BigTV English

CID Investigation: వైసీపీలో టెన్షన్ టెన్షన్.. నెక్స్ట్ ఎవరు ?

CID Investigation: వైసీపీలో టెన్షన్ టెన్షన్.. నెక్స్ట్ ఎవరు ?

CID Investigation: వైసీపీ ప్రభుత్వ హయాంలో అక్రమాలపై జరుగుతున్న సిఐడి విచారణలో వేగం పుంజుకోవడంతో పాటు.. అరెస్టులు జరుగుతుండటంతో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో గుబులు మొదలయింది. జిల్లాలో మూలాలు ఉన్న మద్యం కుంభకోణం, నకిలీ ఓటర్లు, మదనపల్లి పైల్స్‌తో పాటు తిరుపతి నగరానికి సంబంధించిన టీడీఅర్ బాండ్స్ , ఎపిక్ కార్డుల కేసులతో పాటు ఆడుదాం ఆంధ్రా ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంతా లిస్టు కనిపిస్తుంది . వాటిలో ఉమ్మడి జిల్లాకు సంబంధించిన కీలక నాయకుల పాత్రపై ఆరోపణలున్నాయి. దాంతో రేపు ఎవ్వరి మీద కేసు నమోదు అవుతుందా? కటకటాలు లెక్కబెట్టేదెవరు? అన్న చర్చ వైపీసీ క్యాడర్‌లో నడుస్త్తోందంట.


లిక్కర్‌ స్కాం కేసులో విచారణకు హాజరైన మిథున్‌రెడ్డి

ఏపి లిక్కర్ స్కామ్ కేసులో ఏ4 నిందితుడిగా నమోదు అయిన రాజంపేట ఎంపి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని ఇటీవల సీఐడీ అధికారులు విచారించారు. తర్వలో మరోసారి విచారణకు హాజరు అవ్వాలని నోటీసులు ఇచ్చారు. ఈ కేసుకు సంబంధించి జిల్లాలో మదనపల్లి, తిరుపతి, వికోటకు చెందిన మరో ముగ్గురి పాత్ర పై విచారణ జరుగుతుంది.


మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామిని కూడా విచారించే అవకాశం

అదే విధంగా అడ్రస్ లేని ఓ కంపెనీ పేరుతో నిధుల మార్పిడి జరిగిందని ఆ కంపెనీ పై కూడా కేసు నమోదు అయ్యింది. జిల్లాకు చెందిన మాజీ డిప్యూటీ సియం నారాయణ స్వామిని కూడా విచారించే అవకాశం ఉందంటున్నారు. అయన జగన్ ప్రభుత్వలో ఐదు సంవత్సరాల పాటు ఎక్సెజ్ శాఖను నిర్వహించారు. వారితో పాటు గాలివీడు కు చెందిన ఎక్సెజ్ ఉన్నతాధికారి అయిన సత్య ప్రసాద్ కూడా లిక్కర్ కేసులో నిందితుడిగా ఉన్నారు

మదనపల్లి ఫైల్స్ కేసు అభూత కల్పన అని వాదించిన పెద్దిరెడ్డి

దానికి తోడు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మరో షాక్ తగిలింది.. మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసు అభూత కల్పన.. అక్రమంగా కేసు పెట్టారు..అధారాలు లేక చేతులు ఎత్తేశారని పెద్దిరెడ్డి పలుమార్లు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అయితే ఆ కేసులో ఇప్పటికే సీనియర్ అసిస్టెంట్ అయిన సాయితేజా కస్టడీలో ఉండగా తాజాగా పెద్దిరెడ్డి ముఖ్య అనుచరుడు అయిన మాధవరెడ్డిని అరెస్ట్ చేశారు. మధ్యంతర బెయిల్ ఉంది తనను అదుపులోకి తీసుకోరని భావించిన మాధవరెడ్డి అరెస్ట్ పెద్దిరెడ్డి వర్గానికి షాక్‌గా మారిందంట. హైదరాబాద్‌లో అతన్ని అదుపులోకి తీసుకోని తర్వాత తిరుపతికి తరలించి చిత్తూరు కోర్టులో హాజరు పర్చారు.

విదేశాలకు పరారైన పెద్దిరెడ్డి సెక్రటరీ తుకారాం

ఈ కేసులో మరో అనుమానితుడు పెద్దిరెడ్డి పర్సనల్ సెక్రటరీ అయిన తుకారాం పరారై ప్రస్తుతం విదేశాలలో ఉన్నాడు. అయనపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది సిఐడి. ఆ క్రమంలో ఈ కేసుకు సంబంధించి అనేక మంది నేతలు ఇప్పుడు భయపడుతున్నారంట. వారికి తోడు 9 మంది నిందితులలో చాల కీలక నేతలు కూడా ఉన్నారు. మొత్తమ్మీద మదనపల్లి ఫైల్స్ కేసు ఫైనల్‌గా చుట్టుకునేది మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికే అన్న టాక్ వినిపిస్తుంది

ప్రాథమిక దర్యాప్తులో బయటపడిన చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, మోహిత్ రెడ్డిల పాత్ర

చంద్రగిరి లో నకిలీ ఓటర్లు, ఓటర్ల జాబితాలో ఇష్టానుసారం జరిగిన మార్పులు చేర్పులపై చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ఫిర్యాదు మేరకు సిఐడి విచారణ జరుపుతోంది. అందులో చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డితో పాటు అయన కూమారుడు మోహిత్ రెడ్డి, ఓ అర్డీఓ, మాజీ కలెక్టర్ పాత్ర సైతం ఉందని సిఐడి ప్రాథమిక దర్యాప్తులో బయటపడిందంట. అదిశగా కేసు విచారణ సాగుతుందంట. దానికితోడు తుడా నిధులను చెవిరెడ్డి సొంతానికి వాడుకున్నారన్న ఆరోపణలపై విజిలెన్స్ విచారణ కొనసాగుతుంది. దీంతో ఈ రెండు కేసుల్లో చెవిరెడ్డికి ఉచ్చు బిగుసుకోవడం ఖాయమంటున్నారు. మాజీ మంత్రి రోజాపై సైతం ఆడుదాం ఆంధ్రా పేరుతో నిధుల దుర్వినియోగం, టూరిజం శాఖకు సంబంధించిన దందాలు, ఏపీఐఐసీ భూముల కొనుగోళ్ల వ్యవహారాలపై విచారణ కొనసాగుతోంది.

తిరుపతిలో టిడిఅర్ బాండ్స్‌ దుర్వినియోగంపై విజిలెన్స్ విచారణ

తిరుపతిలో టిడిఅర్ బాండ్స్‌ దుర్వినియోగంపై విజిలెన్స్ విచారణ కూడా వేగంగా సాగుతుంది. సుమారు వంద కోట్లకు పైగా నగర పాలక సంస్థ నష్ట పోయిందని విచారణలో బయటపడిందంట. దానిపై త్వరలో క్రిమినల్ కేసు నమోదు చేస్తారని తెలుస్తోంది. మాస్టర్ ప్లాన్ రహాదారులకు సంబంధించి ప్లానింగ్, టీడీఆర్ బాండ్ల దుర్వినియోగంలో కీలక పాత్ర తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డితో పాటు అయన కూమారుడు అభినయ్‌రెడ్డిదేనని కూటమి నేతలు ముందు నుంచి ఆరోపణలు గుప్పిస్తున్నారు. దీనికి తగ్గట్టు అప్పట్లో చాలామంది స్థల యజమానులకు తెలియకుండా వారి అస్తులను భూమన బ్యాచ్ స్వాధీనం చేసుకుందంట. దానిపై కూడా విచారణ జరుగుతుంది.

Also Read: భారత్‌పై వరుసగా ఉగ్రదాడులు.. ఆ పది మందిని లేపేస్తే.. టెర్రరిజం అంతమవుతుందా..?

ఓటర్ ఎపిక్ కార్డుల కేసు పై ఎన్నికల కమిషన్ అదేశాల మేరకు విచారణ

ఇక తిరుపతి లో ఎన్నికల ముందు మరో కేసు నమోదు అయింది. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల సందర్భంగా ఓటర్ ఎపిక్ కార్డుల కేసు పై ఎన్నికల కమిషన్ అదేశాల మేరకు విచారణ జరుగుతుంది. దీనికి సంబంధించి ఐఎఎస్ గీరీషా సహా మరో అధికారి అప్పట్లోనే సస్పెండ్ అయ్యారు. ఆ కేసు వ్యవహారం కూడా భూమన ప్యామీలీకే చుట్టుకునే పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో సదరు కేసుల విచారణలో స్పీడు పెరిగితే మరింత మంది జాతకాలు బయటపడతాయని అంటున్నారు.

మంగళం పేట అటవీ భూములు, బుగ్గ మఠం భూముల అక్రమణ కేసులు

దానికితోడు పెద్ది రెడ్డికి సంబంధించి మంగళం పేట అటవీ భూముల అక్రమణ ,తిరుపతి బుగ్గ మఠం భూముల అక్రమణ కేసులు ఉన్నాయి. మొత్తానికి ఆయా కేసుల విచారణ ఒక కొలిక్కి వస్తే జిల్లాలోని పెద్దిరెడ్డి ప్యామీలి, చెవిరెడ్డి, భూమన అండ్ సన్స్, మాజీ మంత్రులు రోజా, నారాయణస్వామిలపై కేసులు నమోదవ్వడం ఖాయమంటున్నారు. జిల్లాకు చెందిన వైసీపీ ముఖ్యనేతలంతా ఇలా అవినీతికి పాల్పడి, విచారణలు ఎదుర్కొంటుండటంతో పార్టీ భవిష్యత్తుపై క్యాడర్ బెంగ పెట్టుకుంటోందంట.

Related News

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Nellore Politics: అనిల్ దెబ్బకు వేమిరెడ్డి వెనక్కి తగ్గాడా?

AP BJP: ఏపీలో బీజేపీకి అన్యాయం జరుగుతుందా?

AP Liquor Scam Case: జగన్‌ను ఇరికించిన చెవిరెడ్డి?

BIG Shock To Donald Trump: ట్రంప్‌కు మోదీ దెబ్బ.. అమెరికా పని ఖతమేనా

Big Stories

×