BigTV English

KTR – Harish rao: రూట్ మార్చిన కేటీఆర్, హరీష్.. అధికారులకు బెదిరింపులు.. కుయుక్తులకు స్కెచ్?

KTR – Harish rao: రూట్ మార్చిన కేటీఆర్, హరీష్.. అధికారులకు బెదిరింపులు.. కుయుక్తులకు స్కెచ్?

కోవర్టుల కుట్ర..!
⦿ ప్రభుత్వంపై బావ, బావమరిది కుయుక్తులు
⦿ అధికారులను కోవర్టులుగా మార్చే పన్నాగాలు
⦿ వచ్చేది మా ప్రభుత్వమేనంటూ బెదిరింపులు
⦿ ప్రజలు చీదరించుకున్నా మారని కేటీఆర్, హరీష్ బుద్ధి


⦿ కాంగ్రెస్ ప్రభుత్వంపై అదేపనిగా గులాబీ కుట్రలు
⦿ ఇప్పటికే ప్రతీ విషయంలో అనవసర రాద్ధాంతం
⦿ కొత్తగా అధికారులను సైతం బెదిరిస్తున్న వైనం
⦿ ప్రభుత్వంలో ఏం జరిగినా చెప్పాలని ఆర్డర్లు
⦿ వినకపోతే పాత విషయాలను తవ్వి తీసి వార్నింగులు
⦿ ప్రభుత్వం నిలబడుదు.. నెక్స్ట్ తామేనంటూ బ్రెయిన్ వాష్
⦿ ఉద్యోగ సంఘాల నేతలు ఎవరు కలిసినా ఇదే తంతు
⦿ ప్రజలు ఓడించినా గులాబీ నేతల అహంకారం తగ్గలేదని చర్చ
⦿ కేటీఆర్, హరీష్ ఒత్తిడిపై ఉద్యోగుల్లో ఆందోళన
⦿ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయం

స్వేచ్ఛ ఇన్వెస్టిగేషన్ టీం: KTR – Harish rao: తెలంగాణను పదేళ్లు పాలించింది బీఆర్‌ఎస్. అది చేశాం, ఇది చేశాం అని చెప్పుకున్నా ప్రజలు మాత్రం మూడోసారి ఛాన్స్ ఇవ్వలేదు. దానికి కారణాలు అనేకం. అప్పటి ఎమ్మెల్యేలపై ప్రజల్లో పెరిగిన వ్యతిరేకత, అవినీతి మరకలు, అనేక అంశాల్లో జనం అవస్థలు, ఇలా అన్నీ కలిసి బీఆర్ఎస్ ఓటమికి కారణమయ్యాయి. కేసీఆర్‌ను ఫాంహౌస్‌కు పరిమితం చేశాయి. అయితే, పదేళ్లు పాలించి సడెన్‌గా ప్రతిపక్ష హోదా దక్కేసరికి ఇప్పటికీ గులాబీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా కేటీఆర్, హరీష్ రావుకు ఫ్రస్ట్రేషన్ పెరిగి కుట్రలకు తెరతీశారన్న చర్చ జరుగుతోంది. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా, అందులో మంచిని కంటే చెడును వెతుకుతూ, ఏమీ లేకపోతే చెడును క్రియేట్ చేసి మరీ బద్నాం చేసే కుట్రలు చేస్తున్నారని కొన్ని ఘటనలను ఉదాహరణగా చెబుతున్నారు హస్తం నేతలు. ఇదే సమయంలో ఉద్యోగుల మాటున చేసేందుకు చూస్తున్న గులాబీ కుట్ర ఒకటి వెలుగుచూసింది.


ఉద్యోగులకు బెదిరింపులు
రాష్ట్రంలో పదేళ్లపాటు బీఆర్ఎస్ ఆడిందే ఆటగా సాగింది. అధికారులను ఇష్టం వచ్చినట్టు వాడుకున్నారు. కొందరి చేత చేయకూడని పనులు కూడా చేయించారు. దాని ఫలితంగా ఇప్పుడు కొందరు అధికారులు కేసుల్లో ఇరుక్కుని అవస్థలు పడుతున్నారు. అయినా కూడా కేటీఆర్, హరీష్ రావు రేవంత్ ప్రభుత్వంపై కుట్రలు చేస్తూ, ఇప్పటికీ అధికారులను వాడుకునేందుకు ప్లాన్స్ చేస్తున్నారు. ప్రభుత్వంలో ఏం జరిగినా తమకు చెప్పాలని బెదిరింపులకు పాల్పడుతున్నారు. గతంలో వారితో ఉన్న డీలింగ్స్ కారణంగా ఉద్యోగులు కక్కలేక మింగలేక, ఏం చేయాలో పాలుపోక అయోమయంలో పడ్డారు.

ప్రభుత్వం కూలిపోతుందని బ్రెయిన్ వాష్
ఆరు నెలల్లో ప్రభుత్వం కూలిపోతుంది, నెక్స్ట్ వచ్చేది మా ప్రభుత్వమేనంటూ ఉద్యోగుల్ని బెదిరిస్తున్న కేటీఆర్, హరీష్ రావు, సీఎంగా రేవంత్ ఎన్నాళ్లు ఉంటారో చూస్తామని వారితో మాట్లాడుతున్నట్టు తెలిసింది. తమకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే తామొచ్చాక మీ అంతు చూస్తామని వార్నింగులు ఇస్తున్నారట. పాత పరిచయాల నేపథ్యంలో కొందరు ఉద్యోగ సంఘాల నేతలు తమ ఇళ్లల్లో జరిగే కార్యక్రమాలకు ఆహ్వానించేందుకు వెళ్తున్న సమయంలో ఈ బెదిరింపుల పర్వం కొనసాగుతోందని సమాచారం. ప్రభుత్వంలో ఏం జరిగినా చెప్పాలి, చిన్న విషయం కూడా వదలొద్దు అంటూ ఉద్యోగుల్ని భయపెడుతున్నారు.

Also Read: Indiramma Housing Scheme: అదనపు గదులు కట్టుకుంటే సహకరిస్తాం.. సీఎం రేవంత్ బంఫర్ ఆఫర్..

ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ఆలోచన
కేటీఆర్, హరీష్ రావు బెదిరింపులతో ఉద్యోగులు అయోమయంలో పడ్డారు. ఎవరికీ చెప్పుకోలేక ఇబ్బంది పడుతున్నారని సమాచారం. పదేళ్లలో బీఆర్ఎస్‌కు అనుకూలంగా పనిచేసిన అధికారులు, ఏం చేయాలో పాలుపోని పరిస్థితిలో ఉన్నారు. ప్రభుత్వం మారినా కూడా అహంకారం తగ్గలేదని కొందరు మాట్లాడుకుంటున్నారు. ఇదే క్రమంలో ఇప్పుడు కూడా అధికారులపై ఒత్తిడి ఏంటని ఉద్యోగ సంఘాల్లో చర్చ సాగుతోంది. దీన్ని అంత తేలిగ్గా వదిలిపెట్టకూడదని, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చూస్తున్నట్టు సమాచారం.

Related News

Rain Alert: మరి కాసేపట్లో భారీ వర్షం.. త్వరగా ఆఫీసులకు చేరుకోండి, లేకపోతే…

Telangana Congress: కాంగ్రెస్‌లో ఫైర్ బ్రాండ్లుగా ఫోకస్ అవుతున్న కోమటిరెడ్డి బ్రదర్స్

Bhuvanagiri collector: పల్లెకు వెళ్లిన భువనగిరి కలెక్టర్.. సమస్యలన్నీ ఫటాఫట్ పరిష్కారం!

BRS BC Meeting: బీఆర్ఎస్ కరీంనగర్ బీసీ సభ వాయిదా..? కాంగ్రెస్ ధర్నా సక్సెసే కారణమా?

CM Revanth Reddy: కేంద్రంలో బీజేపీని గద్దె దింపుతాం.. సిఎం రేవంత్ రెడ్డి

Konda Surekha: బీజేపీపై బిగ్ బాంబ్ విసిరిన కొండా సురేఖ.. రాష్ట్రపతినే అవమానించారంటూ కామెంట్స్!

Big Stories

×