BigTV English
Advertisement

Miheeka: ప్రెగ్నెన్సీ వార్తల పై స్పందించిన మిహీక.. ఫుల్ క్లారిటీ ఇచ్చిందిగా?

Miheeka: ప్రెగ్నెన్సీ వార్తల పై స్పందించిన మిహీక.. ఫుల్ క్లారిటీ ఇచ్చిందిగా?

Miheeka: మిహీక బజాజ్ (Miheeka Bajaj) పరిచయం అవసరం లేని పేరు. ప్రముఖ నటుడు రానా దగ్గుబాటి(Rana Daggubati) భార్యగా ఈమె అందరికీ ఎంతో సుపరిచితమే.మిహీక ఈవెంట్ మేనేజర్ అనే సంగతి మనకు తెలిసిందే. అలాగే ముదిత అనే ఒక మెంటల్ హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రాం కూడా నిర్వహిస్తూ ఉన్నారు. అదేవిధంగా గృహిం అనే ఆర్కిటెక్చర్ ఇంటీరియర్ స్టూడియోని కూడా మిహీక నడుపుతూ వృత్తిపరమైన జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నారు. అలాగే ఈమె సంపాదించిన దాంట్లో కొంత భాగం కొన్ని ఎన్జీవో సంస్థల ద్వారా కోలాబరేట్ అవుతూ పెద్ద ఎత్తున సహాయ సహకారాలను కూడా నిర్వహిస్తున్నారు. ఇలా వృతి పరమైన జీవితంలో ఎంతో బిజీగా ఉన్న ఈమె వ్యక్తిగత జీవితంలో కూడా చాలా సంతోషంగా గడుపుతున్నారు.


బుల్లి రానా రాబోతున్నారా?

ఇకపోతే మిహిక సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ నిత్యం తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు. అయితే ఇటీవల ఈమె సోషల్ మీడియా వేదికగా ఒక ఫోటోని షేర్ చేశారు. ఈ ఫోటోకు నాకు అలానే అనిపిస్తుంది అంటూ క్యాప్షన్ ఇవ్వడంతో ఈమె ప్రెగ్నెన్సీ(pregnancy) గురించే తెలియచేస్తున్నారు అంటూ అభిమానులు ఈ ఫోటోని మరింత వైరల్ చేయడమే కాకుండా బుల్లి రానా రాబోతున్నారు అంటూ ఈ ఫోటోకి కామెంట్లు చేస్తూ వచ్చారు.


ప్రెగ్నెన్సీ వార్తలలో నిజం లేదు…

ఈ విధంగా మిహీక ప్రెగ్నెన్సీ వార్తలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. ఇలా తన ప్రెగ్నెన్సీ గురించి సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న నేపథ్యంలో మిహిక ఈ వార్తలపై స్పందించారు. ఈ సందర్భంగా ఈమె రిప్లై ఇస్తూ… “ఈ విషయంలో ఎవరైతే కన్సర్న్ గా ఫీల్ అవుతున్నారో అందుకు మీ అందరికీ ధన్యవాదాలు అయితే మరోసారి చెబుతున్నాను నేను ప్రెగ్నెంట్ కాదు అంటూ” ఈమె క్లారిటీ ఇచ్చారు. ఇలా మిహీక ప్రెగ్నెన్సీ రూమర్లను ఖండిస్తూ క్లారిటీ ఇవ్వడంతో ఈ వార్తలకు పులి స్టాప్ పెట్టినట్టు అయ్యింది. అయితే ఈ గుడ్ న్యూస్ త్వరలో చెబితే బాగుంటుందని అభిమానులు కూడా కోరుకుంటున్నారు.

ఇక రానా మిహీక 2021 వ సంవత్సరంలో కేవలం కుటుంబ సభ్యులు సమక్షంలో వివాహం జరుపుకున్న సంగతి తెలిసిందే. వీరి వివాహం కరోనా సమయంలో జరిగిన నేపథ్యంలో ఎలాంటి హడావిడి లేకుండా చాలా సింపుల్ గా కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. వీరి వివాహం జరిగే దాదాపు నాలుగు సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో ఇంకా పిల్లల గురించి ప్లాన్ చేయని నేపథ్యంలో తరచూ ఈమె ప్రెగ్నెన్సీ గురించి వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇక రానా విషయానికి వస్తే.. ప్రస్తుతం ఈయన నిర్మాతగా, నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. కేవలం సినిమాలు మాత్రమే కాకుండా వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ రానా బిజీగా ఉన్నారు. బాహుబలి సినిమా తర్వాత ఈయన పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు. కథ ప్రాధాన్యత ఉంటే విలన్ పాత్రలలో నటించడానికి కూడా రానా వెనకాడటం లేదని చెప్పాలి.

Also Read: Big Tv Kissik Talks: కర్మ ఎవరిని వదలదు.. అమర్ తో విభేదాలు.. ఓపెన్ అయిన పల్లవి ప్రశాంత్!

Related News

Prakash Raj: కేరళ రాష్ట్ర అవార్డులు.. ప్రకాశ్ రాజ్ పై చైల్డ్ ఆర్టిస్టు ఫైర్

Megastar Chiranjeevi : అన్నపూర్ణ స్టూడియోలో మన శంకరవరప్రసాద్ గారు, సినిమా పూర్తయ్యేది అప్పుడే

Sai Durgha Tej : స్టార్డం అంటే హీరోలతో ఫోటోలు దిగడం కాదు, సాయి తేజ్ అలా అనేశాడేంటి?

Ram Charan: ఆ బాలీవుడ్ డైరెక్టర్ తో రామ్ చరణ్ సినిమా, ఈసారి హిట్ ఖాయం

Thiruveer: ఆ సినిమా టికెట్ కౌంటర్ లోనే చచ్చిపోతా అనుకున్నా

Kaantha First Spark: దుల్కర్ కాంత.. చాలా గట్టిగానే ఉండబోతున్నట్టుందే

Parasakthi: సింగారాల సీతాకోకవే.. ఏముందిరా సాంగ్.. నెక్స్ట్ లెవెల్ అంతే

Ustaad Bhagat Singh : సక్సెస్ కంటే ఫెయిల్యూర్స్ ఎక్కువ, మరి ఉస్తాద్ భగత్ సింగ్ పరిస్థితి ఏంటి?

Big Stories

×