BB9 Wild Cards:తెలుగు బిగ్ బాస్ రియలిటీ షో ఇప్పటికే 8 సీజన్ లు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని.. ప్రస్తుతం 9వ సీజన్ నడుస్తోంది. ఈ తొమ్మిదవ సీజన్ కోసం కాస్త డిఫరెంట్గా ఆలోచన చేశారు బిగ్ బాస్ యాజమాన్యం. అలా ఈసారి ఏకంగా 6 మంది కామనర్ లకు అవకాశం ఇస్తూ.. బిగ్ బాస్ “అగ్నిపరీక్ష” పేరుతో కొంతమందిని సెలెక్ట్ చేసి, వారికి కొన్ని టాస్కులు ఇచ్చి అందులో బాగా రాణించిన వారిని హౌస్ లోకి తీసుకున్నారు. అలా ఇప్పటికే హౌస్ లోకి ఏకంగా ఆరుగురు కామనర్లు ఎంట్రీ ఇచ్చారు. అయితే ఎలిమినేషన్ ద్వారా ఇప్పటికే నలుగురు కంటెస్టెంట్లు బయటకు వెళ్లడంతో పాటు ఈసారి డబుల్ ఎలిమినేషన్ ఉండబోతున్నట్టు తెలుస్తోంది. అందుకే ఐదో వారం ఓ ఆరుగురు కంటెస్టెంట్లను వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి పంపబోతున్నారట.మరి బిగ్ బాస్ సీజన్ 9 లో వైల్డ్ కార్డు ద్వారా నేడే ఎంట్రీ ఇవ్వబోతున్న ఆ 6గురు ఎవరు అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
బిగ్ బాస్ సీజన్ 9 లో 5వ వారం వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా దివ్వెల మాధురి, అలేఖ్య చిట్టి పికిల్స్ సిస్టర్స్ లో ఒకరైన రమ్య మోక్షా, నిఖిల్ నాయర్, అయేషా జీనథ్, గౌరవ గుప్తా, శ్రీనివాస సాయి.. మరి వీళ్ళు ఎవరు..బ్యాగ్రౌండ్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.
టెక్కలి నియోజకవర్గం ఎమ్మెల్సీ అయినటువంటి దువ్వాడ శ్రీనివాస్ తో ఉన్న బంధం కారణంగా ఆ మధ్యకాలంలో మెయిన్ మీడియాలో, సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అయిన పేరు దివ్వెల మాధురి.. వైయస్ఆర్సీపీ పార్టీలో కీలకంగా ఉంటూ టెక్కలి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కి దగ్గరవ్వడంతో వీరి మేటర్ కాస్త రచ్చకెక్కింది. దాంతో దివ్వెల మాధురి చాలా ఫేమస్ అయింది. ఈ గొడవ కంటే ముందే సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ ఫాలోవర్లను సంపాదించింది. అలా సోషల్ మీడియా మెయిన్ మీడియాతో రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయిన దివ్వెల మాధురిని బిగ్ బాస్ సీజన్ 9 లోకి వైల్డ్ గార్డ్ ద్వారా హౌస్ లోకి పంపించబోతున్నారు.
మాటీవీలో ప్రసారమయ్యే పలుకే బంగారమాయనే, గృహలక్ష్మి సీరియల్స్ ద్వారా ఫేమస్ అయిన నటుడు నిఖిల్ నాయర్ అంటే తెలియని వారు ఉండరు. ఈయనకి సీరియల్ అభిమానులు చాలామందే ఉన్నారు. అయితే అలాంటి నిఖిల్ నాయర్ బిగ్ బాస్ సీజన్ 9లోకి వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇవ్వనున్నారు. హైట్ , వెయిట్ పర్సనాలిటీ బాగుండడంతో ఫిజికల్ టాస్క్ ల్లో ఈయన ఇరగదీస్తాడనే కారణంతో హౌస్ లోకి పంపిస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే కాస్త అగ్రెసివ్ గా కూడా కనిపిస్తారు. హౌస్ లో రచ్చ సృష్టించాలంటే అగ్రెసివ్ గా ఉండే వాళ్ళు కూడా ఉండాలి. అందుకే నిఖిల్ నాయర్ ని తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.
అలేఖ్య చిట్టి పికిల్స్ తో సోషల్ మీడియాలో ఎక్కువగా వైరలయ్యారు ఈ ముగ్గురు అక్క చెల్లెళ్లు. వీరిలో రెండో సిస్టర్ రమ్య మోక్ష.. ఈమె సోషల్ మీడియాలో రీల్స్, షార్ట్స్ చేస్తూ ఫేమస్ అయ్యింది. అలాగే తన అందంతో ఆ మధ్యకాలంలో హీరోయిన్ ఛాన్స్ కూడా అందుకున్నట్టు వార్తలు వినిపించాయి. కానీ తాజాగా బిగ్ బాస్ సీజన్ 9 లో వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి వెళ్ళబోతోంది. అలాగే కయ్యానికి కాలు దువ్వెలా ఉండే రమ్య మోక్ష పర్ఫెక్ట్ కంటెస్టెంట్ అనే ఉద్దేశంతో హౌస్ లోకి పంపిస్తున్నట్టు సమాచారం.
మాటీవీలో ప్రసారమయ్యే గీత ఎల్.ఎల్.బి అనే సీరియల్ ద్వారా సీరియల్ ప్రేక్షకులకు దగ్గరైన గౌరవ్ గుప్తా.. వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. హౌస్ లో టాస్కులు బాగా ఆడి, లవ్ ట్రాక్ లు నడవాలంటే ఇలాంటి యంగ్ కంటెస్టెంట్ లను పంపించడం చాలా అవసరం.
యంగ్ హీరో గా ఇండస్ట్రీలో రాణిస్తున్న శ్రీనివాస సాయి అక్కినేని సుమంత్ హీరోగా నటించిన గోల్కొండ హైస్కూల్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశారు.ఈ సినిమా తో వచ్చిన గుర్తింపుతో పలు సినిమాల్లో అవకాశాలు వచ్చినప్పటికీ అవేవీ ఈయనకు పేరు తెచ్చిపెట్టలేదు. అందుకే బిగ్ బాస్ సీజన్ 9 ద్వారా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తున్నారు.
బిగ్ బాస్ హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్లే కాదు గ్లామర్ కూడా ఉండాలి. గ్లామర్ ఉంటేనే ప్రేక్షకులు ఎక్కువగా చూస్తారు. ఈ కారణం తోనే అయేషా జీనత్ ని హౌస్ లోకి పంపిస్తున్నారు. అయితే అయేషా జీనథ్ కి ఇప్పటికే తమిళ్ బిగ్ బాస్ కి వెళ్లిన అనుభవం ఉంది. అందుకే తెలుగు బిగ్ బాస్ లోను తన ఆటతో రాణించే అవకాశం కనిపిస్తోంది. మాటీవీలో సావిత్రి గారి అబ్బాయి సీరియల్ తో ఫేమస్ అయింది.అలాగే కిర్రాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ సీజన్ 2 లో కూడా రాణించింది..
అలా హౌస్ లోకి గ్లామర్, స్ట్రాంగ్ యంగ్ కంటెస్టెంట్లను పంపి బిగ్ బాస్ చూసే ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచాలి అనే ఉద్దేశంతో బిగ్ బాస్ యాజమాన్యం వీరిని సెలెక్ట్ చేసినట్టు తెలుస్తోంది.
ALSO READ:Film industry: ప్రముఖ నటి, ఆస్కార్ గ్రహీత కన్నుమూత!