DEET Telangana APP: ఇది ఇందిరమ్మ ప్రభుత్వం.. ప్రజా ప్రభుత్వం.. అన్ని వర్గాల సంక్షేమమే మా ధ్యేయం.. ఈ మాటలు ఎప్పుడూ చెబుతుంటారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. దావోస్ పర్యటన ముగించుకొని సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ కు వచ్చేశారు. గతం గతః.. ఈసారి పెట్టుబడుల సాధనలో రికార్డ్ సృష్టించారు సీఎం. అందుకే యావత్ తెలంగాణ ప్రజలు ఘన స్వాగతం పలికారు.
తెలంగాణ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికే దక్కుతుందని, సోషల్ మీడియా కోడై కూస్తోంది. అయితే పెట్టుబడుల సాధనతో రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలన్న ఆకాంక్ష కాంగ్రెస్ ప్రభుత్వానిది. అందుకే కాబోలు రాష్ట్రంలోని నిరుద్యోగ యువత కోసం బృహత్తర యాప్ ను ప్రభుత్వం రూపొందించింది. ఈ యాప్ మీ ఫోన్ లో ఉంటే.. జాబ్ మీ చేతిలో ఉన్నట్లే!
తెలంగాణలో పెట్టుబడుల సాధనపై దృష్టి సారించిన సీఎం రేవంత్ సర్కార్.. నిరుద్యోగ సమస్యకు చెక్ పెట్టేందుకు మరో కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా నిరుద్యోగులు ప్రవేట్ జాబ్స్ కోసం కాళ్లరిగేలా కంపెనీలు, సంస్థల చుట్టూ తిరగకుండ ప్రత్యేక యాప్ ను ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్ లో అందుబాటులో ఉండగా, నిరుద్యోగులు యాప్ ను డౌన్లోడ్ చేసుకుంటే చాలు.. ప్రతి ఉద్యోగ సమాచారం అందులో లభిస్తుంది.
DEET Telangana App ఉపయోగించే విధానం..
ఏఐ తో పని చేసేలా నిరుద్యోగుల కోసం ప్రభుత్వం DEET Telangana యాప్ ను తీసుకువచ్చింది. ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకున్న అనంతరం అందులో విద్యార్హత, మీకు ఏ రంగంలో నైపుణ్యత ఉందో ఆ రంగాన్ని నమోదు చేస్తే చాలు.. మీకు రెజ్యూమ్ దానంతట అదే తయారవుతుంది. అంతేకాదు యాప్ లో పార్ట్ టైమ్, ఫుల్ టైమ్, వర్క్ ఫ్రమ్ హోమ్ తో పాటు ఇంటర్న్ షిప్ ఆప్షన్స్ ఉండడం విశేషం.
ఈ యాప్ లో ఆటో మొబైల్స్, ఐటీ, ఫార్మా, హెల్త్ కేర్ ఇతర కంపెనీలు అందుబాటులో ఉంటాయి. మీ విద్యార్హత, మీ నైపుణ్యతను బట్టి మీకు జాబ్ కోసం యాప్, సదరు కంపెనీలకు రిఫర్ చేస్తుంది. అప్పుడు ఆ కంపెనీలు నేరుగా అభ్యర్థులను సంప్రదించి ఉద్యోగ అవకాశం కల్పిస్తారు.
Also Read: Panchayat Elections 2025: పంచాయతీపై నజర్.. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ వ్యూహం ఇదే..!
రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు చేరువ చేయాలన్న లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఈ యాప్ ను అమల్లోకి తీసుకువచ్చింది. మరి మీరు ఎప్పటి నుండో ఉద్యోగ వేటలో ఉన్నారా.. అయితే వెంటనే DEET Telangana యాప్ డౌన్లోడ్ చేయండి.. మీ జాబ్ మీ చెంతకే వచ్చేస్తోంది. మొత్తం మీద ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ యాప్ పట్ల నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.