Bigg Boss Bharani: బిగ్ బాస్ రియాలిటీ షోకి ఎంతో మంచి ఆదరణ ఉన్న సంగతి తెలిసిందే. ఈ షో తెలుగు భాషలో మాత్రమే కాకుండా ఇతర భాషలలో కూడా ప్రసారమవుతూ మంచి ఆదరణ సొంతం చేసుకుంది. ఇక తెలుగులో ఇప్పటివరకు ఎనిమిది సీజన్లు ఎంతో విజయవంతంగా పూర్తి కాగా, 9 వ సీజన్ కూడా మరొక రెండు రోజులలో పూర్తి కానుంది. డిసెంబర్ 21వ తేదీ గ్రాండ్ ఫినాలే ఘనంగా జరగబోతుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఇక ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో తనూజ, సంజన, ఇమ్మానుయేల్, కళ్యాణ్, పవన్ ఉన్న విషయం తెలిసిందే. ఈ ఐదుగురిలో విన్నర్ ఎవరు? అనే విషయంపై ఎంతో ఆసక్తి నెలకొంది.
ఇక సోషల్ మీడియాలో కళ్యాణ్ పడాలకు భారీ స్థాయిలో మద్దతు లభిస్తుంది. ఇక ఈయనే విజేతగా నిలువబోతున్నారంటూ పలువురు వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇకపోతే 14వ వారంలో భాగంగా బిగ్ బాస్ హౌస్ నుంచి సుమన్ శెట్టితో పాటు భరణి కూడా ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఇలా 14వ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన భరణి ప్రస్తుతం బయట వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో ఈయన తనూజ గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్లలో కేవలం ముగ్గురు మాత్రమే తాను హౌస్ లో ఉండాలని కోరుకున్నారు, మిగిలిన వారందరూ నేను ఎలిమినేట్ కావాలనే కోరుకున్నారని భరణి తెలిపారు.
ఇక ఆ ముగ్గురు ఎవరో అందరికీ తెలుసు పేర్లు చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈ ముగ్గురిలో కూడా ఒకరు కేవలం వారి గేమ్ కోసమే నన్ను వాడుకొని వదిలేశారు. మిగిలిన ఇద్దరు నా విషయంలో చాలా నమ్మకంగా ఉన్నారని, భరణి పేర్లు బయట పెట్టకుండా చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. దీంతో అభిమానులు విభిన్న రీతిలో స్పందిస్తున్నారు. భరణిని తన స్వార్థం కోసం వాడుకున్నది తనూజ(Tanuja) మాత్రమేనని, ఆమె తన గేమ్ కోసం భరణినీ వాడుకుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈయన విషయంలో నమ్మకంగా ఉన్న ఆ ఇద్దరిలో ఒకరు సుమన్ శెట్టి కాగా, మరొకరు దివ్య అంటూ కామెంట్లు చేస్తున్నారు.
రెండుసార్లు ఎలిమినేట్ అయిన భరణి..
ఇప్పటికైనా దివ్య ఏంటో భరణి గుర్తించారు అంటూ ఆమె అభిమానులు ఈ వ్యాఖ్యలపై స్పందిస్తున్నారు. ఇక భరణి సీరియల్ నటుడిగా కొనసాగుతూ బిగ్ బాస్ అవకాశాన్ని అందుకున్నారు. అయితే ఈయన 6వ వారం ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. అనంతరం తొమ్మిదవ వారంలో వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చి 14 వ వారం వరకు కొనసాగారు. మొత్తంగా భరణి 12 వారాలపాటు హౌస్ లో కంటెంట్ గా కొనసాగారు. ఇక 14వ వారంలో బయటకు వచ్చిన ఈయన వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ల గురించి అంచలన విషయాలను తెలియజేస్తున్నారు.
Also Read: Balakrishna: సినిమా హిట్టు.. ఫ్లాప్ తో సంబంధం లేదు.. విశ్వనాథుడి సన్నిధిలో బాలయ్య!