BigTV English

BB Telugu 8: ఊచకోత కోసిన గౌతమ్.. డేంజర్ జోన్ లో వారే..!

BB Telugu 8: ఊచకోత కోసిన గౌతమ్.. డేంజర్ జోన్ లో వారే..!

BB Telugu 8: బిగ్ బాస్(Bigg Boss) తెలుగు సీజన్ 8 ఇప్పటికే విజయవంతంగా 12 వారాలు పూర్తి చేసుకుంది. 13వ వారంలోకి కూడా అడుగుపెట్టింది. మరో మూడు వారాలలో ఈ సీజన్ కి కూడా ఎండ్ కార్డు పడనుంది. దీంతో విన్నర్ ఎవరు? టాప్ ఫైవ్లోకి వచ్చేది ఎవరు.? అంటూ కొత్త చర్చ తెరపైకి వచ్చింది. దీనికి తోడు సోమవారం నామినేషన్స్ ప్రక్రియ పూర్తవడంతో ఓటింగ్ ఎలా జరగబోతోంది? టాప్ లో ఎవరున్నారు? 13వ వారం ఎలిమినేట్ కాబోయే కంటెస్టెంట్ ఎవరు? అని అందరూ చర్చించుకుంటున్నారు.


ఇక పూర్తి వివరాల్లోకి వెళితే.. ఇకపోతే టాప్ ఫైవ్ లో ఉంటుందని స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా నిరూపించుకున్న యష్మీ గౌడ 12వ వారం ఎలిమినేట్ అయింది. ఇక ఈవారం నామినేషన్ లో భాగంగా నబీల్, గౌతమ్, నిఖిల్, ప్రేరణ , విష్ణు ప్రియ, పృథ్వీరాజ్, అవినాష్, టేస్టీ తేజ నామినేషన్ లో ఉన్నారు. ఇకపోతే మెగా చీఫ్ రోహిణి మినహా మిగతా ఇంటి సభ్యులందరూ నామినేషన్ లోకి వచ్చేసారు. నామినేషన్ ప్రక్రియ పూర్తవగానే.. ఓటింగ్ ప్రక్రియ మొదలయింది. ఇకపోతే ఓటింగ్ అలా ప్రారంభం అయ్యిందో లేదో అప్పుడే ఓటింగ్ లో గౌతమ్ ఊచ కోత కోశాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్ని ఓట్లు పోలయ్యాయి అనే విషయాన్ని బిగ్ బాస్ నిర్వాహకులు బయటకి చూపించరు కాబట్టి అనధికారికంగా పోలైన ఓట్లను బట్టి చూస్తే.. గౌతమ్ మొదటి స్థానంలో ఉన్నారు. ఏకంగా 33% ఓటింగ్ తో టాప్ ప్లేస్ లో నిలిచారు గౌతమ్.

ప్రేరణ 19.14%, నిఖిల్ 11.3%, టేస్టీ తేజ 9.80%, విష్ణు అవినాష్ 6.97శాతం, నబిల్ 6.45%, పృథ్వీ 6.27 శాతం, విష్ణు ప్రియ 6.23 శాతం ఓట్లు పోలయ్యాయి. ఇకపోతే గౌతమ్ కృష్ణ వైల్డ్ కార్డు ఎంట్రీ అని, ఆయన టైటిల్ విన్నర్ అయ్యే అవకాశాలు లేవని కొంతమంది చెబితే, గేమ్ చూసి వచ్చాడని, అలాంటి వాడికి ఎలా టైటిల్ ఇస్తారని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా బిగ్ బాస్ సీజన్ 8 ఎక్స్ కంటెస్టెంట్ అభయ్ నవీన్ కూడా వీడియో రిలీజ్ చేస్తూ నిఖిల్ కే టైటిల్ ఇవ్వాలని కోరారు. అయితే దీనికి తోడు నిఖిల్ టైటిల్ విన్నర్ అయితే స్టార్ మా సీరియల్స్ లో నటించడమే కాకుండా స్టార్ మా షోలలో కూడా మంచి కంటెంట్ ఇస్తాడని, అందుకే అతడిని టైటిల్ విన్నర్ చేయాలని బిగ్ బాస్ కూడా తెగ ప్రయత్నాలు చేస్తోంది.


కానీ ఓటింగ్ బట్టి చూస్తే గౌతమ్ దరిదాపుల్లోకి కూడా నిఖిల్ రావడం లేదు. గౌతంకి 33% ఓటింగ్ పోలైతే నిఖిల్ కి కేవలం 11 శాతం మాత్రమే ఓట్లు రావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇక మరొకవైపు ప్రేమ పక్షుల్లా ఉన్న పృథ్వీ , విష్ణు ప్రియ డేంజర్ జోన్ లో పడ్డారు.ఇక ఈ వారం విష్ణుప్రియ ఎలిమినేట్ కాబోతోంది అనే వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికైతే ఓటింగ్ లైన్స్ క్లోజ్ అవ్వడానికి ఇంకా సమయం ఉంది. కాబట్టి ఓటింగ్ ముగిసేసరికి మార్పులు జరగవచ్చు అని సమాచారం.

Related News

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Ariyana: సొంత ఇంటికల నెరవేర్చుకోబోతున్న అరియానా.. తెగ కష్టపడుతుందిగా?

Big Stories

×