BigTV English
Advertisement

Bigg Boss 8 Day 20 Promo: పెళ్లాం పై కోపంతో బిగ్ బాస్.. అభయ్ ను బయటకు గెంటేసిన నాగార్జున..!

Bigg Boss 8 Day 20 Promo: పెళ్లాం పై కోపంతో బిగ్ బాస్.. అభయ్ ను బయటకు గెంటేసిన నాగార్జున..!

Bigg Boss 8 Day 20 Promo.. తెలుగు బిగ్ బాస్ (Bigg Boss) చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో ఊహించని ఎలిమినేషన్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ముఖ్యంగా బిగ్ బాస్ ను అగౌరవపరచడమే కాకుండా బిగ్ బాస్ రూల్స్ ను అతిక్రమించడమే దీనికి ప్రధాన కారణం. ఎంతమంది వేడుకున్నా సరే తన నిర్ణయమే చివరి నిర్ణయం అంటూ కరాకండిగా చెప్పేస్తూ బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్ అభయ్ (Abhay ) ను గెంటేసాడు నాగార్జున. అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం.


బిగ్ బాస్ ను అగౌరవపరిచిన అభయ్..

తాజాగా మూడవ వారం చివరి దశకు చేరుకుంది. ఈ వారం ఎపిసోడ్ కోసం అభిమానులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే వారం మొత్తంలో ఏం జరిగింది అనే విషయాలను రివ్యూ వేస్తూ కంటెస్టెంట్స్ చేసిన తప్పులను నాగార్జున తెలియజేస్తూ ఉంటారు. అయితే ఈసారి ఎవరు ఊహించని విధంగా నాగార్జున తీసుకున్న నిర్ణయం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. బిగ్ బాస్ హౌస్లోకి కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన అభయ్ ఈసారి చీఫ్ గా ఎన్నికైన తర్వాత తన నిజస్వరూపాన్ని బయటపెట్టాడు. క్లాన్ ను గెలిపించుకోకుండా ఎగ్ కలెక్టింగ్ టాస్క్ లో గుడ్లు వేరే టీమ్ వాళ్ళు తీసుకెళ్తున్నా.. తీసుకెళ్లండి, పండగ చేసుకోండి, ఎంజాయ్ చేయండి అంటూ నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. దీనికి తోడు బిగ్ బాస్ ఫుడ్ పెట్టలేదని పనికిమాలిన గేమ్ అంటూ గౌరవం లేకుండా మాట్లాడాడు.


పెళ్లాం పై కోపంతో బిగ్ బాస్ టాస్క్ లు మారుస్తాడు..

Bigg Boss 8 Day 20 Promo: Nagarjuna kicks out Abhay in anger over the wedding..!
Bigg Boss 8 Day 20 Promo: Nagarjuna kicks out Abhay in anger over the wedding..!

అక్కడితో ఆగకుండా.. బిగ్ బాస్ ఒక మెంటల్ గాడు.. ఆయనకే తెలియదు.. ఏమవుతుందో. వాళ్ళ ఇంట్లో పెళ్ళాంతో గొడవపడిన ప్రతిసారి టాస్క్ మారుస్తున్నాడు. నా వాయిస్ వేసి , వాళ్ళ ముఖాలు వేసి ఇలాంటి లఫంగి ఎడిట్ లు చేసి వేస్తాడు. డైరెక్ట్ గా నా వాయిసే నా ఫేసే వేయి. బిగ్ బాస్ కాదు నువ్వు బయాస్డ్ బాస్. బయటకి ఇంటర్వ్యూ కి వెళ్ళినా సరే నేను ఇదే చెప్తాను బిగ్ బాస్ కాదు లిమిట్ లెస్ బయాస్డ్ బాస్ అంటూ నిర్లక్ష్యంగా బిగ్ బాస్ ని అగౌరవపరుస్తూ అభయ్ మాట్లాడిన మాటలు తాజా ప్రోమోలో చూపించారు.

అభయ్ ను గెంటేసిన నాగార్జున..

దీంతో స్టేజ్ పైకి వచ్చిన నాగార్జున.. రెండు ముఖాలు కాదు అభయ్ నీ ఫేసే నీ వాయిసే.. అన్ని లఫంగి మాటలే. అభయ్ థిస్ ఇస్ బిగ్ బాస్ హౌస్.. బిగ్బాస్ మాత్రమే ఇక్కడ రూల్ చేస్తాడు. అంటూ నాగార్జున కోపంతో చెప్పగానే.. అభయ్ మోకాళ్ళ మీద కూర్చొని దయచేసి నన్ను క్షమించండి అంటూ వేడుకుంటాడు. దీనికి కనుకరించని నాగార్జున వెంటనే రెడ్ కార్డు చూపించి డోర్స్ ఓపెన్ చేసి బయటికి వెళ్లిపొమ్మని చెబుతాడు. అయితే యష్మీ ప్లీజ్ సార్ అంటూ బ్రతిమలాడినా.. నా నిర్ణయం తుది నిర్ణయం అంటూ రెడ్ కార్డ్ చూపించి డోర్స్ ఓపెన్ చేసి అభయ్ ను గెంటేశారు. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ గా మారింది.

Related News

Bigg Boss 9 Telugu : ఇమ్మూ ఫ్యాన్స్ కు రక్తకన్నీరు… ముద్దుబిడ్డకు అడ్డు తొలగించడానికే ఈ బిగ్ ప్లానా ?

Bigg Boss 9 : పోకిరి లెవెల్ ట్విస్ట్, దివ్య కు ఇచ్చి పడేసిన భరణి, అసలైన విలనిజం

Bigg Boss 9 Telugu Day 64 : దివ్యను దులిపేసిన రీతూ… భరణి భయ్యా ఇదస్సలు ఊహించలే… కెప్టెన్ ఇమ్మూకు క్రేజీ షాక్

Bigg Boss 9: ఈవారం నామినేషన్స్ లోకి వచ్చింది ఎవరంటే?

Bigg Boss 9 Promo : ఫుడ్‌పై ఉన్న ఫోకస్ గేమ్‌పై లేదు… గౌరవ్‌ను గజగజ వణికించారు.!

Bigg Boss 9 Promo: ఇదెక్కడి గోలరా.. ఆమె మాట వింటారంటున్న రీతూ!

Bigg Boss : బిగ్ బాస్ ఫైనల్ విజేత ఆమె.. ప్రైజ్ మనీ భారీగా కట్.. ఎందుకంటే?

Bigg Boss 9 Telugu: జాక్ పాట్ కొట్టేసాడే.. అందరికంటే ఎక్కువ రెమ్యూనరేషన్..?

Big Stories

×