BigTV English

YS Jagan vs Sharmila: షర్మిలపై జగన్ స్కెచ్.. చెల్లి సైలెంట్ అవుతుందా..?

YS Jagan vs Sharmila: షర్మిలపై జగన్ స్కెచ్.. చెల్లి సైలెంట్ అవుతుందా..?

YS Jagan vs Sharmila: పీసీసీ అధ్యక్షురాలు షర్మిలపై జగన్ కొత్త స్కెచ్ గీస్తున్నారా? షర్మిలపై కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదులు వెనుక జగన్ హస్తం ఉందా? అంటే ఔననే సమాధానం వస్తుంది. ఎన్డీఎ కూటమికి అనుకూలంగా షర్మిల వ్యవహరిస్తున్నారని.. ఎన్డీఏ ప్రభుత్వాలను వదిలేసి ఆమె వైసీపీనే ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారని కాంగ్రెస్‌ హైకమాండ్‌కు ఫిర్యాదులు వెళ్తున్నాయంట… షర్మిల ప్రభావంతో వైసీపీకే ఎక్కువ డ్యామేజ్ జరుగుతుందన్న అభిప్రాయం ఉంది. ఆ క్రమంలో చెల్లి ప్రభావం తగ్గించేందుకు జగన్ ప్రయత్నాలు చేస్తున్నారంట. కాంగ్రెస్ లో పాత పరిచయాలతో తెరవెనుక చక్రం తిప్పుతున్నారంట. షర్మిల పిసిసి పదవికి ఎసరు పెట్టడానికి జగన్ స్కెచ్ గీస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.


ఏపీ రాజకీయాల్లో వైసీపీ అధ్యక్షుడు జగన్, ఏపీసీసీ చీఫ్ షర్మిల మధ్య జగడం హాట్ టాపిక్ గా మారుతోంది. ఇంటి పోరు ఇంతింత కాదనేట్టు.. అన్న చెల్లెలి మధ్య డైలాగ్ వార్ నడుస్తూనే ఉంది. సందు దొరికినప్పుడల్లా.. షర్మిల తన స్టైల్లో మాజీ ముఖ్యమంత్రి జగన్‌ను వాయించేస్తున్నారు. కుదిరితే ట్వీటు.. వీలైతే ప్రెస్ మీట్లు.. వేదిక ఏదైనా సరే.. అన్న జగన్ మీద.. అంతెత్తున్న లేస్తున్నారు. ఏపీలో జరుగుతున్న సోషల్ మీడియా పోస్టుల అరెస్టులపై.. జగన్ చేసిన వ్యాఖ్యలకు కూడా తీవ్రస్థాయిలో కౌంటర్లు ఇస్తున్నారు.. అసలు సోషల్ మీడియా సైకోలను పెంచిపోషించింది జగనేనని .. కూటమి నేతల కంటే తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు.

అధికార టీడీపీ.. తమను ప్రతిపక్ష పార్టీగా గుర్తించలేదన్న కారణంతో జగన్ సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలందరూ అసెంబ్లీని బహిష్కరించారు. మాట్లాడేందుకు మైక్ ఇస్తామంటేనే అసెంబ్లీలో కాలు పెడతామంటున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ నాయకుల తీరుపై షర్మిల తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు .. అసెంబ్లీకి వెళ్లడానికి భయపడుతున్న జగన్‌కి కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే అర్హత లేదని షర్మిల విమర్శించారు. కాంగ్రెస్ అభ్యర్థులెవరూ గెలవక అసెంబ్లీకి వెళ్లట్లేదు. మరి వైసీపీ నుంచి గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలు ఎందుకు అసెంబ్లీకి వెళ్లట్లేరని షర్మిల నిలదీశారు. అసెంబ్లీకి వెళ్ళనపుడు గెలిచిన మీకు.. ఓడిన మాకు తేడా ఏంటని ఏపీ కాంగ్రెస్ చీఫ్ యద్దేవా చేశారు.


Also Read: వంగవీటి రాధాకి ఎమ్మెల్సీ పదవి.. చంద్రబాబు నయా స్కెచ్

ఇక ఇదే అంశంపై ట్విట్టర్ లోనూ అన్నకు కౌంటరిచ్చారు షర్మిల. ప్రతిపక్ష హోదా రాకపోయినా 11 మందితో సభకు వెళ్లి ప్రజాపక్షంలా వ్యవహరించాలని షర్మిల సూచించారు. ఇప్పటికీ అసెంబ్లీకి వెళ్ళే దమ్ము లేకుంటే రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. మొత్తంగా వైసీపీ అసెంబ్లీకి వెళ్లకపోవడంపై టీడీపీ నేతల కన్నా.. సొంత చెల్లెలు షర్మిలనే ఎక్కువ ఆరోపణలు చేస్తున్నారు. వైసీపీకి ప్రధాన రాజకీయ ప్రత్యర్థి.. టీడీపీనా, లేక షర్మిలా? అనే రీతిలో.. అన్నయ్యను ఊతికి ఆరేస్తున్నారు.

అంతకు ముందు ఎన్నికల ప్రచారంలో సైతం వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీతతో కలిసి ప్రచారం చేసిన షర్మిల వైసీపీని, జగన్‌ని ఒక రేంజ్లో టార్గెట్ చేశారు.. సొంత బాబాయ్‌ని హత్య చేసిన వారిని వెనకేసుకు వస్తున్నారని జగన్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.. తర్వాత సోలార్ విద్యుత్ కొనుగోలు ఒప్పందాలకు సంబంధించి అదానీ వ్యవహారంలో జగన్‌పై ఆరోపణలు వచ్చినప్పుడూ షర్మిల వదలలేదు.

షర్మిల దూకుడుతో వైసీపీకి తీవ్ర నష్టం జరుగుతుందని వైసీపీ నేతలు ఆందోళన చెందుతున్నారంట. అదే విషయాన్ని జగన్ దృష్టికి కూడా తీసుకెళ్లారంట.. దాంతో అప్రమత్తమైన జగన్ కాంగ్రెస్‌లో షర్మిలకు చెక్ పెట్టడానికి స్కెచ్ గీస్తున్నారంట. ఎన్నికల తర్వాత షర్మిలపై కాంగ్రెస్ హైకమాండ్‌కు ఆ పార్టీ వారే ఫిర్యాదులు చేస్తున్నారు. వాటి వెనుక జగన్ ప్రమేయం ఉందంటున్నారు. ఎన్డీఎ కూటమికి అనుకూలంగా షర్మిల నడవడిక ఉందని.. ఎన్డీఎను వదిలేసి వైసీపీని ఆమె టార్గెట్ చేస్తున్నారని కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదులు వెళ్తున్నాయి … కాంగ్రెస్ లో పాత పరిచయాలతో తెరవెనుక చక్రం తిప్పుతున్న జగన్.. కాంగ్రెస్లో చెల్లెలి పాత్ర తగ్గించి.. అసలు పీసీసీ పదవికే ఎసరు పెట్టాలని చూస్తున్నారన్న ప్రచారం పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×