BigTV English

TTD News: తిరుమలకు వెళ్తున్నారా.. ఈ వివరాలు మీ కోసమే

TTD News: తిరుమలకు వెళ్తున్నారా.. ఈ వివరాలు మీ కోసమే

TTD News: శ్రీనివాస గోవిందా.. శ్రీ వేంకటేశా గోవిందా.. గోవిందా హరి గోవిందా.. వేంకటరమణ గోవిందా.. అనే భక్తి కీర్తనం కలియుగ వైకుంఠం తిరుమల శ్రీ శ్రీనివాసుడి సన్నిధిలో వింటే చాలు భక్తి పారవశ్యంలో పరవశించి పోవాల్సిందే. గోవిందా నామస్మరణ భక్తిశ్రద్దలతో పఠిస్తే చాలు.. ఆ స్వామి అనుగ్రహం మనకు కలుగుతుంది. అటువంటి శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు. స్వామివారిని దర్శించిన భక్తులు లడ్డూ ప్రసాదాన్ని పవిత్రంగా భావించి.. నిశ్చలమైన భక్తితో స్వామివారి ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు. శ్రీవారి సేవలో భక్తులు తరిస్తే.. భక్తుల సేవలో టీటీడీ నిరంతరం తరిస్తోంది. ప్రస్తుతం శ్రీవారి దర్శనార్థం ఎన్ని గంటల సమయం పడుతుంది? తాజాగా ఎందరు భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారో తెలుసుకుందాం.


తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుండే కాక, ఇతర రాష్ట్రాల నుండి సైతం భక్తులు వస్తుంటారు. అంతేకాదు విదేశాల నుండి కూడా స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు రావడం పరిపాటి. అందుకే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ నిరంతరం కృషి చేస్తోంది. స్వామివారి దర్శనంకై ఎందరో భక్తులు సుదూర ప్రాంతాల నుండి పాదయాత్ర ద్వారా తిరుమలకు చేరుకుంటారు. అంతేకాదు అలిపిరి మెట్ల మార్గం, శ్రీవారి మెట్ల మార్గం నుండి కాలినడకన నిర్మలకు చేరుకుంటారు భక్తులు.

కాలినడకన వచ్చే భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తోంది టీటీడీ. సెలవు దినాలలో స్వామివారిని దర్శించుకునేందుకు భారీగా తరలివస్తారు భక్తులు. సామాన్య భక్తులకు మెరుగైన సేవలు అందించాలన్న ఉద్దేశంతో.. ప్రత్యేకమైన రోజుల్లో శ్రీవారి దర్శనానికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సాధారణ భక్తులకు పెద్దపీట వేస్తుంది టీటీడీ.


స్వామి వారిని దర్శించుకున్న భక్తులు.. తమ కోరికలు తీరిన వెంటనే మొక్కులు తీర్చుకుంటారు. పలువురు కానుకలు సమర్పిస్తే, మరికొందరు తలనీలాలు సమర్పించే తమ భక్తిని చాటుకుంటారు. శ్రీవారి దర్శనం కోసం క్యూలైన్లో వేచి ఉన్న భక్తుల నోట వినిపించే మాట.. గోవిందా నామస్మరణమే. అందుకే తిరువీధులు నిరంతరం గోవింద నామస్మరణతో మారూమ్రోగుతాయి.

Also Read: QR Code Pan Cards : కేంద్రం కీలక నిర్ణయం.. ఇకపై క్యూఆర్ కోడ్ తో పాన్ కార్డ్స్

ప్రస్తుతం శ్రీవారి సర్వదర్శనానికి 10 నుండి 12 గంటల గంటల సమయం పడుతుందని టీటీడీ ప్రకటించింది. అలాగే శనివారం స్వామి వారిని 63,637 మంది భక్తులు దర్శించుకోగా.. 24,01 6 మంది భక్తులు తలనీలాలు సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. అంతేకాదు స్వామి వారికి భక్తులు సమర్పించిన కానుకల ద్వారా రూ. 4.20 కోట్ల మేర ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. శ్రీవారి దర్శనార్థం భక్తులు 7 కంపార్ట్మెంట్ లలో వేచి ఉన్నట్లు టీటీడీ ప్రకటించింది.

Related News

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Raksha Bandhan 2025: భద్ర నీడ అంటే ఏమిటి ? ఈ సమయంలో రాఖీ ఎందుకు కట్టకూడదని చెబుతారు

Big Stories

×