BigTV English

Trinayani Serial Today November 21st: ‘త్రినయని’ సీరియల్‌:  మళ్లీ నేత్రిలా మారిపోయిన నయని – నేత్రి బతికే ఉందన్న స్వామిజీ

Trinayani Serial Today November 21st: ‘త్రినయని’ సీరియల్‌:  మళ్లీ నేత్రిలా మారిపోయిన నయని – నేత్రి బతికే ఉందన్న స్వామిజీ

trinayani serial today Episode:  త్రినయనిలా మూడు గంటలు పాటు ఉన్న  త్రినేత్రి మళ్లీ మూడు గంటల తర్వాత  నేత్రిలా బిహేవ్‌ చేయడం మొదలుపెడుతుంది. అర్థం కానీ విశాల్‌ ఆశ్చర్యంగా చూస్తుంటాడు. మీరు  నన్ను స్వార్థంతో ఇక్కడ ఉండనిస్తున్నారా..?  అని అడుగుతుంది నేత్రి. దీంతో విశాల్‌ మరింత షాకింగ్‌ గా ఇక్కడ ఉండకపోతే  మరి ఎక్కడ ఉంటావు. అని అడుగుతాడు. ఎక్కడ ఉండాలా అని నేత్రి ఆలోచనలో పడిపోతుంది. అసలు నాకే ఏం గుర్తుకు రావడం లేదని అక్కడి నుంచి వెళ్లిపోతుంది.


వైకుంఠం, ముక్కోటి భోజనం చేస్తుంటారు. బామ్మ నయని ఫోటో ముందు దీపం వెలిగిస్తుంది. కొంచెం తక్కువగా తినండి లేదంటే త్రినేత్రి చనిపోయిన బాధ కూడా లేదా అనుకుంటుంది మా అమ్మ అని వైకుంఠం చెప్తుంది. ఇంతలో ఒక స్వామి వచ్చి బిక్షాందేహి అని అడుగుతాడు. బామ్మ స్వామిని ఇంట్లోకి తీసుకొచ్చి భోజనం పెట్టమంటుంది. స్వామి భోజనం చేయడానికి కూర్చోగానే మన ఇంటికి వచ్చిన అతిథితి దేవుడితో సమానం అని స్వామి వారికి ముందు భోజనం పెట్టమని చెప్తుంది. దీంతో ముక్కోటి ఏమీ పట్టించుకోకుండా తింటుంటే బామ్మ వయసులో ఉన్న పిల్ల చనిపోయిందన్న బాధ లేకుండా మూడు పూటలు మెక్కుతున్నావేంటి అని తిడుతుంది. ఎవరి ప్రాణం పోయింది తల్లి అని స్వామిజీ అడుగుతాడు. అదిగే మా మేనకోడలు త్రినేత్రి చనిపోయింది అని నేత్రి ఫోటో చూపిస్తుంది వైకుంఠం.

హాల్‌ లో ఫైల్స్‌ చూసుకుంటూ కూర్చున్న విశాల్‌, విక్రాంత్‌ లను చూసి గాయత్రి పాప ఇల్లంతా పాడు చేసిందని తిడుతుంది.  ఇంటి పని అంతా నువ్వే చేస్తున్నట్లు బిల్డప్ ఇస్తున్నావేంటి అంటూ తిడతాడు. దీంతో సుమన  మా అక్కకి అయినా కష్టమే కదా. ఇప్పటికే తలకు గాయం అయి రోజుకోలా ప్రవర్తిస్తుంది అనడంతో సుమన ప్లీజ్ నయని నీ సొంత అక్క అయినా అంత చనువు తీసుకొని నా దగ్గర తన గురించి తక్కువ చేసి మాట్లాడకు అంటాడు విశాల్‌. దీంతో హాసిని వచ్చి చిట్టికి   దెబ్బలు తిని చాలా రోజులు అయినట్లుంది అంటుంది.


ఇంతలో నేత్రి లంగావోణిలో వస్తుంది. నేత్రిని చూసిన విక్రాంత్‌  బ్రో అటు చూడండి అంటూ విశాల్‌కు చూపిస్తాడు.  నేత్రిని చూసిన హాసిని ఏంటి చెల్లి ఇలా వచ్చావు అని అడుగుతుంది. ఎందుకు అలా అడుగుతున్నారు అంటూ నేత్రి అడగ్గానే.. అది కాదు నయనమ్మా మళ్లీ లంగావోణీలో వచ్చావేంటని అడుగుతాడు పావణమూర్తి. మళ్లీ నన్ను నయని అని పిలుస్తారేంటి. ఆ పేరుతో బాబుగారు పిలిస్తే ఆయనకు ఆ పేరు ఇష్టమేమే అనుకున్నాను కానీ మీరు కూడా అలా పిలుస్తారేంటి..? అని ప్రశ్నిస్తుంది. దీంతో వల్లభ కన్పీజన్‌ గా చూస్తూ ఇక నా వల్ల కాదు నేను ఇక్కడి నుంచి వెళ్లిపోతాను అంటాడు.  తిలొత్తమ్మ, వల్లభ అక్కడి నుంచి వెళ్లిపోతారు.

బయటకు వెళ్లిన తిలొత్తమ్మ మెడిసిన్స్‌ తీసుకొచ్చి నేత్రికి ఇస్తుంది. అవి వేసుకోమని చెప్తుంది. నేత్రి మాత్రం పిచ్చి నాకా.. మీకా.. అనవసరమైన మందులు వేసుకుంటే లేనిపోని జబ్బులు వస్తాయి అని చెప్పి  అవి వేసుకోనని తీసి పడేస్తుంది. అలా విసిరేశావెందుకని విశాల్ అడిగితే ఊరికే మందులు వాడటం మంచిది కాదని నేత్రి అంటుంది. త్రినేత్రి ఇలా చేయడంతో తనకు మతి పోయి అయినా ఉండాలి లేదంటే తలకు గాయం అయినా అవ్వకుండా ఉండి ఉంటుందని అంటుంది.. దాంతో విక్రాంత్ తాను నయని కాదని నాకు అనిపిస్తుందని అంటాడు. తాను చెల్లి కాదు అని అంటావేంటి అని హాసిని అంటుంది. ఇక సుమన త్రినేత్రి అక్క మందులు వేసుకో నీకు పిచ్చి అని అంటుంది. దాంతో త్రినేత్రి సుమన చెంప వాయిస్తుంది. విక్రాంత్ విశాల్‌తో పరిస్థితి చేయి దాటేలా ఉందని అంటాడు.

నేత్రి ఫోటో చూసిన స్వామిజీ  ఫొటోకి దండ ఎందుకు వేశారని ఆమె చనిపోయిందని ఎవరు చెప్పారని అడుగుతాడు.  ముక్కోటి, వైకుంఠం అమ్మవారి గుడి దగ్గర నేత్రిని చనిపోయాక ఊర్లో వాళ్లకు ఏ స్టోరీ చెప్పాలనుకున్నారో అదే స్టోరీ స్వామికి చెప్తారు.  వాళ్ల మాటలు విన్న స్వామిజీ  నేత్రి ఫొటోకి ఉన్న దండ తీసేసి బొట్టు తుడిచి ఫొటో ఎదుట ఉన్న దీపం తులసి కోట దగ్గర పెట్టమని చెప్తాడు. ఆమె దేహం కాలడం, కానీ పూడ్చడం కానీ మీరు  చూశారా అని అడుగుతాడు.  లేదని చెప్తారు. ఆమె దేహం ఇంకా సజీవంగా ఉందని మీరు చేసిన పనికి నా ఆకలి చచ్చిపోయిందని చెప్పి అక్కడి నుంచి స్వామి వెళ్లిపోతారు. ఇంతటితో ఇవాళ్టీ త్రినయని సీరియల్‌ ఏపిసోడ్‌ అయిపోతుంది.

Related News

Dhee Bhoomika : ఢీ కంటెస్టెంట్ కి భారీ యాక్సిడెంట్… కారు తుక్కు తుక్కు

Smriti Irani: ఒక్క ఎపిసోడ్ లక్షల్లో రెమ్యూనరేషన్.. ఏమాత్రం తగ్గని మాజీ మంత్రి క్రేజ్!

Bindas Brothers: పేరుకే సెలబ్రిటీలం… సంపాదన మాత్రం నిల్.. బిందాస్ బ్రదర్స్ కన్నీటి కష్టాలు!

Big TV Kissik talks: తట్టుకోలేక సూసైడ్ అటెంమ్ట్ చేశా.. కిస్సిక్ షోలో అమర్‌దీప్ ఎమోషనల్!

Telugu TV Serials: ఈ వారం టాప్ రేటింగ్ తో దూసుకుపోయిన సీరియల్స్.. గుండెనిండా గుడిగంటలు పరిస్థితి ఏంటి..?

Nindu Noorella Saavasam Serial Today August 8th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: చిత్ర విషయంలో ఆరుతో బాధపడ్డ మిస్సమ్మ

Big Stories

×