BigTV English
Advertisement

BB Telugu 8 Promo: పాపం టేస్టీ తేజ.. మీద పడ్డ కన్నడ బ్యాచ్..!

BB Telugu 8 Promo: పాపం టేస్టీ తేజ.. మీద పడ్డ కన్నడ బ్యాచ్..!

BB Telugu 8 Promo : తెలుగు బుల్లితెర ఆడియన్స్‌కు ఎప్పటికప్పుడు మంచి వినోదాన్ని పంచుతూ.. భారీ టీఆర్పీ రేటింగ్స్ సొంతం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్న ఏకైక రియాల్టీ షో బిగ్ బాస్. ఏడు సీజన్లు పూర్తి చేసుకున్న ఈషో ఇప్పుడు 8వ సీజన్లో 10 వారాలు పూర్తి చేసుకుంది. 11వ వారానికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియ మొదలవగా.. అందులో టేస్టీ తేజను ఒక్కడిని చేసి కన్నడ బ్యాచ్ ఒక్కసారిగా మీద పడడంతో నెటిజన్స్ సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా 11వ వారం సోమవారానికి సంబంధించి తాజా ప్రోమోని విడుదల చేశారు నిర్వాహకులు. మరి ప్రోమోలో ఏముందో ఇప్పుడు చూద్దాం.


ప్రోమో విషయానికి వస్తే..”స్మాష్ ద పెయింటింగ్” అనే టాస్క్ తో కంటెస్టెంట్స్ ముందుకు వచ్చారు బిగ్ బాస్. “బిగ్ బాస్ ఇంట్లో మీ ప్రయాణం ఒక అందమైన పెయింటింగ్ లా ఉంటుందా..? లేక మరక పడుతుందా..? అనేది మీరు ఈ ఇంట్లో ఏర్పరుచుకున్న సంబంధాల మీద ఆధారపడి ఉంటుంది. ఈ రోజు నామినేషన్స్ లో భాగంగా ఎవరి ప్రయాణమైతే ఇంట్లో కొనసాగకూడదని అనుకుంటున్నారో.. వారి పెయింటింగ్ ను పాడు చేయాల్సి ఉంటుంది” అంటూ నామినేషన్ ప్రక్రియకు సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ ను తెలిపారు బిగ్ బాస్.

తొలి నామినేషన్స్ లో భాగంగా గౌతమ్ ఫ్రేమ్ కి ప్రేరణ పెయింట్ వేసి నామినేట్ చేసింది.”నాకు ఈయన జర్నీ అర్థం కావట్లేదు. టీం వర్క్ అనే కాన్సెప్ట్ కి వ్యతిరేకంగా వెళ్తున్నట్టు అనిపించింది” అంటూ తెలిపింది. దీంతో వెంటనే గౌతమ్ మాట్లాడుతూ..”ఒక మనిషికి బ్రాండింగ్ వేయడం అనేది డిస్ రెస్పెక్ట్. అవమానానికి, ఆచరించకపోవడానికి చాలా తేడా ఉంది. ప్రతిదానికి అరే నువ్వు తప్పు చేసినావ్.. నీ వల్లే ఓడిపోయాము అంటూ గుచ్చి గుచ్చి చెప్పడం టీం మేట్స్ లక్షణం కాదు. మెగా చీఫ్ లక్షణం అంతకంటే కాదు అంటూ” ఫైర్ అయ్యారు గౌతమ్. ఇక్కడ “ఫేవరిజం, గ్రూప్ యిజం నడుస్తోందా” అంటూ కూడా ప్రశ్నించారు. కావాలనే ఈ పాయింట్ తీసుకొచ్చారు అంటూ ప్రేరణ అడగగా.. కావాలని కాదు అదే నిజం అంటూ గౌతమ్ తెలిపారు.


తరవాత నిఖిల్.. టేస్టీ తేజ ఫ్రేమ్ పై పెయింట్ వేసి నామినేట్ చేశారు.”ఎవిక్షన్ షీల్డ్ ప్రక్రియ జరుగుతున్నప్పుడు టేస్టీ తేజ తప్పు చేయడం జరిగింది. ఏంటి ఇది అని అడిగితే..? అవును నేను తప్పు చేశాను అని కూడా ఒప్పుకున్నాడు” అంటూ నిఖిల్ చెప్పగా.. ఆ తర్వాత టేస్టీ తేజ మాట్లాడుతూ.. “అసలు యష్మీ చేసింది తప్పా? కాదా?..  ఆ అమ్మాయి గుడ్డు వేసిన విషయం మీకు తెలియదా?” అంటూ ప్రశ్నించాడు టేస్టీ తేజ. “ఆ తర్వాత తెలిసింది” అంటూ కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు నిఖిల్. మరి ఆ అమ్మాయి చేసింది తప్పా? కాదా? అంటూ టేస్టీ తేజ ప్రశ్నించగా.. నిఖిల్ “అది నాకు తెలియదు” అంటూ అమ్మాయిని సేవ్ చేసే ప్రయత్నం చేశారు. “నిజం చెప్పు..?” అని అడిగితే నిఖిల్ దాని గురించి..”నేను మాట్లాడను” అన్నాడు. దాంతో టేస్టీ తేజ “భయమేసిందా.?” అంటూ కామెంట్ చేశారు. ఇక తర్వాత పృథ్వీ, యష్మీ ఇలా కన్నడ బ్యాచ్ మొత్తం టేస్టీ తేజ పై పడిపోవడం చూసేవారికి కాస్త బాధగా అనిపించింది.

Related News

Bigg Boss 9 Telugu : బిగ్ బాస్ లో ఉండటం ఆ కంటెస్టెంట్ కు ఇష్టం లేదా..? ఈ వారం ఇతనే ఎలిమినేట్..?

Bigg Boss 9 Promo: రీతూ Vs దివ్య.. చిచ్చుపెట్టిన సాయి!

Bigg Boss 9 Telugu : గౌరవ్ కు గట్టిదెబ్బ… ఇదేందయ్యా ఇదీ… కట్టప్ప కన్నా తనూజా – ఇమ్మాన్యుయేల్ వెన్నుపోటే దారుణం

Bigg Boss 9 Telugu Day 60 : ఇమ్మూను బోల్తా కొట్టించిన రీతూ… తనూజా వల్ల గౌరవ్ కు తీరని అన్యాయం… దివ్య దిక్కుమాలిన ప్లాన్ సక్సెస్

Bigg Boss 9 Madhuri: వాళ్లు రెమ్యునరేషన్‌ ఇచ్చేదేంటి.. నాకే నెలకు కోటి వస్తుంది.. దివ్వెల మాధురి

Bigg Boss 9 Promo: కెప్టెన్సీ వార్‌.. హీటెక్కిన ఆరేంజ్‌ టీం డిస్కషన్‌, తగ్గేదే లే అంటున్న గౌరవ్!

Bigg Boss 9 Promo: సీక్రెట్ టాస్క్.. అడ్డంగా బుక్కైన ఇమ్మూ !

Bigg Boss 9 Telugu : దారుణంగా పడిపోయిన బిగ్ బాస్ ఓటింగ్ రిజల్ట్.. అతనే విన్నర్..?

Big Stories

×