BigTV English

Molathadu: మగాళ్లకు మొలతాడు తప్పకుండా ఉండాల్సిదేనా? లేకపోతే ఏమవుతుంది?

Molathadu: మగాళ్లకు మొలతాడు తప్పకుండా ఉండాల్సిదేనా? లేకపోతే ఏమవుతుంది?

మగ బిడ్డ పుట్టిన వెంటనే మొలకు తాడు కట్టేస్తారు. ప్రతి మగపిల్లాడికి మొలతాడు ఉండాల్సిందేనని చెబుతారు. హిందూ సంప్రదాయంలో మొలతాడుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. నడుముకు కాస్తా కింద భాగంలో ఈ తాడును కడతారు. కొంతమంది నలుపు దారంతో కడితే మరెందరో ఎరుపు దారంతో కడతారు. ఇంకొందరు వెండి మొలతాడును కూడా వేసుకుంటారు. దీనికి ఆధ్యాత్మిక కారణమే కాదు ఆరోగ్య రహస్యం కూడా దాగి ఉంది.


మొలతాడును మొదట ఆధ్యాత్మికపరంగానే చూస్తారు. హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం మొలతాడు కట్టడం వల్ల చెడు దృష్టి ఆ పిల్లలపై పడదని అంటారు. అంతేకాదు ఒంటి మీద ఒక దారం కూడా లేని పరిస్థితి ఎప్పుడూ ఉండకూడదు. స్నానం చేసేటప్పుడైనా కూడా పిల్లల ఒంటిపై ఒక దారపు పోగైన ఉండాలని చెప్పుకుంటారు. అందుకోసమే మొలతాడును కడతారని అంటారు.

అనారోగ్య సమస్యలు దరిచేరవట


హిందూ ధర్మ శాస్త్రం ప్రకారం ఎన్నో ఆచారాలు, నమ్మకాలు ఉన్నాయి. వాటిల్లో మొలతాడు కూడా ఒకటి. మగపిల్లాడు పుట్టిన కొన్ని రోజులకి ఈ మొలతాడును పిల్లలకు వేస్తారు. మొలతాడు కట్టే పిల్లలపై దుష్టశక్తుల ప్రభావం ఉండదని అనుకుంటారు. అలాగే దిష్టి తగలదని, అనారోగ్య సమస్యలు రావని కూడా చెబుతూ ఉంటారు.

విషానికి ‘విరుగుడు’

మొలతాడు వెనక మరొక కథనం కూడా ఉంది. పూర్వకాలంలో ఆసుపత్రుల్లాంటివి ఉండేవి కాదు. ఆయుర్వేద పద్ధతుల్లోనే ఆకులు, పసరులతో వైద్య చికిత్సలు చేసేవారు. అయితే పూర్వం పాములు, తేళ్లు కూడా ఎక్కువగానే మనుషులను కరుస్తూ ఉండేవి. ఒకవేళ కరిస్తే ఆ భాగంలో వెంటనే మొలతాడును విప్పి ఆ తాడుతోనే గట్టిగా కట్టి విషం తీసే వారని చెప్పుకుంటారు. అందుకోసమే మొలతాడు కట్టుకునేవారు అని కూడా అంటారు.

సంతానోత్పత్తి పెంచుతుందా?

హిందూ ధర్మ శాస్త్రంలో మొలతాడును ఒక పవిత్రమైన దారంగా భావిస్తారు. ఇది శివునితో అనుబంధాన్ని కలిగి ఉంటుందని, పురుషుల సంతానోత్పత్తి సామర్ధ్యాన్ని పెంచుతుందని చెప్పుకుంటారు. జైనుల్లో కూడా మొలతాడు కట్టుకునే ఆచారం ఉంది. వారు మొలతాడును జనేవు అని పిలుస్తారు. ఇది ఆధ్యాత్మికంగా స్వచ్ఛతను అందించే తాడుగా చెబుతారు.

నల్ల తాడే కట్టాలా?

జాతక రీత్యా ఉండే దోషాలను తగ్గించేందుకు కూడా ఈ మొలతాడుకు కొన్ని రకాల తాయత్తులను కట్టి నడుముకు కడతారు. నల్లటి తాడునే ఎంచుకోవడానికి కూడా ప్రధాన కారణం ఉంది. నల్లటి తాడుకు నెగిటివ్ ఎనర్జీని పోగొట్టే శక్తి ఉంటుంది. దీనివల్ల ఈ తాడును కట్టుకున్న వారు చెడు చూపు బారిన పడరని అంటారు. చిన్న వయసులో ఆడపిల్లలకు కూడా మొలతాడును కడతారు. కానీ పెద్దయ్యాక వారికి దాని అవసరం ఉండదు. కానీ పురుషులకు మాత్రం మొలతాడు జీవితాంతం ఉండాల్సిందే.

పేగులపై ఒత్తిడి పడకుండా..

మొలతాడు కట్టడం వల్ల ఆరోగ్యపరంగా కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని సైన్స్ చెబుతోంది. ముఖ్యంగా హెర్నియా అని పిలిచే వ్యాధి రాకుండా మొలతాడు అడ్డుకుంటుందని అంటారు. హెర్నియా రావడానికి ప్రధాన కారణం బరువులు ఎత్తడం. ఇలా బరువులు ఎత్తినప్పుడు పొట్టలోని పేగులు మీద తీవ్ర ఒత్తిడి పెరిగిపోతుంది. దీనివల్ల అవి వాటి స్థానాల నుంచి స్థానభ్రంశం చెందుతాయి.

Also Read: భోజనాన్ని వంటగదిలో నేలపై కూర్చుని తింటేనే ఆరోగ్యమట, ఎలానో తెలుసుకోండి

ఇది ఒక్కోసారి ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంది. ఆ పేగులు వృషణాల్లోకి జారితే హెర్నియా వచ్చినట్టు చెబుతారు. ఇలా మొలతాడు కట్టుకోవడం వల్ల పేగులకు సపోర్టు దొరుకుతుందని చెప్పుకుంటారు. ఇలా మొలతాడు కట్టుకునే వారిలో హెర్నియా వ్యాధి వచ్చే అవకాశం కూడా చాలా తక్కువ అని అంటారు. ఏది ఏమైనా పురాతన కాలం నుంచి మొలతాడు కట్టుకోవడం అనేది ప్రధాన పనిగా మారిపోయింది.

Related News

Hair Growth Tips: ఈ టిప్స్ పాటిస్తే.. వారం రోజుల్లోనే ఒత్తైన జుట్టు !

Gut Health: గట్ హెల్త్ కోసం.. ఎలాంటి ఆహారం తినాలి ?

Cucumber Benefits: దోసకాయ తింటే.. నమ్మలేనన్ని లాభాలు !

Mint Leaves: తులసి ఆకులు నేరుగా తింటే ప్రమాదమా? ఏమవుతుంది?

Liver Health: మీరు చేసే ఈ పొరపాట్లే.. లివర్ డ్యామేజ్‌కి కారణం !

Eye Care: కంటి సమస్యలు రాకూడదంటే.. ఎలాంటి టిప్స్ పాటించాలి ?

Big Stories

×