Prabhas-Rana:సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది నటీనటులు , దర్శకులు, నిర్మాతలు , మ్యూజిక్ డైరెక్టర్ లు ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది ఆర్టిస్టులు ప్రాణ మిత్రులుగా ఉన్నారు. ఒకప్పటి సీనియర్ తరం నుండి ఇప్పటి జూనియర్ తరం వరకు ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది ఆర్టిస్టులు ప్రాణ మిత్రులుగా ఉన్న వారిని మనం ఎంతోమందిని చూసాం. అయితే ఈరోజు ఫ్రెండ్షిప్ డే (Friendship Day) సందర్భంగా మన టాలీవుడ్ సెలబ్రెటీలకు సంబంధించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. ముఖ్యంగా మన సినీ ఇండస్ట్రీలో క్లోజ్ ఫ్రెండ్స్ గా ఉన్న నటీనటులు ఎవరు..? దర్శకులు ఎవరు..? ఇలా ఇప్పటికే ఎంతోమందికి సంబంధించి పేర్లు, వారి మధ్య ఉండే స్నేహం గురించి సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్న సంగతి మనకు తెలిసిందే.
ఫ్రెండ్షిప్ డే సందర్భంగా స్పెషల్ వీడియో పంచుకున్న బాహుబలి టీమ్..
ఈ నేపథ్యంలోనే తాజాగా బాహుబలి టీమ్ (Bahubali Team) ప్రభాస్,రానా కలిసి బాహుబలి సెట్ లో చేసిన అల్లరి ఎలా ఉంటుందో చూడండి అన్నట్లుగా ఒక స్పెషల్ వీడియోని పంచుకున్నారు.ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొట్టడంతో చాలామంది ఫ్యాన్స్ ప్రభాస్(Prabhas) షూటింగ్ సెట్లో మరీ ఇంత ఫన్నీగా ఉంటారా అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే..? ప్రభాస్ – రానా(Rana) ఇద్దరు ముచ్చటించుకుంటూ ఉంటారు.ఆ టైంలో ప్రభాస్ ఫన్నీగా అటు ఇటు డ్యాన్స్ చేస్తూ దేవా లేడు.. భల్లా లేడు..ఏక్ నిరంజన్ అన్నట్లుగా ఒక పాట అందుకుంటాడు.
వైరల్ గా మారిన వీడియో..
అలా రానా, ప్రభాస్ ఇద్దరు ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటున్న టైం లోనే అటుగా దేవసేన (Devasena) పాత్రలో నటించిన అనుష్క (Anushka)వస్తుంది. ఆ సమయంలోనే ఎంత పని చేసావ్ దేవసేనా అంటూ డైలాగ్ వదులుతారు. అలా ఆ తర్వాత అందరూ నవ్వుకుంటారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో స్నేహితుల దినోత్సవం సందర్భంగా బాహుబలి టీం సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ వీడియో చూసిన చాలామంది నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. అయితే ఈ వీడియో చూసిన వాళ్లంతా ప్రభాస్ లో ఈ కామెడీ యాంగిల్ కూడా ఉందా అంటూ నవ్వుకుంటున్నారు.. ఇక ప్రభాస్ కి టాలీవుడ్ ఇండస్ట్రీలో గోపీచంద్ (Gopichand) తో పాటు రానా కూడా మంచి మిత్రుడు గానే ఉన్నారు..
బాహుబలి ది ఎపిక్ పేరిట రీ రిలీజ్..
ఇక ప్రభాస్, అనుష్క, రానా, రమ్యకృష్ణ(Ramyakrishna), సత్యరాజ్ (Sathya Raj), తమన్నా (Tamannaah)లు నటించిన బాహుబలి సినిమాని రాజమౌళి (Rajamouli) రెండు పార్ట్ లుగా విడుదల చేశారు. అయితే ఈ రెండు పార్ట్ లను కలిపి బాహుబలి ది ఎపిక్(Bahubali The Epic) పేరుతో అక్టోబర్ లో రీ రిలీజ్ చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఇక బాహుబలి షూటింగ్ సెట్లో ప్రభాస్ – రానాల అల్లరి ఎలా ఉందో మీరు కూడా ఒకసారి ఈ వీడియో చూసి ఆనందించండి.
also read:Krishna Master: ఢీ కొరియోగ్రాఫర్ కృష్ణ మాస్టర్ అరెస్ట్.. పోక్సో కేసులో కేసు నమోదు!
Every day on set felt like #FriendshipDay 🤗#Prabhas @RanaDaggubati @MsAnushkaShetty #BaahubaliArchives#Baahubali #BaahubaliTheEpic #Celebrating10YearsOfBaahubali#BaahubaliTheEpicOn31stOct pic.twitter.com/tXDLsbaGxm
— Baahubali (@BaahubaliMovie) August 3, 2025