BigTV English

India Russia Defence: రష్యాతో బిలియన్ల డాలర్ల డిఫెన్స్ డీల్ చేయబోతున్న ఇండియా.. చైనాకు చెక్!

India Russia Defence: రష్యాతో బిలియన్ల డాలర్ల డిఫెన్స్ డీల్ చేయబోతున్న ఇండియా.. చైనాకు చెక్!

India Russia Defence| అమెరికా, పాశ్చాత్య దేశాలు రష్యాతో దూరంగా ఉండాలని ఆంక్షలు విధిస్తున్నాయి. ఆ ఆంక్షలకు భయపడి చాలా దేశాలు పుతిన్ ప్రభుత్వంతో స్నేహం చేయడానికి వెనుకడుగు వేస్తున్నాయి. కానీ ప్రపంచంలో భారతదేశానికి మాత్రం ఆ ఆంక్షలు వర్తించవు. దానికి కారణం భారత దేశం ఇటు పాశ్చాత్య దేశాలకు, అటు రష్యాకు మిత్ర దేశం. పైకి అమెరికా మేకపోతు గాంభిర్యం వహించినా.. ఇండియా విషయంలో మాత్రం మౌనంగా ఉండిపోతుంది. అందుకే రష్యా నుంచి ఇండియా దర్జాగా చమురు కొంటోంది. కొనడమే కాదు ఇతర యూరోపియన్ దేశాలకు విక్రియిస్తోంది కూడా. అయితే ఇప్పుడు మరో అడుగు ముందుకేసి భారీ మిలిటరీ ఆయుధాలు, అడ్వాన్సడ్ డిఫెన్స్ టెక్నాలజీ పరికరాలు కొనుగోలు చేయనుందని సమచారం.


భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తన బృందంతో ప్రస్తుతం రష్యా పర్యటనలో ఉన్నారు. జాతీయ మీడియా కథనాల ప్రకారం.. ఈ పర్యటనలో రాజ్‌నాథ్ సింగ్ భారత్, రష్యా దేశాల మధ్య ఒక మల్లి బిలియన్ డాలర్ల విలువ గల డిఫెన్స్ డీల్ గురించి చర్చలు జరుపుతున్నారు. ఈ చర్చలు చివరి దశలో ఉన్నాయని.. ఈ డిఫెన్స్ డీల్ విలువ 4 బిలియన్ డాలర్లు అని సమచారం. ఇరు దేశాల మధ్య ఈ భారీ ఒప్పందం పూర్తి అయితే ఇండియాకు డిఫెన్స్ రంగంలో అత్యాధుని టెక్నాలజీ పరికారాలు లభించనున్నాయి. ఈ టెక్నాలజీ ముఖ్యంగా చైనా నుంచి రక్షణ పొందేందుకు ఉపయోగపడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఈ డిఫెన్స్ డీల్ లో ముఖ్యంగా రష్యాకు చెందిన అత్యంత అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ కలిగిన వోరోనెజ్ సిరీస్ రాడార్ కొనుగోలుకు ఇండియా ప్రయత్నిస్తోంది. రష్యాకు చెందిన అల్మాజ్ యాంటె కార్పోరేషన్ అనే మిలటరీ ఆయుధాలు తయారు చేసే టెక్నాలజీ కంపెనీ ఈ హై ఎండ్ రాడార్లను రూపొందించింది. ఈ కంపెనీ ముఖ్యంగా మిసైల్ దాడిని పసిగట్టే యాంటి ఎయిర్ క్రాఫ్గ్ పరికరాలు, రాడార్లు తయారు చేస్తుంది.


Also Read: సిరియాలో రాజకీయ సంక్షోభం.. ఉక్రెయిన్ యుద్ధంపై ప్రభావం ఉంటుందా?

అల్మాజ్ యాంటె కంపెనీకి చెందిన వోరేనెజ్ రాడార్‌ చాలా సుదూరమైన రేంజ్ ఉంది. ఉదాహరణకు 8000 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చే మిసైల్స్, ఫైటర్ జెట్స్, ఐసిబిఎంల మిస్సైల్స్‌ను ఇది ముందుగానే పసిగట్టేస్తుంది. ఒకవేళ ఇండియా ఈ లాంగ్ రేంజ్ రాడార్ ను రష్యా నుంచి కొనుగోలు చేస్తే.. చైనా నుంచి వచ్చే మిస్సైల్స్, ఫైటర్ జెట్స్ ను ముందగానే పసిగట్టి వాటిని నిర్వీర్యం చేయవచ్చు. చైనా నుంచే కాదు, దక్షిణ, సెంట్రల్ ఏషియా దేశాల నుంచి ఇండియన్ ఓషియన్ ప్రాంతం మీదుగా వచ్చే మిస్సైల్, యుద్ధ విమానాలను చాలా ముందుగానే తెలుసుకొని ఎదురుదాడి కూడా చేసే అవకాశం ఉంటుంది.

ఇప్పుడు ఉక్రెయిన్ యుద్ధంలో నాటో కూటమి దేశాలైనా, ఇజ్రాయెల్ ను భయపెడుతున్న ఇరాన్ అయినా ఐసిబియం (ఇంటర్ కాంటినెంటర్ బాలిస్టిక్ మిస్సైల్) మిసైల్స్ తో శత్రు దేశాలను భయపెడుతున్నాయి. ఈ ఐసిబియం మిస్సైల్స్ దాదాపు 5500 కిలోమీటర్లు ప్రయాణించగలవు. చైనా వద్ద కూడా ఈ ఐసిబియం మిస్సైల్స్ ఉన్నాయి.

Also Read:  పురాతన గుడి లోపల 73 శవాలు.. 600 మొసళ్లు.. అడవి మధ్యలో పూజలు!

పైగా రష్యా వోరోనెజ్ రాడార్లు (Voronezh Radar) ఒకే సారి 500 మిస్సైల్స్ ని పసిగట్ట వాటి గురించి పూర్తి డేటాని అందిస్తాయి. ఈ టెక్నాలజీ అంతరిక్షం నుంచి ఎదురయ్యే గ్రహశకలాలను కూడా పసిగట్టేందుకు ఉపయోగపడుతుందని దీన్ని తయారు చేసి రష్యా కంపెనీ చెబుతోంది.

రష్యా టుడే అనే మీడియా సంస్థ రిపోర్ట్ ప్రకారం.. ఈ టెక్నాలజీ కొనుగోలు కోసం రష్యా, భారత దేశాల మధ్య నెల రోజులుగా చర్చలు జరుగుతున్నాయి. పైగా నవంబర్ నెలలో రష్యా అల్మాజ్ యాంటె కంపెనీ ప్రతినిధులు భారత పర్యటనకు వచ్చారు.

ది సండే గార్డియన్ మీడియా రిపోర్ట్ ప్రకారం.. ఈ భారీ డీల్ కోసం ఇండియా కొన్ని షరతులు విధించింది. ఈ రాడార్ 60 శాతం తయారీ ఇండియాలో జరగాలని ముఖ్యమైన షరతు. ఈ ఒప్పందం పూర్తి అయితే.. కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో ఈ అత్యాధునిక రాడార్ తయారీకి కావాల్సిన ఫ్యాక్టీరీ ఫెసిటీలు నిర్మాణం చేపడతారు. చిత్రదుర్గలో భారత దేశానికి చెందిన అడ్వాన్స్‌డ్, టాప్ సీక్రెట్ మిస్సైల్, యుద్ధ విమాన టెక్నాలజీ పరికరాల తయారీ ఇప్పటికే జరుగుతోంది.

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×