సౌత్ సెంట్రల్ రైల్వే గత కొద్ది రోజులుగా పలు ప్యాసింజర్, ఎక్స్ ప్రెస్ రైళ్ల టైమింగ్స్ లో మార్పులు చేర్పులు చేస్తోంది. రీసెంట్ గా బోధన్- కాచిగూడ ప్యాసింజర్ రైలు, కాచిగూడ- గుంతకల్ ప్యాసింజర్, కర్నూల్ టౌన్-నంద్యాల ప్యాసింజర్ తో పాటు హజ్రత్ నిజాముద్దీన్-కోయంబత్తూర్ ఎక్స్ ప్రెస్, ఔరంగాబాద్-గుంటూరు ఎక్స్ ప్రెస్ రైళ్ల సమాయాల్లో మార్పులు చేర్పులు చేసింది. తాజాగా మరికొన్ని రైళ్లకు సంబంధించిన షెడ్యూల్ మార్చింది. ఇంతకీ ఆ రైళ్లు ఏవంటే..
హిసార్-తిరుపతి ఎక్స్ ప్రెస్ (07718) రైలు టైమింగ్స్ లో కీలక మార్పులు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ మార్పులు అక్టోబర్ 19 నుంచి అమల్లోకి వస్తాయని వెల్లడించింది. మేడ్చల్, మల్కాజ్ గిరి స్టేషన్లలో ఈ ఎక్స్ ప్రెస్ షెడ్యూల్ లో మార్పులు చేస్తున్నట్లు తెలిపింది. ఆపరేషనల్ కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేసింది.
హిసార్-తిరుపతి ఎక్స్ ప్రెస్ రైలు గతంలో మేడ్చెల్ స్టేషన్ కు సాయంత్రం 6.10 గంటలకు చేరుకున, సాయంత్రం 6:12కు బయల్దేరేది. కొత్త టైమ్ టేబుల్ ప్రకారం, ఈ రైలు సాయంత్రం 7:30 గంటలకు స్టేషన్ కు చేరుకుటుంది. సాయంత్రం 7:32కు బయల్దేరుతుంది. అటు ఇప్పటి వరకు మల్కాజ్ గిరి స్టేషన్ సాయంత్రం 6.58 నిమిషాలకు చేరుకుని, సాయంత్రం 7 గంటలకు బయల్దేరేది. తాజా షెడ్యూల్ ప్రకారం రాత్రి 9 గంటలకు వచ్చి, రాత్రి 9:02 నిమిషాలకు బయల్దేరుతుంది.ఇతర మార్గమధ్య స్టేషన్లలోని టైమింగ్స్ లో ఎలాంటి మార్పులు ఉండవని SCR స్పష్టం చేసింది. రైల్వే కార్యకలాపాలను క్రమబద్ధీకరించడంతో పాటు సెక్షన్ అంతటా రైల్వే సర్వీసులకు సంబంధించి మెరుగైన సమయపాలనను నిర్ధారించడం కోసం ఈ షెడ్యూల్ లో మార్పులు చేసినట్లు సీనియర్ రైల్వే అధికారి ఒకరు వెల్లడించారు. ప్రయాణీకులు మారిన సమయాలకు అనుగుణంగా ప్రయాణాలను సర్దుబాటు చేసుకోవాలని సూచించారు.
Read Also: దీపావళికి వైజాగ్ వెళ్తున్నారా? అయితే, మీకో గుడ్ న్యూస్!
దక్షిణ మధ్య రైల్వే గత వారంలోనే పలు ప్యాసింజర్, ఎక్స్ ప్రెస్ రైళ్ల టైమింగ్స్ లో మార్పులు చేసింది. బోధన్-కాచిగూడ ప్యాసింజర్ రైలు(57414) ఉదయం 11:30 గంటలకు కాచిగూడకు చేరుకుంటుందని తెలిపింది. అటు కాచిగూడ-గుంతకల్ ప్యాసింజర్ రైలు (57412) ఉదయం 11:45 గంటలకు కాచిగూడ నుంచి బయల్దేరనున్నట్లు వెల్లడించింది. కర్నూలు టౌన్-నంద్యాల ప్యాసింజర్ రైలు(77209), హజ్రత్ నిజాముద్దీన్-కోయంబత్తూర్ ఎక్స్ ప్రెస్ రైలు(12648), ఔరంగాబాద్-గుంటూరు ఎక్స్ ప్రెస్ రైలు(17254) టైమింగ్స్ లోనూ మార్పులు చేసినట్లు తెలిపింది. అయితే, మార్గమధ్యలోని స్టేషన్లలో ఎలాంటి టైమింగ్స్ మార్పు ఉండదని వెల్లడించింది. సమయాల్లో మార్పులు జరిగాయి. అయితే మార్గమధ్యలో స్టేషన్లలో సమయాల్లో ఎటువంటి మార్పు ఉండదని రైల్వే అధికారులు స్పష్టం చేశారు.
Read Also: తత్కాల్ సర్వీస్ లేకున్నా.. అదే రోజు కన్ఫర్మ్ టికెట్ బుక్ చేసుకోవచ్చు, ఎలాగంటే!