BigTV English

Kakani VS Somireddy: ఎండ్‌ కార్డ్‌ ఎప్పుడో.. కాకాణి వర్సెస్ సోమిరెడ్డి

Kakani VS Somireddy: ఎండ్‌ కార్డ్‌ ఎప్పుడో.. కాకాణి వర్సెస్ సోమిరెడ్డి

Kakani VS Somireddy: రాజకీయ ప్రత్యర్థులైన ఆ ఇద్దరి మధ్య రాజకీయ పోరు నాన్ స్టాప్‌గా కొనసాగుతూనే ఉంది. ఎన్నికల ముందు ఎలా ఉందో.. తర్వాత కూడా అదే సిట్యువేషన్‌. పొలికటర్‌ డైలాగ్స్ విషయంలో తగ్గేదేలే అంటున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యే, మాజీమంత్రి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఎవరా నాయకులు.. ఎందుకంత వైర్యం. వాచ్ దిస్ స్టోరీ.


నెల్లూరు జిల్లాలో రాజకీయ ప్రత్యర్థులైన మాజీమంత్రులు కాకాని గోవర్ధన్ రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొందట. అధికారం మాట పక్కన పెడితే.. ఒకరిపై ఒకరు ఏదో రకంగా విమర్శలు.. ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. ఒకటి పోతే ఒకటి. ఏదో ఒక టాపిక్‌తో రాజకీయరగడ రాజేస్తూనే ఉంటారని పొలిటికల్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. నియోజకవర్గ అంశమైనా.. రాష్ట్రస్థాయి అంశమైనా ..ఇద్దరి మధ్య డైలాగ్ వార్ నడవాల్సిందే అన్నట్టు పరిస్థితి తయారైందట.

ఇద్దరి నాయకుల్లో ఎవరో ఒకరు మీడియా ముందుకు వచ్చేస్తారు. ఒకవేళ సోమిరెడ్డి కన్నా ముందుగా కాకాణి మీడియా ముందుకు వస్తే .. వెంటనే నేనున్నానంటూ సోమిరెడ్డి సీన్‌లోకి ఎంటర్ అవుతున్నారట. అదే సోమిరెడ్డి ముందు మాట్లాడితే దానికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చేందుకు కాకాణి సిద్ధమవుతున్నారట. వీరిద్దరి మాటల్లో వాస్తవం ఉందా .. లేదా .. అనేది పక్కన పెడితే.. మాటలయుద్ధం మాత్రం ఓ రేంజ్ లో ఉంటోంది. దశాబ్దానికి పైగా వీరి మధ్య పొలిటికల్ వార్ నడుస్తూనే ఉంది.


గతంలో వీరి మధ్య.. లిక్కర్, నకిలీ డాక్యుమెంట్స్, కోర్టు కేసులపై వివాదాలు, కృష్ణపట్నం పోర్టు కంటైనర్ టెర్మినల్, బెంగళూరు రేవ్ పార్టీ వంటి టాపిక్స్‌పై మాటల యుద్ధం జరగ్గా.. తాజాగా ఎమ్మెల్యే సోమిరెడ్డిపై.. కాకాణి చేసిన అవినీతి ఆరోపణలు సంచలనం రేపాయి. ఇటీవల వైసీపీ శ్రేణులు.. కరెంటు ఛార్జీలపై చేపట్టిన ఆందోళనలు.. మళ్లీ ఇద్దరి మధ్య.. మాటల యుద్ధానికి తెరతీశాయట.

సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి.. ఇరిగేషన్, మట్టి పనులు, ఉద్యోగుల బదిలీలలో అవినీతి, అక్రమాలకు పాల్పడ్డాడని.. ఓ ప్రముఖ వ్యక్తి.. సీఎం దగ్గర అపాయింట్‌మెంట్ ఇప్పించమని అడిగినందుకు.. అతని వద్ద బంగారాన్ని లంచంగా అడిగాడని కాకాణి ఓ రేంజ్‌లో ఆరోపణలు చేశారు. సోమిరెడ్డి వాట్సాప్ కాల్ లిస్ట్ బయట పెడితే విషయాలన్నీ బయటకు వస్తాయని గోవర్ధన్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారట. అంతటితో ఆగకుండా.. సోమిరెడ్డి అవినీతి అక్రమాలకు పాల్పడలేదని కాణిపాకంలో ప్రమాణం చేయాలని సవాల్ కూడా విసిరారట.

కాకాణి గోవర్థన్‌రెడ్డి సవాల్‌ విసిరి.. మూడు వారాలైనా.. సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి స్పందించలేదట. దీంతో ఒక మెట్టు ఎక్కిన గోవర్థన్‌రెడ్డి.. సీఎం చంద్రబాబు కల్పించుకుని అయినా.. సోమిరెడ్డితో ప్రమాణం చేయించాలని అన్నారట. దీనితో పాటు పెరిగిన కరెంటు ఛార్జీలపై వైసీపీ శ్రేణులు చేసిన పోరుబాట సక్సెస్ అయిందని.. రాబోయే ఐదేళ్లు విద్యుత్ ఛార్జీలు పెంచనని చెప్పి.. విద్యుత్ ఛార్జీలు పెంచిన సీఎంపైనా కాకాణి విమర్శలు గుప్పించారు. అబద్దాలు చెప్పడం జగన్ రక్తంలోనే లేదని.. గత ఎన్నికల్లో చంద్రబాబు ఆరు గ్యారంటీల పేరుతో మోసం చేశారని కాకాణి ఆరోపిస్తున్నారు. దీంతో జిల్లాలో ఇద్దరి రాజకీయం కాస్తా.. రాష్ట్రానికి కూడా పాకిందని స్థానికులు చర్చించుకుంటున్నారు.

Also Read: కొలికపూడి మర్యాద రామన్న అవుతాడా?

కాకాణి గోవర్థన్‌రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి.. ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. మీడియా ముందుకు వచ్చి గట్టిగా కౌంటర్ ఇచ్చేశారు. కాకాణి తనపై చేసిన ఆరోపణలో నిజం లేదని.. దానిపై స్పందించాల్సిన అవసరం కూడా లేదనేది సోమిరెడ్డి వాదనగా తెలుస్తోంది. తననపై గోవర్ధన్ రెడ్డి ఎప్పుడూ చేసే ఆరోపణలే కదేనని కొట్టి పారేశారు సోమిరెడ్డి. అదే సమయంలో కరెంట్ ఛార్జీలపై వైసీపీ శ్రేణులు చేపట్టిన పోరుబాటపై మాత్రం కాకాణికి ఘాటుగానే కౌంటర్ ఇచ్చారు.

ఐదేళ్లలో జగన్.. పదిసార్లు కరెంటు ఛార్జీలు పెంచారని.. క్యాబినెట్ అప్రూవల్ లేకుండానే నిర్ణయాలను అప్రూవ్ చేశారని సోమిరెడ్డి ఆరోపించారు. విద్యుత్ రంగంలో ఎన్నో దుర్మార్గాలు చేసిన వారు. మళ్లీ ఉద్యమం చేయడం సిగ్గుచేటంటూ మండిపడ్డారు. లంచాలకు, అవినీతికి పాల్పడి.. రాష్ట్రాన్ని అధోగతిపాలు చేశారని.. ప్రజలపై భవిష్యత్ కరెంటు భారాలు తగ్గించేందుకు చంద్రబాబు కృషి చేస్తున్నారని కాకాణికి ఇచ్చి పడేశారు సోమిరెడ్డి. మరోవైపు…అరబిందో బొగ్గు సప్లైపై.. సీఐడీ విచారణ చేపట్టాలని సోమిరెడ్డి డిమాండ్ చేశారు.

ఎన్నో ఏళ్లుగా వీరి మధ్య జరుగుతున్న మాటల యుద్ధం, పొలిటికల్ వార్ చూస్తుంటే.. ఈ ఇద్దరూ రాజకీయాల్లో ఉన్నంత వరకూ ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. ఇలా.. జిల్లా, రాష్ట్రవ్యాప్తంగా సర్వేపల్లిలో ఆ ఇద్దరికి పొలిటికల్ వార్ తారాస్ధాయికి చేరటం సరికాదని చెప్పుకొస్తున్నారు. రోజూ మీడియా సమావేశాలు పెట్టి ఒకరిమీద ఒకరు దుమ్మితిపోసుకోవడం పరిపాటిగా మారిందని.. అలా కాకుండా.. నియోజక అభివృద్ధి కోసం పాటుపడాలని సూచిస్తున్నారు.

తెలుగుదేశం అధికారంలోకి వచ్చినా.. వైసీపీకి ప్రతిపక్ష హోదా లేకపోయినా.. మాజీమంత్రి కాకాణి మాత్రం ఏ మాత్రం తగ్గకుండా సోమిరెడ్డిని.. ఢీ అంటే ఢీ అంటున్నారు. అభివృద్ధిని మరిచి.. ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతివిమర్శలు చూసి.. నియోజకవర్గ ప్రజలు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారట. ఇద్దరి నేత మధ్య.. వార్‌కు పుల్‌స్టాప్ పడాలని చర్చించుకుంటున్నారట.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×