Manchu Vishnu : మంచు ఫ్యామిలీ వివాదం ఇప్పుడు రచ్చకెక్కిన సంగతి తెలిసిందే. నిన్న రాత్రి మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు చేసిన దాడిని జర్నలిస్ట్ సంఘాలు ఖండిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మోహన్ బాబు (Manchu Mohan Babu) క్షమాపణలు చెప్పాలని, అతనిపై చర్యలు తీసుకోవాలని జర్నలిస్టు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కానీ తాజాగా మంచు విష్ణు చేసిన కామెంట్స్ అగ్నికి ఆజ్యం పోసినట్టుగా అయ్యింది. ‘సారీ చెప్పను బ్రదర్’ అన్నట్టుగా మంచు విష్ణు (Manchu Vishnu)వ్యవహరించిన తీరుపై జర్నలిస్టు సంఘాలు మండిపడుతున్నాయి.
తాజాగా మంచు విష్ణు నిన్న రాత్రి జల్పల్లిలోని మోహన్ బాబు (Manchu Mohan Babu) ఇంటి వద్ద జరిగిన వివాదం గురించి స్పందించారు. మంచు విష్ణు (Manchu Vishnu) మాట్లాడుతూ “ప్రతి ఇంట్లో ఉన్న సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలు పరిష్కారం కావాలనే పెద్దలు కోరుకుంటారని చెప్పుకొచ్చారు. ఈ వివాదంలో ఎవరో ఒకరు తగ్గుతారనే హోప్ ఉంది. మా నాన్న చేసిన తప్పు ఏంటంటే మమ్మల్ని విపరీతంగా ప్రేమించడం. నేను మీడియా మిత్రులకు రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే ఈ విషయాన్ని సెన్సేషన్ చేయకండి. ప్రజల్లో మాకు మంచి గుర్తింపు ఉంది. ఈ వివాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం కరెక్టే. కానీ కొంతమంది లిమిట్స్ దాటుతున్నారు. నిన్న జరిగిన సంఘర్షణలో మా నాన్నకు గాయాలయ్యాయి. ఘటనలో ఒక రిపోర్టర్ కు గాయాలయ్యాయి. అది అనుకోకుండా జరిగిందే తప్ప ఉద్దేశపూర్వకంగా ఎవరిని హర్ట్ చేయాలని అనుకోలేదు. మా నాన్న ముందు నమస్కారం అంటూనే ముందుకు వచ్చారు. కానీ అలా గేట్లు బద్దలు కొట్టుకుని ఇంట్లోకి దూసుకురావడంతో, ఆ హీట్ మూమెంట్ లో అలా జరిగింది. దయచేసి మా నాన్నపై దుష్ప్రచారాలు చేయొద్దు” అంటూ చెప్పుకొచ్చారు విష్ణు.
అయితే మోహన్ బాబు (Manchu Mohan Babu) క్షమాపణలు చెప్పాలని జల్పల్లిలోని మీ ఇంటి వద్ద జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. దాని సంగతేంటి ? అని ప్రశ్నించగా… విష్ణు (Manchu Vishnu) “ఐయామ్ నాట్ ఆన్సర్ దిస్ క్వశ్చన్” అంటూ తప్పించుకున్నాడు మంచు విష్ణు. అయితే మంచు మనోజ్ ((Manchu Manoj) మాత్రం తన తండ్రి చేసింది తప్పే అంటూ… ఆయన తరఫున క్షమాపణలు చెప్పి జర్నలిస్టుల కోపాన్ని చల్లబరిచే ప్రయత్నం చేశారు. కానీ విష్ణు మాత్రం తన తండ్రి చేసింది అసలు తప్పే కాదు అన్నట్టుగా వ్యవహరించాడు. మీడియా ముందుకు వచ్చినప్పటికీ క్షమించమని అడగలేదు సరికదా కనీసం సారీ కూడా చెప్పలేదు.
నిజానికి మోహన్ బాబు చేసిన దాడిలో నిన్న రిపోర్టర్ తీవ్రంగా గాయపడ్డాడు. అయినప్పటికీ మంచు విష్ణు (Manchu Vishnu) ఒక్కసారి కూడా సారీ చెప్పకపోగా, తన తండ్రి తప్పును సమర్థిస్తూ ఆయనను వెనకేసుకు రావడం జర్నలిస్టు సంఘాలకు మరింత కోపం తెప్పించే విధంగా ఉంది. విష్ణు మీడియాతో ఇలాంటి కామెంట్స్ చేసిన తర్వాత జర్నలిస్ట్ సంఘాల అధినేతలు మాట్లాడుతూ మంచు విష్ణు తీరుపై భగ్గుమన్నారు. ఆయన కనీసం క్షమాపణలు కూడా చెప్పలేదు అంటూ మండిపడుతున్నారు. దీంతో మొత్తానికి మంచు విష్ణు చేసిన కామెంట్స్ ఇప్పుడు అగ్నికి ఆజ్యం పోసినట్టుగా అయ్యాయి. మరి ఈ వివాదం ఇంకా ఎక్కడికి దారి తీస్తుందో చూడాలి.