Muthayya Trailer: ప్రస్తుత కాలంలో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలామంది కొత్త దర్శకులు ఎంట్రీ ఇస్తున్నారు. అయితే భారీ బడ్జెట్ సినిమాలు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో వచ్చినట్లుగానే, కొన్ని చిన్న సినిమాలు కూడా రిలీజ్ అవుతూనే ఉన్నాయి. వాటిని కూడా ప్రేక్షకులు విపరీతంగా ఆదరించడం మొదలుపెట్టారు. ఇక తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో పెళ్లిచూపులు, కేరాఫ్ కంచరపాలెం, కోర్ట్, బేబీ వంటి ఎన్నో చిన్న సినిమాలను ప్రేక్షకులు విపరీతంగా ఆదరించారు. ఇక ప్రస్తుతం ముత్తయ్య అనే సినిమా ఈటీవీలో ప్రసారం కాబోతుంది. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇప్పటివరకు విడుదలకు నోచుకోలేదు. ముఖ్యంగా ఈ సినిమాకు చాలా అవార్డులు కూడా వచ్చాయి. త్వరలో ఈ సినిమా ఈటీవీ విన్ యాప్ లో రిలీజ్ కానుంది. ఈ తరుణంలో ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.
రాజమౌళి రియాక్షన్
రీసెంట్గా రిలీజ్ అయిన ఈ ట్రైలర్ ను ఎస్ఎస్ రాజమౌళి కూడా వీక్షించారు. కేవలం చూడడం మాత్రమే కాకుండా చాలా ఇంప్రెస్సివ్ గా అనిపించింది. అని తన ఒపీనియన్ తెలియజేసి టీమ్ అందరికీ కూడా తన విషెస్ తెలియజేశారు. అలానే ఆ ట్రైలర్ ను ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు జక్కన్న. మామూలుగా రాజమౌళి తన సినిమాలతో ప్రేక్షకులను ఇంప్రెస్ చేస్తాడు. అలాంటి రాజమౌళి ఒక ట్రైలర్ కు ఇంప్రెస్ అయ్యారు అంటే అది ఎలా ఉండబోతుందో అని చాలామంది చూడటం మొదలుపెట్టారు.
ట్రైలర్ టాక్
ముఖ్యంగా ఈ ట్రైలర్ లో నటన అంటే ఆసక్తి ఉన్న ఒక పెద్దాయన గురించి చూపించారు. కలలు కనడానికి వయసుతో సంబంధం లేదు అని ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. నటుడు అవ్వాలి అనుకున్న ఒక వ్యక్తి ప్రయాణమే ఈ ముత్తయ్య సినిమా. సినిమా మీద ముత్తయ్యకు ఉన్న ఆసక్తి చూస్తే ఆసక్తికరంగా అనిపిస్తుంది. ఏవైనా కలలుంటే దానిని అప్పుడే సహకారం చేసుకోవాలని. ఏదంటే ఆ కళలను అక్కడే చంపేయాలి కానీ, నాలా మోయకూడదు అని ఆ ఏజ్ లో ముత్తయ్య చెప్పే డైలాగ్ చాలా మందికి కనెక్ట్ అవుతుంది. ఈ సినిమాలో ముత్తయ్య పాత్రను బలగం సురేందర్ వేస్తున్నారు. అలానే భాస్కర్ మౌర్య ఈ సినిమాతో దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాకి కార్తీక్ సంగీతం అందిస్తున్నారు. త్వరలో ఈ సినిమా ఈటీవీ విన్లో విడుదల కానుంది.
#Muthayya’s trailer is heartwarming! Wishing the entire team all the very best. Streaming from May 1 on @etvwin. https://t.co/4p7ZWUp0Lb@BhaskharMaurya @vrindaprasad @thisisvamsik #KarthikRodriguez #DivakarMani @thesaimurali @crhemanth @HylifeE @FictionaryEnt @MadhuraAudio
— rajamouli ss (@ssrajamouli) April 28, 2025