BigTV English

BB Telugu 8 Promo: హౌస్ లోకి సీరియల్ యాక్టర్స్.. సందడి మామూలుగా లేదుగా..!

BB Telugu 8 Promo: హౌస్ లోకి సీరియల్ యాక్టర్స్.. సందడి మామూలుగా లేదుగా..!

BB Telugu 8 Promo: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్.. మరో రెండు మూడు రోజుల్లో పూర్తికానుంది. డిసెంబర్ 15వ తేదీన చాలా గ్రాండ్ గా ఫినాలే నిర్వహించనున్నారు నిర్వాహకులు. మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి అడుగుపెట్టగా, అందులో ప్రతి ఒక్కరు కూడా తమ టాలెంట్ తో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేశారు. ఇక మరొకవైపు ఆరవ వారం వైల్డ్ కార్డు ద్వారా మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ను తీసుకురావడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ సీజన్లో మొత్తం ఎనిమిది మంది వైల్డ్ కార్డు ఎంట్రీ ఇవ్వడం జరిగింది.


హౌస్ మొత్తం కూడా సందడి సందడిగా చాలా సరదాగా సాగింది. ఇకపోతే ప్రస్తుతం టాప్ -5 కంటెస్టెంట్స్ టైటిల్ కోసం పోటీ పడుతున్నారు. అందులో నిఖిల్, గౌతమ్ టైటిల్ రేస్ లో ఉండగా.. నబీల్, అవినాష్, ప్రేరణ టాప్ ఫైవ్ లో నిలిచి మంచి పాపులారిటీ అందుకున్నారు. ఇకపోతే గత సీజన్ లో ప్రియాంక జైన్ టాప్ ఫైవ్ లో నిలిచిన అమ్మాయిగా పేరు దక్కించుకోగా.. ఇప్పుడు ప్రేరణ కూడా టాప్ ఫైవ్ లో నిలిచింది. ఖచ్చితత్వమైన ఆట తీరుతో, మాట తీరుతో.. టాస్క్ లో శారీరకంగా కూడా గాయపడి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా తన ఆటతో మెప్పించింది. అంతేకాదు తన మాటలతో కూడా అందరినీ ఆకట్టుకుంటూ ఉంటుంది. ఇకపోతే ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ సీజన్ చివరి దశకు చేరుకుంటున్న నేపథ్యంలో తాజాగా సీరియల్ సెలబ్రిటీలు హౌస్ లోకి వచ్చి సందడి చేస్తున్నారు.

ఇక నిన్న కావ్య, సుహాసిని హౌస్ లోకి వచ్చి సందడి చేయగా.. ఇక ఈరోజు 101వ రోజుకు సంబంధించి ప్రోమో విడుదల చేయగా.. అందులో చంటి, సింధూర వచ్చి అలరించారు. ఇక ఇద్దరూ కూడా హౌస్ లో ఉన్న ఐదు మంది కంటెస్టెంట్స్ తో గేమ్స్ నిర్వహించారు అందులో భాగంగానే ఏడు మంది ఒకచోట కూర్చుని, ఒక బాక్స్ తీసుకొని ఆ బాక్స్ అందరూ పాస్ చేయాలి. అయితే సాంగ్ ఎవరి దగ్గర అయితే ఆగుతుందో వారు ఆ బాక్స్ లో ఉన్నది ఏంటో చదివి వినిపించి అది చేయాల్సి ఉంటుంది అంటూ సింధూర తెలిపింది. అలా మొదట ప్రేరణ దగ్గర బాక్స్ ఆగింది. ఇక ఆమె అందులో ఉన్నది వినిపిస్తూ.. తాను మాట్లాడకుండా సైగ చేస్తే అవినాష్ తెలియజేయాలని అందులో రాసి ఉంది. ప్రేరణ చెప్పే ప్రయత్నం చేయగా అవినాష్ కామెడీ చేస్తూ అందర్నీ నవ్వించారు. ఆ తర్వాత బాక్స్ నబీల్ దగ్గర ఆగింది. అందులో రెండు ఉల్లిపాయలను తినాలని ఉండగా ఉల్లిపాయలను చాలా బలవంతంగా కష్టంగా తిన్నారు నబీల్. అలా ప్రోమో కాస్త సరదా సరదాగా సాగింది. ఇకపోతే ఈ వారం టైటిల్ రేస్ లో నిఖిల్ , గౌతం పోటీ పడుతున్నారు. అటు ఓటింగ్ లో కూడా నిఖిల్ మొదటి స్థానంలో ఉండగా, గౌతం రెండవ స్థానంలో ఉన్నారు. ఇక మూడవ స్థానంలో ప్రేరణ , నాలుగవ స్థానంలో నబీల్, ఐదవ స్థానంలో అవినాష్ కొనసాగుతున్నారు.


Related News

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Ariyana: సొంత ఇంటికల నెరవేర్చుకోబోతున్న అరియానా.. తెగ కష్టపడుతుందిగా?

Big Stories

×