BigTV English

Best TWS Earbuds: రూ. 2000 లోపు బెస్ట్ 6 TWS ఇయర్‌బడ్స్.. ధర కూడా తక్కువే..!

Best TWS Earbuds: రూ. 2000 లోపు బెస్ట్ 6 TWS ఇయర్‌బడ్స్.. ధర కూడా తక్కువే..!

Best TWS earbuds under Rs 2000: తక్కువ ధరలో మంచి సౌండింగ్ ఇచ్చి ఇయర్‌బడ్ కొనుక్కోవాలని చూస్తున్నారా?.. అయితే అధిక ధర కారణంగా మీ ప్లాన్‌ను మార్చుకుంటున్నారా?.. ఇప్పుడు అలాంటి అవసరం లేదు. ఎందుకంటే అతి తక్కువ ధరలోనే ఇప్పుడు ది బెస్ట్ సౌండ్ క్వాలిటీని అందించే ఇయర్ బడ్‌ను కొనుక్కోవచ్చు. ఇక్కడ కేవలం రూ.2000 లోపు ఉన్న 7 ఉత్తమమైన TWS ఇయర్‌బడ్‌లు అందుబాటులో ఉన్నాయి. అందులో మీకు నచ్చిన ఇయర్‌బడ్‌ను కొనుక్కోవచ్చు.


Boat Airdopes 161:

ఈ TWS ఇయర్‌బడ్స్ బ్లాక్, బ్లూ, గ్రే, వైట్, గ్రీన్ కలర్ వేరియంట్‌లలో అందుబాటులో ఉన్నాయి. 40 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్‌ను అందిస్తుంది. IPX5 డస్ట్, వాటర్ రెసిస్టెంట్ కోటింగ్‌తో వస్తాయి. Google అసిస్టెంట్, Siri కోసం మద్దతునిస్తాయి. ఇది చాలా తక్కువ ధరకే అందుబాటులో ఉంది. దీని ధర రూ.999 మాత్రమే.


Boat Immortal 131:

ఈ ఇయర్‌బడ్స్ బ్లాక్ అండ్ వైట్ కలర్ వేరియంట్‌లలో ఉన్నాయి. గేమింగ్ కోసం ప్రత్యేకమైన బీస్ట్ మోడ్‌ను కలిగి ఉంది. 50 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్‌ను అందిస్తుంది. RGB లైటింగ్, ఎన్విరాన్‌మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్‌కు మద్దతుని కలిగి ఉంటుంది. ఇది రూ.1099గా ఉంది.

Also Read: కొత్త ఇయర్‌బడ్స్‌ లాంచ్.. సింగిల్ ఛార్జింగ్‌తో 150 గంటల బ్యాటరీ లైఫ్‌.. ధర, ఫీచర్ల వివరాలివే..!

Realme Buds T110:

రియల్ బడ్స్ టి110 ఇయర్‌బడ్‌లు ఇటీవల భారతదేశంలో ప్రారంభించబడ్డాయి. గ్రీన్, బ్లాక్, బ్లూ కలర్ వేరియంట్‌లలో అందుబాటులో ఉన్నాయి. 10mm డైనమిక్ బాస్ డ్రైవర్‌లతో 38 గంటల వరకు మొత్తం ప్లేబ్యాక్ సమయాన్ని అందిస్తాయి. కాల్‌ల కోసం AI ఎన్విరాన్‌మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్‌తో వస్తాయి. ఈ బడ్స్ Google ఫాస్ట్ పెయిర్, స్మార్ట్ టచ్ కంట్రోల్స్‌కు కూడా సపోర్ట్ చేస్తాయి. దీని ధర కేవలం రూ.1499గా ఉంది.

Oppo Enco Buds 2:

ఒప్పో ఎన్కో బడ్స్ 2 ఇయర్‌బడ్స్ మంచి సౌండ్ క్వాలిటీని అందిస్తాయి. ఇందులో AI డీప్ నాయిస్ క్యాన్సిలేషన్, 10mm పెద్ద టైటానైజ్డ్ డ్రైవర్‌లు, బ్లూటూత్ 5.2, కెమెరాను కంట్రోల్ చేయడానికి డబుల్ ట్యాప్ వంటి అధునాతన ఫీచర్‌లు ఉన్నాయి. 28 గంటల వరకు రన్‌టైమ్‌ను అందిస్తుంది. దీని ధర రూ.1799గా ఉంది.

OnePlus Nord Buds 2R:

వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ 2ఆర్ ఇయర్‌బడ్‌లు డీప్ గ్రే, మిస్టీ గ్రే, ట్రిపుల్ బ్లూ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉన్నాయి. ఇవి 12.4mm పెద్ద డ్రైవర్లతో వస్తాయి. 38 గంటల సుదీర్ఘ బ్యాటరీ లైఫ్ అందిస్తాయి. డ్యూయల్ మైక్‌లు, AI స్పష్టమైన కాల్ అల్గారిథమ్ కూడా ఉన్నాయి. కనెక్టివిటీ కోసం ఫాస్ట్ పెయిరింగ్ ఫీచర్‌ని కూడా కలిగి ఉంది. ఇది రూ.1999లకి అందుబాటులో ఉంది.

Also Read: రూ. 282కే నథింగ్ కొత్త ఇయర్‌బడ్స్.. సౌండ్ దద్దరిల్లాల్సిందే!

Honor Choice Earbuds X5:

హానర్ ఛాయిస్ ఇయర్‌బడ్స్ ఎక్స్ 5 ఇయర్‌బడ్‌లు గరిష్టంగా 30dB యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్‌ను కలిగి ఉంది. 35 గంటల వరకు బ్యాటరీ లైఫ్ అందిస్తాయి. IP54 డస్ట్, వాటర్ రెసిస్టెంట్ కోటింగ్, కనెక్టివిటీ కోసం బ్లూటూత్ 5.3తో పాటు గేమ్ మోడ్‌, గేమింగ్ కోసం తక్కువ-లేటెన్సీ మోడ్‌ను కూడా కలిగి ఉంది. దీని ధర రూ.1999గా ఉంది. వీటిని ప్రముఖ ఈ కామర్స్ సంస్థలైన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో కొనుక్కోవచ్చు.

Tags

Related News

Oppo K13 Turbo: ఒప్పో K13 టర్బో సిరీస్ ఇండియాలో లాంచ్.. 7,000mAh బ్యాటరీ, కూలింగ్ ఫ్యాన్‌తో సూపర్ ఫీచర్లు

Pixel 9 Discount: పిక్సెల్ 9పై భారీ తగ్గింపు.. రూ.27000 డిస్కౌంట్ త్వరపడండి

ChatGPT Chess Grok: గ్రోక్ ఏఐని ఓడించిన చాట్‌జీపీటీ.. చెస్ పోటీల్లో అద్భుత గెలుపు

iQOO Z10R vs Moto G96 vs Galaxy F36: మిడ్ రేంజ్‌లో విన్నర్ ఎవరు?

Chat GPT: సజేషన్ కోసం చాట్ జీపీటీని అడిగాడు.. చివరకు సీన్ కట్ చేస్తే..?

2025 Best Budget Phones: iQOO Z10x, Poco M7, Moto G85.. 2025లో ₹15,000 లోపు బెస్ట్ 5G ఫోన్స్ ఇవే..

Big Stories

×