BigTV English

BB Telugu 8 : జాక్ పాట్ కొట్టిన ప్రేరణ.. రూ. అరకోటికి పైగా..?

BB Telugu 8 : జాక్ పాట్ కొట్టిన ప్రేరణ.. రూ. అరకోటికి పైగా..?

BB Telugu 8 : బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ తో ప్రారంభమైంది. ఆ తర్వాత వైల్డ్ కార్డు ఎంట్రీ అంటూ మరో ఎనిమిది మందిని హౌస్ లోకి తీసుకొచ్చారు. అలా మొత్తం మీద 22 మంది కంటెస్టెంట్స్ తో ఈ సీజన్ ను నడిపించారు. ముఖ్యంగా 14 మంది కంటెస్టెంట్స్ లో విష్ణుప్రియ(Vishnu Priya) తప్ప పాపులర్ అయినవారు ఒక్కరు కూడా లేరు. ఇక వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ కి మాత్రం మంచి క్రేజ్ ఉంది. అందరూ కూడా బుల్లితెర షోలలో సందడి చేసిన వాళ్ళే. అలాంటి వారిలో హరితేజ, అవినాష్, రోహిణి, గంగవ్వ అందరూ కూడా మంచి పేరు దక్కించుకున్న వాళ్లే. అయితే వీళ్లంతా కూడా ఇప్పుడు హౌస్ నుంచి వెళ్ళిపోయారు ఒక్క అవినాష్ (Avinash) మినహా.


ఇకపోతే ప్రస్తుతం 14 వారాలకు గానూ మొత్తం 17 మంది ఎలిమినేట్ అవ్వగా కేవలం 5 మంది మాత్రమే టైటిల్ రేస్ లో నిలిచారు. అవినాష్, నిఖిల్, గౌతమ్, ప్రేరణ, నబీల్ మాత్రమే ఇప్పుడు టైటిల్ కోసం పోటీ పడుతున్నారు. ఇకపోతే రెమ్యూనరేషన్ విషయానికి వస్తే.. ఈ ఐదు మందిలో అవినాష్ కి మంచి క్రేజ్ ఉంది. కాబట్టి ఈయనకే ఎక్కువ రెమ్యునరేషన్ ఇస్తున్నారని అందరూ అనుకుంటున్నారు. కానీ ఆయన కంటే ప్రేరణ కే ఎక్కువ రెమ్యూనరేషన్ ఇస్తున్నారు అనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఇకపోతే ఈ షో చూసేవారికి ప్రేరణ గురించి పెద్దగా తెలియదు. కానీ “కృష్ణా ముకుందా మురారి” సీరియల్ చూసే వారికి మాత్రం ఈమె గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఈ సీరియల్లో ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి క్రేజ్ అందుకుంది. ఈ సీరియల్ పూర్తి అవ్వగానే ఆమెకు ఇతర చానల్స్ లో కూడా ఆఫర్లు బాగా వచ్చాయి. కానీ బిగ్ బాస్ ఆఫర్ రావడంతో సీరియల్స్ అన్నింటిని పక్కన పెట్టేసింది. ఎందుకంటే బిగ్ బాస్ టీం ఈమెకు వారానికి 4 లక్షల రూపాయల రెమ్యూనరేషన్ ఆఫర్ చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.


అందుకే ప్రేరణకి ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉండడంతో పాటు “కిర్రాక్ లేడీస్ కిలాడి బాయ్స్” అనే ప్రోగ్రాం లో కూడా మగవారితో సమానంగా గేమ్స్ ఆడడం చూసిన బిగ్ బాస్ టీం ఆమెను ఈ షో కి తీసుకొచ్చారు. ముఖ్యంగా బిగ్ బాస్ నిర్వాహకులు నమ్మి ఆమెను ఈ షోలోకి తీసుకురావడంతో ఆమె వారి నమ్మకానికి మించి ఎక్కువ కంటెంట్ ఇచ్చిందని సమాచారం.

ముఖ్యంగా అన్ని రకాల ఎమోషన్స్ ను చూపించి ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయ్యింది. ఇకపోతే 15 వారాలు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నందుకు ఏకంగా రూ.అరకోటికి పైగానే అంటే మొత్తం 60 లక్షల రూపాయలు ఈమె రెమ్యూనరేషన్ గా తీసుకోబోతుందని సమాచారం. ఈ రేంజ్ లో రెమ్యూనరేషన్ అంటే విన్నర్ గా నిలిచే వారి కంటే కూడా ఇది ఎక్కువే అని చెప్పాలి. మొత్తానికైతే ప్రేరణ జాక్పాట్ కొట్టింది అనడంలో సందేహం లేదు.

Related News

Bigg Boss 9 Telugu: డబుల్ హౌస్.. డబుల్ డోస్..బిగ్ ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్

Monal Gajjar : బిగ్ బాస్ బ్యూటీ మోనాల్ గుర్తుందా.? ఇప్పుడేం చేస్తుందో తెలుసా..?

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Big Stories

×