BigTV English
Advertisement

KTR vs Harish Rao: కేటీఆర్ కొత్త డ్రామా.. హరీష్‌కు చెక్ పెట్టడానికేనా?

KTR vs Harish Rao: కేటీఆర్ కొత్త డ్రామా.. హరీష్‌కు చెక్ పెట్టడానికేనా?

KTR vs Harish Rao: గులాబీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అటు పార్టీలో ఇటు ప్రభుత్వంలో నెంబరు టూగా కేటీఆర్ చక్రం తిప్పారు. నెక్స్ట్ సీఎంగా పార్టీ నేతలు ఆయన్ని ఫోకస్ చేసుకున్నారు. కేసీఆర్ కూడా తన తనయుడికే ప్రాధాన్యత ఇచ్చారు. అప్పుడు కేసీఆర్ అప్పగించిన బాధ్యతలు నిర్వర్తించుకుంటూ వచ్చిన హరీష్‌రావు.. ఇప్పుడు పార్టీపై గ్రిప్ కోసం స్పీడ్ పెంచుతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. వ్యూహత్మకంగా అడుగులు వేస్తూ పార్టీలో కేటీఆర్‌కి చెక్ పెట్టడానికి చూస్తున్నారంట. దాంతో అలెర్ట్ అయిన కేటీఆర్ తానే నెంబర్ టూ అనిపించుకోవడానికి హడావుడి మొట్టినట్లు కనిపిస్తున్నారు. ఆయన ఎక్కడి కెళ్లినా భజనపరులు సీఎం, సీఎం అన్ని నినాదాలతో హోరెత్తించడం అందులో భాగమే అంటున్నారు.


పదేళ్లు పవర్‌లో ఉన్నప్పుడు అటు పార్టీలో ఇటు ప్రభుత్వంలో సర్వం కేసీఆరే అన్నట్లు వ్యవహారం నడిచింది. అధికారం కోల్పోయాక పార్టీపై కేసీఆర్ పార్టీపై కూడా పట్టు కోల్పోతున్నారన్న అభిప్రాయం గులాబీ శ్రేణుల్లోనే వ్యక్తం అవుతోంది.. అందుకు తాజాగా జరుగుతున్న పరిణామాలనే ఉదాహరణగా చూపిస్తున్నారు. శాసన సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న కేసీఆర్ మౌనముని అవతారమెత్తారు. బడ్జెట్ రోజు ఒక్కసారి అసెంబ్లీకి హాజరై మళ్లీ అటు వైపు చూడలేదు వరదలు వచ్చి ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నా కనీసం నోరెత్త లేదు.. ఎమ్మెల్యేలు, నేతలు పార్టీ వదిలిపోతున్నా స్పందించడం లేదు. మధ్యమధ్యలో పూజలు, యాగాలు చేసుకుంటూ ఫామ్‌హౌస్‌కే పరిమితం అయ్యారు.

కేసీఆర్ లేని గ్యాప్ పూడుస్తూ హరీష్ రావు అప్రకటిత ప్రతిపక్ష నాయకుడి అవతారం ఎత్తారు.. దూకుడు ప్రదర్శించడంలో కాని, వాగ్దాటిలో కాని హరీష్‌రావు తో కేటీఆర్ పోటీ పడలేరని బీఆర్ఎస్ నేతలే చెపుతుంటారు. మీడియా సమావేశాలు. మీడియా ప్రతినిధులతో చిట్ చాట్, ప్రభుత్వానికి వ్యతిరేకంగా యక్స్ లో పోస్ట్ లు చేయడం లాంటి వాటి వరకు కేటీఆర్ ఒకే కాని.. వీధి పోరాటాలు అంటే మాత్రం కేటీఆర్‌తో కాని పని అని గులాబీ క్యాడర్ బహిరంగంగానే చెప్తుంది. ఆ విషయంలో హరీష్‌రావుతో కేటీఆర్ పోటీ పడలేరన్నది నిజంగానే వాస్తవం.


ఇలాంటి పరిస్థితుల్లో హరీష్ రావు ఏ చిన్న అవకాశం దొరికినా వదలకుండా దానిని తనకు అనుకూలంగా మల్చుకుంటున్నారు. తనదైన దూకుడుతో క్యాడర్‌తో భేష్ అనిపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అపర చాణక్యుడు అయిన కేసీఆర్ ఇదంతా గమనించకుండా ఉంటారా అన్న చర్చ పార్టీ శ్రేణుల్లో నడుస్తోంది. అయితే అధికారంలో ఉన్నప్పుడు కెసిఆర్ అంటే అందరూ భయపడ్డారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదని పార్టీ వారే అంటున్నారు. భవిష్యత్తులో హరీష్ రావు ప్రమాదాన్ని గుర్తించే రెండో సారి అధికారంలోకి వచ్చాక ఆయనకి మొదట్లో మంత్రి పదవి ఇవ్వకుండా కేసీఆర్ పక్కన పెట్టారంటారు.

Also Read: రూట్ మార్చిన కేటీఆర్, హరీష్.. అధికారులకు బెదిరింపులు.. కుయుక్తులకు స్కెచ్?

ఈటల రాజేందర్‌ను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేశాక హరీష్ రావును కేసీఆర్ దగ్గరికి తీశారు.. లేదంటే పరోక్షంగా ఈటలతో చేతులు కలిపే ప్రమాదం ఉందని కేసీఆర్ గుర్తించడమే కాకుండా.. తెలివిగా ఉప ఎన్నికలలో ఈటలను ఓడించే బాధ్యత కూడా హరీష్ భుజాలపై పెట్టారన్న వాదన ఉంది. అయితే ఇప్పుడు హరీష్‌రావు ను కంట్రోల్ చేయగలిగిన స్థితిలో కేసీఆర్ లేరన్నది గులాబీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.. ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ రోడ్ల పైకి వచ్చి పోరాటాలు చేసే పరిస్థితి లేదంటున్నారు.

పదేళ్లు సీఎంగా పనిచేసిన ఆయన తిరిగి పోరుబాట పట్టలేరని.. ప్రస్తుతుమున్న పరిస్థితుల్లో వయస్సు, ఆరోగ్యం కూడా కేసీఆర్‌కు సహకరించవన్న సంగతి హరీష్‌రావుకి తెలియని సంగతి కాదంటున్నారు. అటు కేటీఆర్‌ను చూస్తే కేసీఆర్ తరహాలో రాజకీయం చేయలేరు… తండ్రి స్టైల్లో దూకుడు ప్రదర్శించలేరన్న టాక్ ఉంది. అందుకే ప్రతిపక్షంలో ఉండే ఈ అయిదేళ్లు అటు క్యాడర్ ఇటు ప్రజలలో తన ఇమేజ్‌ మరింతపెంచుకునే దిశగా హరీష్ అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తున్నారు.

బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్ళు అంతకు ముందు ఉద్యమ సమయంలో మీడియా సమావేశాలు పెట్టాలంటే కేసీఆర్ పర్మిషన్ తీసుకోవాల్సి వచ్చేది. మంత్రులు సైతం కేసీఆర్ అంటే భయపడే పరిస్థితులు ఉండేవి .. కాని అధికారం కోల్పోయాక ఆ పరిస్థితి కనపడడం లేదు .. బావబామ్మరుదులైన కేటీఆర్, హరీష్‌రావు ల మధ్య పార్టీలో వారసత్వ పోటీ ఉండడం సహజమే .. ఆ క్రమంలో కరుడుగట్టిన గులాబీ కేడర్ హరీష్ వెన్నంటే ఉన్నట్లు కనిపిస్తుంది.

అది గమనించారో ఏమో కేటీఆర్ అలెర్ట్ అవుతున్నట్లు కనిపిస్తుంది. ఈ మధ్య ఆయన బయటకు వస్తే భజనపరులు సీఎం, సీఎం అంటూ స్లోగన్స్‌తో హోరెత్తిస్తున్నారు. అదంతా అరెంజ్డ్ డ్రామానే అని ఫ్యూచర్‌లో పార్టీకి తానే దిక్కని చెప్పుకోవడానికి కేటీఆరే ఆ మెలో డ్రామా నడిపిస్తున్నారన్న వాదన వినిపిస్తుంది. అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ మనుగడ ఏంటో ఆ పార్టీ నేతలకే అంతుపట్టడం లేదు.. మరిలాంటి పరిస్థితుల్లో చిన్నబాస్ సీఎం ఆశలేంటో ఆయనకే తెలియాలి.

Related News

Kalvakuntla Kavitha: కవిత టార్గెట్.. కారు పార్టీ.. టచ్‌లో ఆ నేతలు?

Vijayanagaram TDP: టీడీపీ జిల్లా.. రథసారథి ఎవరో?

Jubilee Hills Bypoll: కాంగ్రెస్ మైలేజ్ తగ్గిందా? ప్రచారంపై అధిష్టానం నిఘా

Rajamohan Reddy: మేకపాటి మాటలు.. జగన్ చెవిలో పడేనా?

JC Brothers: జేసీ బ్రదర్స్.. టార్గెట్ పోలీస్!

DCC Presidentship: మేడిపల్లికి.. డీసీసీ పగ్గాలు

Malepati Subbanayudu: కావలి టీడీపీలో రగిలిన వర్గపోరు..

Jubilee Hills Bypoll:జూబ్లీహిల్స్ బైపోల్.. ప్రచారాల్లో కనిపించని ఆ ఇద్దరు కీలక నేతలు..?

Big Stories

×