BigTV English

BB Telugu 8: రెండు గ్రూపులుగా చీలిన హౌస్ మేట్స్.. పరిస్థితి అంతవరకు వచ్చిందా..?

BB Telugu 8: రెండు గ్రూపులుగా చీలిన హౌస్ మేట్స్.. పరిస్థితి అంతవరకు వచ్చిందా..?

BB Telugu 8: తాజాగా జరుగుతున్న పరిస్థితులను బట్టి చూస్తే బిగ్ బాస్ (Bigg Boss) సీజన్ 8 లో గ్రూపిజం బాగా పెరిగిపోయింది. హరితేజ ఎలిమినేట్ అయిన తర్వాత ప్రస్తుతం ఇంట్లో 5 మంది సభ్యులు ఉన్నారు. అందులో కన్నడ సీరియల్ బ్యాచ్ 5 మంది ఒక గ్రూపుగా.. మిగిలిన 5 మంది మరో గ్రూపుగా తయారవడం చూసేవారికి ఆశ్చర్యంగా అనిపిస్తోంది.నామినేషన్ లో టేస్టీ తేజ తాజాగా కన్నడ బ్యాచ్ పై విరుచుకుపడ్డారు. ప్రస్తుతం నిఖిల్, యష్మీ, పృథ్వీ, ప్రేరణ నలుగురు కన్నడ బ్యాచ్.. అయితే తెలుగమ్మాయి విష్ణు ప్రియ పృథ్వీని ఇష్టపడుతోంది కాబట్టి కన్నడ బ్యాచ్ తో చేరిపోయింది. ఇక మరోవైపు గౌతమ్, అవినాష్ , రోహిణి, టేస్టీ తేజ, నబీల్.. ఈ 5 మంది ఒక గ్రూపుగా విడిపోయారు. ఈసారి ఎలిమినేషన్ ఎవరిది ఉంటుందో..? దాన్నిబట్టి హౌస్ లో ఆధిపత్యం అవతల గ్రూపు కే వుంటుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి.


ఇకపోతే ఇలా రెండు బ్యాచ్ లుగా విడిపోవడానికి కారణం ఈ వారం నామినేషన్స్ అని చెప్పాలి. ఇకపోతే నిఖిల్ చాలా దారుణంగా గ్రూప్ ఇజం చేసి మాట్లాడడం నిన్న నామినేషన్స్ లో ప్రతి ఒక్కరికి అర్థం అయిపోయి ఉంటుంది. 11వ వారం నామినేషన్ కి సంబంధించి టేస్టీ తేజాను నిఖిల్ నామినేట్ చేశారు. అయితే టేస్టీ తేజ కంటే కూడా యష్మీ పెద్ద తప్పు చేసినా.. నిఖిల్ ఆ విషయాన్ని దాచిపెడుతూ టేస్టీ తేజను నామినేట్ చేయడం ఇక్కడ నెటిజన్స్ కి ఆగ్రహాన్ని తెప్పించింది. ముఖ్యంగా ఈ విషయంపై ప్రశ్నించే ప్రయత్నం టేస్టీ తేజ చేయగా కన్నడ బ్యాచ్ మొత్తం ఆయనపై పడిపోయి విరుచుకుపడ్డారు. దీంతో కన్నడ బ్యాచ్ చేసే ఆగడాలు అందరికీ తెలిసిపోయాయి.

ఇప్పుడు దీనికి తోడు ఇప్పటివరకు మంచివాడు అనిపించుకున్న నిఖిల్ ఒక్కసారిగా విష నాగులా మారి తన అసలు రూపాన్ని బయటపెట్టారు. ఇకపోతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం తెలుగు రియాల్టీ షోలో కన్నడ బ్యాచ్ ను అందలం ఎక్కించడం అందరికీ ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. ఎందుకంటే ఇప్పటివరకు తెలుగు సీజన్ లో 12 మంది ఎలిమినేట్ అయితే.. 12 మంది కూడా తెలుగు వాళ్లే కావడం.. కన్నడ బ్యాచ్ కి ఏ రేంజ్ లో కొమ్ము కాస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా బెజవాడ బేబక్క, శేఖర్ భాష, అభయ్ నవీన్, సోనియా ఆకుల , ఆదిత్య ఓం, నైనిక , కిర్రాక్ సీత, నాగమణికంఠ, మెహబూబ్ , నయని పావని ,గంగవ్వ, హరితేజ ఇలా మొత్తం అందరూ కూడా తెలుగు వాళ్లే. కన్నడ బ్యాచ్ ని ఒక్కరు కూడా పొరపాటున కూడా టచ్ చేయడం లేదు. ముఖ్యంగా వీరిని ఎలిమినేట్ చేయాలని ఆడియన్స్ డిమాండ్ చేస్తున్నా.. బిగ్ బాస్ మాత్రం వీరి జోలికి అస్సలు వెళ్లడం లేదు.


గేమ్స్ తప్పుగా ఆడినా..అబద్ధాలు చెప్పినా.. గ్రూప్ ఇజం ఇలా ఎన్ని వెధవ వేషాలు వేసినా వీకెండ్ లో నాగార్జున వచ్చి తెలుగు వారినే తిడుతున్నారు. దీన్ని బట్టి చూస్తే కన్నడ బ్యాచ్ కి నో ఎలిమినేషన్ అనే అగ్రిమెంట్ ఉందేమో కానీ ఇప్పుడు కన్నడ బ్యాచ్ చెలరేగిపోతున్నారు. మరి పాపం తెలుగువారు ఎలా ఈ బ్యాచ్ ని తట్టుకొని టైటిల్ విన్నర్ గా నిలుస్తారో చూడాలి.

Related News

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Ariyana: సొంత ఇంటికల నెరవేర్చుకోబోతున్న అరియానా.. తెగ కష్టపడుతుందిగా?

Big Stories

×