BigTV English

IAS Amoy Kumar: ఐఏఎస్ అధికారి అమోయ్ ‘భూ’లీలలు, మూడు జిల్లాలకు విస్తరణ.. డొంక కదులుతోందా?

IAS Amoy Kumar: ఐఏఎస్ అధికారి అమోయ్ ‘భూ’లీలలు, మూడు జిల్లాలకు విస్తరణ.. డొంక కదులుతోందా?

IAS Amoy Kumar: తెలంగాణ ఐఏఎస్ అధికారి అమోయ్‌కుమార్‌ భూ ఆక్రమణల కేసు వ్యవహారం ఎంత వరకు వచ్చింది? కలెక్టర్ నుంచి తహశీల్దార్ స్థాయి అధికారులు ఈడీ ముందు హాజరయ్యారు. ఇంతకీ భూముల వ్యవహార మేంటి? తెలంగాణను దశాబ్దం పాటు పాలించింది కారు పార్టీ. మా పాలన బేష్ అంటూ ఊదర గొడుతున్నారు నేతలు. అప్పటి ప్రభుత్వంలోని లోపాలు ఒకొక్కటిగా బట్టబయలవుతున్నాయి.


తెలంగాణలో ఈ మధ్య బాగా పాపులర్ అయిన అధికారి ఐఏఎస్ అమోయ్‌కుమార్‌. ఆయన భూలీలలకు ఏకంగా ఈడీ రంగంలోకి దిగిందంటే.. పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అప్పటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్, ఆర్డీఓ, తహశీల్దార్ ఇలా అందరూ కట్టకట్టుకుని ఈడీ ముందు వాలిపోయారు.

లేటెస్ట్‌గా మూడు జిల్లాల నుంచి సీఎంవోకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దల అండ దండలతో యథేచ్ఛగా భూ బదలాయింపులకు ఆయన పాల్పడినట్టు తెలుస్తోంది. మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో పెద్దఎత్తున ప్రభుత్వ భూములు ప్రైవేట్ పరం చేశారన్నది అందులోని అసలు సారాంశం.


దీంతో మూడు జిల్లాల భూములపై రేవంత్ సర్కార్ ఫోకస్ చేసింది. కలెక్టర్‌గా అమోయ్‌కుమార్ ఇచ్చిన ప్రొసీడింగ్స్ బయటకు తీయాలని సీఎంవో నుంచి ఆదేశాలు వెళ్లినట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

ALSO READ: ప్రదక్షిణలు చేస్తుండగా గుండెపోటు.. తనువు చాలించిన యువకుడు.. ఎక్కడ జరిగిందంటే?

ధరణికి ముందు ఆ తర్వాత ఉన్న ల్యాండ్ వివరాలను పోల్చి చూడాలని ఆదేశాలు వెళ్లినట్టు తెలుస్తోంది. ధరణిలోని  లొసుగులను తమకు అనుకూలంగా మార్చుకుని ప్రైమ్ ఏరియాలో కోట్లాది రూపాయల విలువ చేసే భూములను తక్కువ ధరకి ప్రైవేట్ వ్యక్తుల పేరిట మార్చారన్నది ఆయనపై ప్రధాన ఆరోపణ.

భూముల వ్యవహారంపై రెవిన్యూ, ఎండోమెంట్, ఫారెస్ట్ అధికారులు రంగంలోకి దిగేశారు. వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. ధరణికి ముందు ఆ తర్వాత భూముల్లో చాలా వ్యత్యాసం ఉన్నట్లు కనిపిస్తోంది.

2014 ముందు ప్రభుత్వ భూములు ఎంతమేరకు ఉన్నాయో తెలియని పరిస్థితి. తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ కింద సుమారు 35 వేల ఎకరాల భూముల వివరాలు ధరణిలో నమోదు కాలేదు. వాటితోపాటు అసైన్డ్ భూముల వివరాలను అధికారులు పైకి తీస్తున్నారు.

కొద్దిరోజుల కిందట ధరణి పోర్టల్ నిర్వహణ బాధ్యత ఎన్ఐసీకి అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో గత ప్రభుత్వంలో జరిగిన భూముల అక్రమాల వెలికి తీత మరింత సులభమని అవుతుందని సచివాలయ వర్గాలు చెబుతున్నాయి.

Related News

Weather News: కొన్ని గంటల్లో ఈ ఏరియాల్లో భారీ వర్షం.. ఇక రాత్రంతా దంచుడే

Nagarjunasagar flood: నాగార్జునసాగర్‌ గేట్లు ఎత్తివేత.. సందర్శకులకు బిగ్ అలర్ట్!

Hyderabad Rains: అమీర్‌పేట ముంపు ప్రాంతాల్లో సీఎం రేవంత్ పర్యటన.. అధికారులకు కీలక ఆదేశాలు

Malreddy Ranga Reddy: రంగారెడ్డి ఎమ్మెల్యే మల్‌రెడ్డి కుటుంబంలో రాఖీ పండుగ రోజే విషాదం

Rain News: భారీ వర్షం.. ఈ జిల్లాల్లో కుండపోత వాన.. ఇళ్ల నుంచి బయటకు రావొద్దు

Guvvala Balaraju: బీజేపీలో చేరిన గువ్వల.. కేటీఆర్‌పై హాట్ కామెంట్స్..

Big Stories

×