సినిమా చూశాను. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రస్తుతం నేను సౌత్ ఆఫ్రికా లో ఉన్నాను. హరిహర వీరమల్లు పై నా మొదటి అభిప్రాయాన్ని పంచుకుంటున్నాను. సినిమా అదిరిపోయింది. చారిత్రాత్మక సినిమాలో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఒదిగిపోయారు”. అంటూ తెలిపారు.
హరిహర వీరమల్లు స్టోరీ, ట్విస్ట్ ఇదే..
“ఈ సినిమాలో మీరు ఊహించని ట్విస్ట్ బాలయ్య బాబు(Balayya babu)ఎంట్రీ. ఇప్పటివరకు ఈ సినిమాలో బాలయ్య బాబు భాగమైనట్లు ఎక్కడ చూపించలేదు. అదే ఈ సినిమాకి అతి పెద్ద ట్విస్ట్. హరిహర వీరమల్లు మనవడు శ్రీకృష్ణదేవరాయ పాత్రలో బాలయ్య బాబు ఎంట్రీ అదిరిపోయింది. ఈ పాత్ర ముందు పవన్ కళ్యాణ్ పాత్ర కూడా కాస్త తక్కువ అని చెప్పాలి. బాలయ్య బాబు శ్రీకృష్ణదేవరాయ పాత్రలో తెరపై కనిపిస్తుంటే చూసే ఆడియన్స్ రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఒక రకంగా చెప్పాలంటే గూస్ బంప్స్ వచ్చేసాయి. సినిమా ఓవరాల్ గా బ్లాక్ బాస్టర్ హిట్టు. రికార్డు కలెక్షన్స్ మోత మోగాల్సిందే. ఇలాంటి సినిమా మళ్లీ రాదు..” అంటూ సినిమాపై ఒక రేంజ్ లో హైప్ పెంచిన అన్వేష్.. సడన్గా అసలు ఎవరూ ఊహించని ట్విస్ట్ ఇచ్చి ఆడియన్స్ ను బోల్తా కొట్టించారు.
Bomma blockbuster 🤯
Expect cheyle assalu… #HHVM pic.twitter.com/2bwFmUeTor— SᴜƦʏᴀ.. 🧧 (@Wolverine9121) July 22, 2025
రివ్యూయర్లపై మండిపడ్డ అన్వేష్..
థంబ్ నెయిల్ పెట్టి ఫస్ట్ రివ్యూ అంటూ ట్విట్టర్లో తెగ హల్చల్ చేసిన అన్వేష్ అంతలోనే యూట్యూబ్ ద్వారా ఒక వీడియో రిలీజ్ చేస్తూ.. అసలు విషయాన్ని తెలియజేస్తూ.. రివ్యూలు ఇవ్వడం వల్ల కలిగే నష్టాలపై కామెంట్ చేస్తూనే.. రివ్యూ ఇచ్చే వారిపై మండిపడ్డారు. “సినిమా రివ్యూ ఎవరికి అవసరం. ఒక ప్రొడక్ట్ కి రివ్యూ అనేది కంపల్సరీ. కానీ ఎంటర్టైన్మెంట్ అయిన సినిమాకి రివ్యూ ఎందుకు. ఒక బృందం ఏళ్ల తరబడి కష్టపడి కోట్లకు కోట్లు ఖర్చుపెట్టి సినిమా చేస్తే.. రివ్యూయర్ లు మాత్రం కేవలం వంద రూపాయలు పెట్టి, సినిమా చూసేసి ఆ సినిమా భవిష్యత్తుని ఒక్క ఐదు నిమిషాల్లో తేల్చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ రివ్యూయర్ లపై ఒక రేంజ్ లో మండిపడ్డారు అన్వేష్. మీరు ఇచ్చే రివ్యూ కారణంగా పెద్ద హీరోలకు పెద్దగా నష్టం ఉండదు. నిర్మాతలు నష్టపోతారు.
చిన్న హీరోల జీవితాలను చిదిలం చేస్తున్నారు – అన్వేష్
కానీ అదే చిన్న హీరో సినిమాకి నెగిటివ్ రివ్యూ ఇచ్చారు అంటే.. నెక్స్ట్ వారికి కెరియర్ ఉంటుందా? వీటన్నింటినీ ఎందుకు ఆలోచించడం లేదు? అసలు రివ్యూ ఎవరికి అవసరం? దేనికి అవసరం? సినిమా చూశాక ఒక ఆడియన్ మంచి ఫీల్ తో బయటికి రావాలి తప్ప.. మీరు ఇచ్చే రివ్యూ వల్ల సినిమాకి ఎంత నష్టం వస్తుందో ఆలోచించారా? ఏదైనా సరే ఒక సినిమా చూడకముందే రివ్యూ చెప్పేస్తే.. ఇక ఆ సినిమా థియేటర్లో చూడాలన్న ఆలోచన కూడా రాదు. ఆడియన్స్ ఎక్స్పీరియన్స్ ని స్పాయిల్ చేస్తున్నారు..” అంటూ తనదైన స్టైల్ లో మండిపడ్డారు అన్వేష్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారుతోంది.