Delhi Crime: పెళ్లయ్యింది.. కానీ దాంపత్య జీవితంలో ఎలాంటి సంతోషాలు లేవు. చివరకు పని చేయాల్సిన భర్త జూదానికి అలవాటు పడ్డాడు. ఆపై అప్పులు చేశాడు. ఆర్థికభారం పెరిగి ఆ ఇంటి ఇల్లాలిపై పడింది. చివరకు భర్తను చంపేసింది. సంచలనం రేపిన ఈ ఘటన ఢిల్లీలో వెలుగుచూసింది.
ఢిల్లీలో నిహాల్ విహార్‌లో ఓ జంట నివాసం ఉంటోంది. యూపీకి చెందిన ఇర్ఫాన్-ఫర్జానా ఖాన్ వివాహం జరిగింది. కొద్దిరోజుల తర్వాత ఢిల్లీకి మకాం మార్చారు. పెళ్లయిన నుంచి దాంపత్య జీవితంగా సరిగా సాగలేదు. అయితే ఇర్ఫాన్‌కు జూదం అలవాటు ఉండేది. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో జూదం ఆడేవాడు.
బయటకు వెళ్లి గంటల గంటలు గడిపేవాడు. సమయానికి ఇంటికి వచ్చేవాడు కాదు. ఆటకు బానిసైన ఇర్ఫాన్ అప్పులు చేశాడు. కానీ భర్త ప్రవర్తనలో ఏలాంటి మార్పు రాలేదు. కనీసం శారీరకంగా భార్యని సుఖ పెట్టలేదు. భర్త వ్యవహరశైలిపై విసిగిన ఆమె చంపేసింది. అయితే ఈ కేసు ఎలా బయటకు వచ్చింది? అన్నదే అసలు పాయింట్.
మూడు రోజుల కిందట ఆదివారం సాయంత్రం సంజయ్ గాంధీ ఆసుపత్రిలో ఓ వ్యక్తి మరణించినట్లు పోలీసులకు సమాచారం వెళ్లింది. గాయాలతో ఉన్న ఇర్ఫాన్‌ను సోదరుడు ఆసుపత్రికి తీసుకొచ్చాడు. ట్రీట్‌మెంట్ తీసుకున్న సమయంలో మరణించాడు. అక్కడికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేశారు.
ALSO READ: అమ్మను అవమానించాడని పదేళ్లు వెతికి మరీ హత్య
కేసు విచారణలో భాగంగా తొలుత ఇర్ఫాన్ భార్య ఫర్జానాను పోలీసులు ప్రశ్నించారు. భర్త మరణాన్ని ఆత్మహత్య చిత్రీకరించే ప్రయత్నం చేసింది. ఆమె చెబుతున్న సమాధానాలు పొంతన లేకుండా ఉండడంతో పోలీసులకు అనుమానాలు వచ్చాయి. చివరకు గుచ్చి గుచ్చి తమదైన శైలిలో ప్రశ్నించారు.
పోలీసులు ఆమె వద్దనున్న ఫోన్ తీసుకుని పరిశీలించారు. అందులో వ్యక్తిని ఎలా చంపాలి? అనేదానిపై పదే పదే వెతికినట్టు కనిపించింది. దీంతో ఆమెని తమదైన శైలిలో ప్రశ్నించడంతో అసలు గుట్టు బయటపెట్టింది. నేరాన్ని తాను చేశానని అంగీకరించింది. ఇంతకీ పోలీసుల విచారణలో ఏం చెప్పింది? అన్నదే అసలు పాయింట్.
పోలీసుల విచారణలో ఊహించని విషయాలు బయటపెట్టింది నిందితురాలు ఫర్జానాఖాన్. భర్త శారీరకంగా తనను సంతృప్తి పరచలేకపోయాడని చెప్పింది. ఆన్‌లైన్ జూదం ఆడడం వల్ల భారీగా అప్పుడు చేశాడని పేర్కొంది. అప్పులు ఇచ్చినవాళ్లు ప్రతీ రోజు ఇంటికి వచ్చి రభస చేసేవారని గుర్తు చేసింది. భర్త బంధువుతో వివాహేతర సంబంధం ఉన్నట్లు అంగీకరించింది.
ఈ మూడు కారణాలు ఇర్ఫాన్ హత్యకు కారణంగా పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. తొలుత జూదంలో నష్టాలు రావడంతో అప్పుడు చేశాడని, వాటిని అధిగమించలేక తనను తాను కత్తితో పొడుచుకున్నాడని పోలీసులకు చెప్పే ప్రయత్నం చేసింది. చివరకు పోస్టుమార్టం నివేదికలో హత్యగా తేలింది. ఆమెని అరెస్టు చేశారు పోలీసులు.