E-Paper
Advertisement

BB Telugu 8: ఎలిమినేట్ చేయండి అంటూ ఎమోషనల్ అవుతున్న టైటిల్ ఫేవర్.. వారి దెబ్బేనా..?

BB Telugu 8: ఎలిమినేట్ చేయండి అంటూ ఎమోషనల్ అవుతున్న టైటిల్ ఫేవర్.. వారి దెబ్బేనా..?
Advertisement

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ప్రేక్షకులను భారీగా అలరిస్తోంది. ఇప్పటికే 11 వారాలు పూర్తి చేసుకున్న ఈ సీజన్, 12వ వారం మధ్య దశకు చేరుకుంది. ప్రస్తుతం హౌస్ లో కేవలం పది మంది మాత్రమే కొనసాగుతున్నారు. అయితే ఈసారి కప్పు గెలుస్తారు అనుకునే వాళ్లలో నిఖిల్ (Nikhil)ప్రథమ స్థానంలో ఉన్నారనటంలో సందేహం లేదు. మొదటి వారం నుంచి ఫుల్ ఫైర్ లో ఉంటూ అందరిని ఆకట్టుకుంటున్నారు. మధ్యలో కాస్త డీలా పడిన నిఖిల్ మళ్ళీ పుంజుకుంటున్నారు. ఇక అందరూ కూడా నిఖిల్ టైటిల్ అందుకుంటారని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్న సమయంలో ఇప్పుడు సడన్ గా నన్ను ఎలిమినేట్ చేసి బయటకు పంపించండి. నాకు ఎవరూ ఓటు వేయకండి అంటూ ఊహించని కామెంట్స్ చేశారు.

అసలేం జరిగింది అనే విషయానికి వస్తే.. నిన్నటి ఎపిసోడ్లో నిఖిల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కిర్రాక్ సీత (Kirrak Sita) హౌస్ లోకి వచ్చి నిఖిల్ ను ఉద్దేశించి.. “ఆడవాళ్ళను ట్రాప్ చేస్తున్నావ్, వారి ఎమోషన్స్ తో ఆడుకుంటున్నావు” అంటూ సంచలన కామెంట్లు చేసింది. ఇక సీత ఇలాంటి మాటలు చెప్పడంతో నిఖిల్ తో పాటు అందరూ షాక్ అయ్యారు. దీంతో యష్మీ స్వయంగా వచ్చి.. నా వల్లే ఇలా నిన్ను అంటున్నారు.. అంటూ సారీ కూడా తెలిపింది. దీంతో నిఖిల్ ప్రేక్షకులను ఉద్దేశించి మాట్లాడుతూ.. “నేనెప్పుడూ కూడా ఒకరిని తొక్కి ఆడాలని అనుకోలేదు. సీత చెప్పినట్టుగా నేనేమీ స్ట్రాంగ్ మహిళలని అడ్డుపెట్టుకొని గెలవాలని కూడా ఆలోచించలేదు. నాకు ఏది అనిపిస్తే అదే చేశాను. ఈ వారం నామినేషన్స్ లో ఉన్నాను. నేను వెళ్ళిపోవాలి.. ప్రేక్షకులారా దయచేసి నాకు ఓటు వేయకండి.. నన్ను ఎలిమినేట్ చేయండి” అంటూ ఎమోషనల్ కామెంట్లు చేశారు నిఖిల్.

Advertisement

అయితే కాసేపు ఆగిన తర్వాత మళ్లీ కెమెరా ముందుకొచ్చి… “నేనేంటో నిరూపించుకుంటాను.. కప్పు తీసుకొని వస్తాను.. ఎలిమినేట్ చేయండి బయటకు వెళ్ళిపోతాను అన్నందుకు క్షమించండి. నన్ను తప్పు అన్న చోటే నేనేంటో నిరూపించుకొని, ఈ సీజన్లో కప్పు గెలుచుకొని వెళ్ళిపోతాను” అంటూ తెలిపారు నిఖిల్. మరి నిఖిల్ అన్నట్టుగానే కప్పు గెలుచుకొని బయటికి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు..మరి ఏ మేరకు ఆయన కల నెరవేరుతుందో చూడాలి.

ఇకపోతే మరోవైపు నిఖిల్ కి పోటీగా గౌతమ్ వేగంగా దూసుకొస్తున్నారు. సీజన్ 7 లో చివరి వరకు వచ్చి కప్పు గెలుచుకోలేకపోయిన ఈయన, ఈసారి ఎలాగైనా సరే కప్పు గెలవాలని అనుకుంటున్నారు. కానీ ఇక్కడ మరో విషయం ఏమిటంటే.. బిగ్ బాస్ చరిత్రలో వైల్డ్ కార్డు ఎంట్రీస్ ఎవరు కూడా టైటిల్ విన్నర్ గా నిలిచిన దాఖలాలు లేవు. సో గౌతమ్ రేస్ లో దూసుకొచ్చినా.. నిఖిల్ మాత్రం టైటిల్ విన్నర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి ఇద్దరిలో ఎవరు గెలుస్తారో చూడాలి.

Related News

బిగ్ బాస్10 హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న కంటెస్టెంట్ తనేనా?

బిగ్ బాస్ హౌస్ లోకి గుండెనిండా గుడి గంటలు హీరో.. ఈ ట్విస్ట్ ఏందీ బాలు..వీడియో వైరల్!

బిగ్ బాస్ 10 లాంచింగ్ ఎపిసోడ్… చీఫ్ గెస్ట్ గా స్టార్ హీరో!

న్యూ చాప్టర్ బిగిన్స్.. బిగ్ బాస్ 10 ఎంట్రీ పై జబర్దస్త్ కమెడియన్ క్లారిటీ!

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్..హౌస్ లోకి వెళ్లేది వీళ్ళే!

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

Big Stories

Advertisement
×