Big Stories

Uttarakhand Massive fire Accident: ఉత్తరాఖాండ్‌లో కార్చిచ్చు.. భారీగా ఎగిసిపడుతున్న మంటలు..

Uttarakhand Massive fire Accident(Telugu news live today): ఉత్తరాఖండ్ లోని నైనిటాల్ లోని అడవిలో ఎగిసిపడుతున్న మంటలు శుక్రవారం రాత్రి హైకోర్టు కాలనీకి చేరుకోవడంతో పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. దీంతో ఆ కాలనీవాసులకు ముప్పుగా మారింది. అంతేకాదు.. ఆ ప్రాంతంలో ట్రాఫిక్ పై కూడా ప్రభావం పడింది. అటవీశాఖ ఉద్యోగులతోపాటు ఆర్మీ సిబ్బంది కూడా మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మంటలను ఆర్పేందుకు హెలికాఫ్టర్లను కూడా ఉపయోగించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

ఫైన్స్ సమీపంలో ఉన్న పాత ఇంటిలో అగ్నిప్రమాదం సంభవించిందని, అది ప్రమాదకరంగా సమీపంలోకి చేరుకుందని, సాయంత్రం నుంచి ఆ మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నిస్తున్నారని స్థానికులు చెబుతున్నట్లు సమాచారం. అయితే ఇందుకు సంబంధించి అటవీశాఖ అధికారి మాట్లాడుతూ.. మంటలను ఆర్పేందుకు 40 మంది మనోరా రేంజ్ సిబ్బంది, ఇద్దరు ఫారెస్ట్ రేంజర్లను రంగంలోకి దించినట్లు తెలిపారు. హెలికాఫ్టర్లను ఉపయోగించే అవకాశముందని తెలిపారు. అదేవిధంగా అగ్నిప్రమాదం దృష్ట్యా నైని సరస్సులో బోటింగ్ ను కూడా నిలిపివేశారు.

- Advertisement -

Also Read: నేడు ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న కేజ్రీవాల్ సతీమణి

నైనిటాల్ లోని అడవిలో మంటలు చెలరేగడం, అదేవిధంగా రాష్ట్రంలోని మరికొన్ని చోట్లా అగ్నిప్రమాదాలు సంభవించిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశించారు. అదేవిధంగా అన్ని శాఖలతో సమన్వయం చేస్తూ అగ్నిప్రమాదాల నివారణకు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా సీఎం కోరారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News