BB Telugu 8 Promo:బిగ్ బాస్ సీజన్ 8లో 12వ వారం చాలా రసవత్తరంగా సాగుతోంది. ముఖ్యంగా ఈవారం నామినేషన్ కోసం ఎక్స్ హౌస్ మేట్స్ ను రంగంలోకి దింపారు బిగ్ బాస్. ఈ నేపథ్యంలోనే కన్నడ బ్యాచ్ ని మొత్తం టార్గెట్ చేస్తూ నామినేట్ చేస్తున్నారు. ఇక అందులో భాగంగానే సోనియా ఆకుల, బెజవాడ బేబక్క, ఆర్జె శేఖర్ భాష, నైనిక, ఆదిత్య ఓం, సీత, మణికంఠ హౌస్ లోకి వచ్చి కన్నడ బ్యాచ్ ని నామినేట్ చేశారు. ఇక్కడ ఆశ్చర్యం ఏమిటంటే.. వైల్డ్ కార్డు ఎంట్రీస్ ని ఒకరు కూడా టచ్ చేయలేదు. మిగిలిన పృథ్వీ, యష్మీ, ప్రేరణ, నిఖిల్, నబీల్ ను మాత్రం టార్గెట్ చేస్తూ నామినేషన్స్ చేశారు.
ఇకపోతే తాజాగా 12వ వారానికి సంబంధించి తాజా ప్రోమోని విడుదల చేయగా అందులో సీత, నాగమణికంఠ హౌస్ లోకి అడుగుపెట్టారు. ఇక సీత తన మొదటి నామినేషన్స్ లో భాగంగా యష్మీ ని నామినేట్ చేస్తూ.. “ప్రేరణ నీ ఫ్రెండా కాదా?” అని అడిగింది. దానికి యష్మీ అవును అని చెప్పగా.. అయితే ఆమె లేనప్పుడు ఆమె గురించి ఎందుకు వెనుక బ్యాడ్ గా చెబుతున్నావు అంటూ ప్రశ్నించింది. ఇక తర్వాత నిఖిల్ గురించి చెబుతూ ఎప్పుడైతే నువ్వు నిఖిల్ ని ఇష్టపడడం మొదలు పెట్టావో అప్పటినుంచి మీ గేమ్ మొత్తం పోయింది. అటువైపు నుంచి నీ మీద ఎటువంటి ఫీలింగ్స్ లేవు. స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయిన నిన్ను తప్పుదోవ పట్టించి టైటిల్ విన్నర్ అవ్వకుండా చేస్తున్నారు జాగ్రత్తపడు అంటూ యష్మీ ను హెచ్చరించింది సీత. అంతేకాదు నువ్వు ఇప్పుడు జాగ్రత్త పడకపోతే బ్యాడ్ అవుతావు. ముందుగా ఆ ట్రాప్ లో పడొద్దు అంటూ హెచ్చరించింది సీత. ఇక తర్వాత నిఖిల్ మధ్యలో కలుగజేసుకొని నేను మ్యానుపులేట్ చేస్తున్నానా అంటూ ప్రశ్నించాడు. ఇంకా అలా యష్మీ ను నామినేట్ చేసింది సీత. ఆ తర్వాత ప్రేరణను నామినేట్ చేస్తూ.. ఇక నాకు తెలిసి నువ్వు చీప్ అవ్వడానికి ఎవరు సపోర్ట్ చేస్తారని అనుకోవట్లేదు. ఎందుకంటే నువ్వు వినని కాన్వర్జేషన్స్ ఎన్నో నేను విన్నాను. ఇక ఇక్కడ ఇద్దరికీ హెచ్చరికలు జారీ చేస్తూ గేమ్ చక్కగా ఆడమని హింట్ ఇచ్చింది సీత. అలా మొత్తానికైతే యష్మీ , ప్రేరణ ఏ మేరకు సీత సలహాలు తీసుకుంటారో చూడాలి.
ఇక తర్వాత నాగమణికంఠ మాట్లాడుతూ.. కనెక్షన్స్ ఫామ్ చేయడానికి వచ్చావా? లేక గేమ్ ఆడటానికి వచ్చావా? అనే క్లారిటీ నీకు లేకపోతే ఈ టైటిల్ విన్ అవ్వడం చాలా కష్టం అంటూ నిఖిల్ ను హెచ్చరించారు నాగమణికంఠ. ఇక్కడొక స్టేట్మెంట్ అక్కడొక స్టేట్మెంట్ చెప్పి…అక్కడ ఇంకో మాడ్యులేషన్ ఇస్తే గనక నీ మీదకే రాంగ్ అవుతుంది. అంటూ తెలిపారు. నబీల్ ను నామినేట్ చేస్తూ సాక్రిఫైజ్ చేయడం ఆపెయ్ నబీల్. టైటిల్ కి చాలా దగ్గరగా ఉన్నావు. ఎమోషన్స్ ను ట్రిగర్ చేయొద్దు. అంటూ తెలిపారు. అలా నాగ మణికంఠ నిఖిల్ ,నబిల్ ను నామినేట్ చేశారు.