BigTV English

IRCTC Refund Rules: టికెట్ క్యాన్సిలేషన్ ఇలా చేస్తున్నారా? రీఫండ్ అస్సలు రాదు జాగ్రత్త!

IRCTC Refund Rules: టికెట్ క్యాన్సిలేషన్ ఇలా చేస్తున్నారా? రీఫండ్ అస్సలు రాదు జాగ్రత్త!

Indian Railway Ticket Cancellation Rules: దేశ వ్యాప్తంగా నిత్యం లక్షలాది మంది ప్రయాణీకులు రైళ్లలో ప్రయాణం చేస్తారు. రోడ్ ట్రాన్స్ పోర్టు, ఎయిర్ ట్రాన్స్ పోర్టుతో పోల్చితే రైళ్ల ద్వారానే అధిక సంఖ్యలో ప్రయాణీకులు తమ గమ్యస్థానాలకు చేరుకుంటారు. భారతీయ రైల్వే సంస్థ కూడా సామాన్యులకు మెరుగైన సేవలు అందించేందుకు ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నది.  గతంతో పోల్చితే ఇప్పుడు ప్రయాణీకులకు అత్యాధునిక సౌకర్యాలు అందుబాటులోకి వస్తున్నాయి.


రైలు ప్రయాణం చేయాలనుకునే వాళ్లు సాధారణంగా ముందుగానే టికెట్లు బుక్ చేసుకుంటారు. రైలు టికెట్లు బుక్ చేసుకునేందుకు IRCTCతో పాటు పలు యాప్స్ ఉపయోగిస్తారు. చాలా మంది ప్రయాణానికి కొద్ది వారాల ముందే టికెట్లు బుక్ చేసుకుంటారు. అయితే, కొన్ని కారణాలతో ప్రయాణం రద్దు అయితే, టికెట్లు క్యాన్సిల్ చేసుకుంటారు. ఆన్‌ లైన్‌ లో టిక్కెట్లు బుక్ చేసుకున్న వాళ్లు, IRCTC యాప్ ద్వారా టికెట్లు క్యాన్సిల్ చేసుకుంటారు. కానీ, కౌంటర్ నుంచి టికెట్లు కొనుగోలు చేసిన వాళ్లు మళ్లీ కౌంటర్ దగ్గరికి వెళ్లి టికెట్లు క్యాన్సిల్ చేయాల్సి ఉంటుంది.

అలా చేస్తే రీఫండ్ వచ్చే అవకాశం లేదు!


టికెట్ క్యాన్సిలేషన్ అనేది ప్రయాణానికి నిర్ణీత సమయానికి ముందుగా చేస్తేనే రీఫండ్ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రయాణ సమయం దగ్గర పడుతున్న కొద్దీ రీఫండ్ అమౌంట్ తగ్గిపోతుంది. ఫుల్ అమౌంట్ రావాలంటే, ఎన్ని గంటల ముందు టికెట్ క్యాన్సిల్ చేసుకోవాలి? ఎలాంటి పరిస్థితిలో అస్సలు రీఫండ్ రాదు? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

ఇండియన్ రైల్వే టికెట్ క్యాన్సిలేషన్ రూల్స్  

టికెట్ క్యాన్సిల్ చేయాలనుకుంటే మీకు ముందుగా టికెట్ క్యాన్సిలేషన్ రూల్స్ గురించి తెలియాలి.

చార్ట్ రెడీ అయిన తర్వాత నో రీఫండ్   

టికెట్ క్యాన్సిలేషన్ అనేది చార్ట్ రెడీ అయిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. ఇలా చేస్తే ఒక్క రూపాయి కూడా రీఫండ్ వచ్చే అవకాశం లేదు. రైలు బయల్దేరడానికి సుమారు 4 గంటల ముందు అధికారులు చార్ట్ రెడీ చేస్తారు. ఈ చార్ట్ లో ఏ ప్రయాణీకుడికి ఏ సీటు కేటాయించబడింది? అనే సమాచారం ఉంటుంది. చార్ట్ ప్రిపరేషన్ కు ముందు క్యాన్సిల్ చేసిన టికెట్లకు మాత్రమే రీఫండ్ లభిస్తుంది. ఇంకా చెప్పాలంటే ప్రయాణ సమయం తగ్గుతున్న కొద్దీ రీఫండ్ అమౌంట్ తగ్గుతూ వస్తుంది. చార్ట్ ప్రిపరేషన్ తర్వాత అస్సలు రీఫండ్ వచ్చే అవకాశం లేదు.

ఎంత డబ్బు రీఫండ్ వస్తుంది?

మీరు ప్రయాణానికి 10 రోజుల ముందు టికెట్ క్యాన్సిల్ చేస్తే, మీరు ఎక్కువ మొత్తంలో డబ్బు రీఫండ్ పొందే అవకాశం ఉంటుంది. అయితే, మీరు రైలు బయల్దేరడానికి ఒక రోజు ముందు టికెట్ క్యాన్సిల్ చేస్తే చాలా తక్కువగా రీఫండ్ వస్తుంది. రీఫండ్ పొందాలనుకుంటే ముందుగానే టికెట్ క్యాన్సిల్ చేసుకోవడం మంచిది.

Read Also: ఈ ఏడాది ఇన్ని వందేభారత్ రైళ్లు ప్రారంభం అయ్యాయా? వచ్చే ఏడాది ఇండియన్ రైల్వేలో మరింత జోష్!

Related News

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో సరికొత్త రికార్డ్.. ఒక్క రోజులోనే ఇంత మంది ప్రయాణికులా?

Mumbai Coastal Road: రూ. 12 వేల కోట్లతో మలుపుల రోడ్డు.. లైఫ్ లో ఒక్కసారైనా జర్నీ చేయండి!

Dirtiest railway stations: దేశంలోనే అత్యంత మురికిగా ఉన్న రైల్వే స్టేషన్లు ఇవేనట.. మీ స్టేషన్ కూడా ఉందా?

Railway history: ఈ రైలు వయస్సు 170 ఏళ్లు.. నేటికీ ట్రాక్ పై పరుగులు.. ఎక్కడో కాదు మన దేశంలోనే!

Railway passenger rules: రైల్వేలో ఈ రూల్ ఒకటి ఉందా? తెలుసుకోండి.. లేకుంటే ఇబ్బందే!

Vande Bharat Train: జర్నీకి పావుగంట ముందు.. IRCTCలో వందేభారత్ టికెట్స్ ఇలా బుక్ చేసుకోండి!

Big Stories

×