Cholesterol: రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉండటం అనేది గుండె జబ్బులకు, స్ట్రోక్‌కు ప్రధాన కారణం. సరైన ఆహారం, లైఫ్ స్టైల్ మార్పులతో ఈ సమస్యను గణనీయంగా తగ్గించుకోవచ్చు. ఇలాంటి సమయంలో డాక్టర్ సలహా తప్పనిసరి అయినప్పటికీ.. కొన్ని హోం రెమెడీస్ కూడా కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో సహాయపడతాయి. ఎలాంటి హోం రెమెడీస్ కొలెస్ట్రాల్ తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
1. వెల్లుల్లి (Garlic):
వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ అనే సమ్మేళనం చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. ప్రతిరోజూ ఉదయం పరగడుపున ఒకటి లేదా రెండు పచ్చి వెల్లుల్లి రెబ్బలను నమలడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంలో వెల్లుల్లి చాలా బాగా ఉపయోగపడుతుంది.
2. ఉల్లిపాయ (Onion):
ఉల్లిపాయలో ఉండే క్వెర్సెటిన్ అనే యాంటీఆక్సిడెంట్ ఉంటుంది. ఇది మంచి కొలెస్ట్రాల్ (HDL) స్థాయిలను పెంచడంలో సహాయపడుతుంది. సలాడ్‌లో పచ్చి ఉల్లిపాయను తీసుకోవడం వల్ల కూడా అద్భుతమైన ప్రయోజనం ఉంటుంది.
3. ఉసిరికాయ (Amla):
ఉసిరికాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో ఉపయోగపడుతుంది. అంతే కాకుండా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది. ఒక టీస్పూన్ ఉసిరి పొడిని గోరువెచ్చని నీటిలో కలిపి ప్రతిరోజూ తాగడం వల్ల కూడా అనేక లాభాలు ఉంటాయి.
4. అవిసె గింజలు (Flaxseeds):
అవిసె గింజలలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి.. గుండె పనితీరును మెరుగుపరుస్తాయి. పొడి చేసిన అవిసె గింజలను పెరుగు, సలాడ్‌లు లేదా స్మూతీస్‌లో కలుపుకొని తీసుకోవడం వల్ల కూడా అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి.
5. మెంతి గింజలు (Fenugreek Seeds):
మెంతులలో ఉండే సపోనిన్స్ అనే సమ్మేళనాలు శరీరంలో కొలెస్ట్రాల్ శోషణను నిరోధిస్తాయి. ఒక టీస్పూన్ మెంతి గింజలను రాత్రంతా నానబెట్టి.. ఉదయం పరగడుపున నీటితో సహా తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. కొలెస్ట్రాల్ నియంత్రణలో మెంతులు చాలా బాగా ఉపయోగపతాయి.
6. ఆపిల్ సైడర్ వెనిగర్ (Apple Cider Vinegar):
ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక టీస్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్‌ను కలిపి రోజూ తాగడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. ఇది శరీరంలోని కొవ్వును కరిగించడానికి కూడా సహాయపడుతుంది.
7. గ్రీన్ టీ (Green Tea):
గ్రీన్ టీలో ఉండే యాంటీఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో తోడ్పడతాయి. ప్రతిరోజూ రెండు లేదా మూడు కప్పుల గ్రీన్ టీ తాగడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
8. ఓట్స్ (Oats):
ఓట్స్‌లో బీటా-గ్లూకాన్ అనే కరిగే పీచుపదార్థం ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థలో కొలెస్ట్రాల్‌ను బంధించి శరీరం నుంచి బయటకు పంపిస్తుంది. ఉదయం పూట ఓట్స్ తీసుకోవడం చాలా మంచిది.
Also Read: ఒత్తిడిని తగ్గించే.. సింపుల్ చిట్కాలు ఇవే !
9. బాదం పప్పు, వాల్‌నట్స్ (Almonds, Walnuts):
ఈ నట్స్‌లో మోనోఅన్‌సాచురేటెడ్ ఫ్యాట్స్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. రోజుకు కొన్ని బాదం పప్పులు, వాల్‌నట్స్ తినడం కూడా మంచిది.
10. శారీరక వ్యాయామం:
ఇంటి చిట్కాలతో పాటు.. ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు నడవడం, వ్యాయామం చేయడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. ఇది రక్త ప్రసరణను మెరుగుపరచి, గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.