Pro Palestine Essay MIT| భాతర మూలాలున్న ఒక పిహెచ్‌డి విద్యార్థి పాలస్తీనా వాసులకు మద్దతుగా ఒక వ్యాసం రాసినందుకు అతను చదువుకునే అమెరికా యునివర్సిటీ అతడిని 13 నెలలపాటు సస్పెండ్ చేసింది. దీని వల్ల అతను యూనివర్సిటీలో అయిదు సంవత్సరాలుగా చేస్తున్న కోర్సు కూడా నిరుపయోగం కానుంది. అమెరికాలో నివసించే ఇండియన్ అమెరికన్ ప్రహ్లాద్ ఐయ్యంగర్ అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ (ఎంఐటి) లో పిహెచ్ డి (డాక్టరేట్) చేస్తున్నాడు.
అయితే ప్రహ్లాద్ కొన్ని రోజుల క్రితం ఇజ్రాయెల్ వల్ల పాలస్తీనాకు అన్యాయం జరుగుతోందని ఒక వ్యాసం రాసి కాలేజీ మ్యాగజీన్‌లో ప్రచురించాడు. ఈ విషయం ఎంఐటి యూనివర్సిటీ యజమాన్యం దృష్టి రావడంతో.. యూనివర్సిటీ మేనేజ్‌మెంట్ కమిటీ సీరియస్ అయింది. అతడిని జనవరి 2026 వరకు యూనివర్సిటీ పరిసరాల్లో అడుగుపెట్టకూడదని శిక్ష విధించింది. పైగా అతనికి అందుతున్న నేషనల్ సైన్స్ ఫౌండేషన్ గ్రాడుయేట్ ఫెలోషిప్ టెర్నినేట్ చేసే యోచనలో కూడా ఉంది.
Also Read: పుట్టుకతో అమెరికా పౌరసత్వం రద్దు చేస్తా.. ట్రంప్ అధికారం చేపట్టాక ఇండియన్స్‌పై కొరడా
ఎంఐటి యూనివర్సిటీలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎలెక్ట్రికల్ ఇంజినీరింగ్ అండ్ కంప్యూటర్ సైన్స్ లో పిహెచ్‌డి చేస్తున్నాడు. అక్టోబర్ 2024లో ఎంఐటి యూనివర్సిటీ మ్యాగజైన్ లో పాలస్తీనాకు మద్దతుగా వ్యాసం రాసి యూనివర్సిటీ మ్యాగజైన్ లో ప్రహ్లాద్ ప్రచురించాడు.
ఈ విషయంలో ఎంఐటీ యూనివర్సిటీ డీన్ డేవిడ్ వారెన్ రాండాల్ మాట్లాడుతూ.. “అక్టోబర్ 2024లో స్టూడెంట్ జర్నల్ రిటన్ రెవల్యూషన్ లో పాసిఫిజంపై ఒక వ్యాసం రాశాడు. దాన్ని మేము ఇప్పుడు నిషేధించాము. ఐయ్యంగర్ రాసిన వ్యాసంలో హింసాత్మక చిత్రాలను నిరసనగా చూపించారు. పైగా అతని వ్యాసం లోని భాష కూడా కొన్ని చోట్ల అసభ్యంగా ఉందని గమనించాం. వ్యాసంలో ఆ విద్యార్థి పాలస్తీనా కోసం పోరాడుతున్న పాపులర్ ఫ్రంట్ ఆఫ్ లిబరేషన్ ఆఫ్ పాలస్తీన్ అనే సంస్థ లోగో కూడా ఉపయోగించాడు. ఈ సంస్థను ఉగ్రవాద సంస్థగా అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. అందుకే ఎంఐటి క్యాంపస్ లో, యూనివర్సిటీ జర్నల్ లో, లేదా యూనివర్సిటీ పేరుతో కానీ ఎక్కడా ఆ వ్యాసాన్ని ప్రచురించకూడదని ఆదేశాలు జారీ చేశాం.” అని చెప్పారు.
2023లో కూడా యూనివర్సిటీలో విద్యార్థులు పాలస్తీనా హక్కుల కోసం నిరసనలు, ర్యాలీలో చేసినప్పుడు ప్రహ్లాద్ అయ్యంగర్ పాల్గొన్నాడు. ఆ సమయంలో కొంతమందిని పోలీసులు అరెస్టు చేయగా.. వారిని ఎంఐటి యూనివర్సిటీ సస్పెండ్ చేసింది. ప్రహ్లాడ్ అయ్యంగర్ ని కూడా అప్పుడు సస్పెండ్ చేసింది.
మరోవైపు ఎంఐటి యూనివర్సిటీ విద్యార్థి సంఘం మాత్రం యూనివర్సిటీ చర్యలను తప్పుబట్టింది. అందుకే యూనివర్సిటీ చాన్సెలర్ వద్ద ప్రహ్లాద్ తన సస్పెన్షన్ కు వ్యతిరేకంగా అప్పీల్ చేయనున్నాడు. ప్రహ్లాద్ ను సస్సెండ్ చేయడం భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను హరించడమేనని వ్యాఖ్యానించింది.