E-Paper
Advertisement

Akkineni Naga Chaitanya: చై- శోభితా కొత్త కాపురం.. సామ్ ఇంట్లో.. ?

Akkineni Naga Chaitanya: చై- శోభితా  కొత్త కాపురం.. సామ్ ఇంట్లో.. ?
Advertisement

Akkineni Naga Chaitanya: పెళ్లిళ్ల  సీజన్ మొదలయ్యింది.   ఇప్పటివరకు సైలెంట్ గా ఉన్న ఫ్యామిలీస్ అని.. పెళ్లిళ్ల సీజన్ మొదలుకావడంతో.. పెళ్లి పనులు మొదలుపెట్టేశాయి. అందులో అక్కినేని ఫ్యామిలీ కూడా ఒకటి. అక్కినేని నాగార్జున పెద్ద కొడుకు  అక్కినేని  నాగ చైతన్య ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే.  ఏ మాయ చేసావే సినిమాతో మొదటి హిట్ ను అందుకున్న ఈ హీరో.. ఆ సినిమాలో తనతో పాటు నటించిన సమంతనే ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ జంట పెళ్లి ఏ రేంజ్ లో జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఎంతో సంతోషంగా ఉంటారనుకున్న ఈ జంట నాలుగేళ్లు తిరక్కుండానే విడాకులు తీసుకొని విడిపోయారు. విడాకులకు కారణాలు ఏంటి అనేవి ఇప్పటివరకు తెలియకపోయినా.. రూమర్స్ మాత్రం ఎన్నో వచ్చాయి. ఇక విడాకుల తరువాత చై- సామ్  ముఖముఖాలు కూడా చూసుకోలేదు. ఎవరి కెరీర్ లో వారు బిజీగా మారారు. సామ్ అయితే చై పేరును కూడా పలకడానికి ఇష్టపడలేదు.  ఆ తరువాత సామ్ కు మయోసైటిస్ రావడం.. ఆమె చికిత్స, ఒక ఏడాది సినిమాలకు గ్యాప్ ఇవ్వడం వెంటవెంటనే జరిగాయి.

Advertisement

ఇంకోపక్క చై.. తన స్టార్ డమ్ ను పెంచుకోవడానికి కష్టపడుతూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే  అతడి జీవితంలోకి నటి శోభితా ధూళిపాళ్ల  ఎంటర్ అయ్యింది. గత  కొన్నేళ్లుగా వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు వినిపించాయి. అంతేకాకుండా వీరిద్దరూ కలిసి ఉన్న  ఫోటోలు కూడా  నెట్టింట దుమారాన్ని రేపాయి. ఎన్ని రూమర్స్ వచ్చినా కూడా చై- శోభితా తమ బంధం గురించి మీడియా ముందు చెప్పింది లేదు.

Priyanka Singh : తీవ్ర విషాదంలో బిగ్ బాస్ ప్రియాంక సింగ్… పితృ వియోగం

Advertisement

ఇక ఇందులో నిజం లేదేమో అనుకున్న సమయంలో సడెన్ గా ఇద్దరు  ఎంగేజ్ మెంట్ చేసుకొని షాక్ ఇచ్చారు. ఆగస్టు 8 న వీరి నిశ్చితార్థం అక్కినేని ఇంట ఎంతో ఘనంగా జరిగింది. ఎంగేజ్ మెంట్ అనంతరం .. అక్కినేని కుటుంబం వివాదంలో ఇరుకున్న విషయం  తెల్సిందే.  N కన్వెన్షన్ ను కూల్చివేశారు. ఆ బాధ  నుంచి ఇంకా తేరుకోకముందే మంత్రి కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలు అక్కినేని కుటుంబాన్ని రోడ్డుకు లాగాయి.

ఇక ఇప్పుడిప్పుడే అన్ని సద్దుమణుగుతున్నాయి. దీంతో అక్కినేని కుటుంబం చై- శోభితల పెళ్లి పనులను మొదలుపెట్టింది. నిన్ననే వారింట గోధుమరాయి పసుపు దంచడం అనే కార్యక్రమం ప్రారంభమైంది. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఆమె  అభిమానులతో షేర్ చేసుకుంది. ఇక అందుతున్న సమాచారం ప్రకారం వీరి పెళ్లి డిసెంబర్ లో జరుగుతుందని టాక్ నడుస్తోంది. ఇక పెళ్లి తరువాత ఈ జంట కొత్త కాపురం ఎక్కడ.. ?  అనే చర్చ ఇండస్ట్రీలో జరుగుతుంది. దానికి సమాధానంగా రెండు అప్షన్స్ ఉన్నాయని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Sai Durga Tej: రహస్యంగా పెళ్లి చేసుకున్న చిత్రలహరి బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

అందులో ఒకటి.. సామ్ ఇల్లు. చై- సామ్ ఎంతో ప్రేమగా కొన్న ఇల్లు. తమ అభిరుచికి తగ్గట్లు ఎంతో అద్భుతంగా ఆ ఇల్లును తీర్చిద్దిదారు. సామ్ తో విడాకులు అయ్యాకా  చై కూడా ఆ ఇంటికి వెళ్లలేదని, నాగ్ ఇంట్లో కూడా ఉండకుండా హోటల్ లో స్టే చేశాడని వార్తలు వచ్చాయి. ఆ తరువాత  చై.. తన అభిరుచికి తగ్గట్లు హైదరాబాద్ లోనే సపరేట్ గా ఒక ఇల్లు నిర్మించుకున్నాడు. పెళ్లి తరువాత వారు ఆ ఇంట్లోనే ఉండనున్నారని సమాచారం.

ఇక రెండో అప్షన్ ఏంటంటే.. శోభితా.. తన భర్త చై ను తీసుకొని ముంబైకి మకాం  మారుస్తుందని అంటున్నారు. ఆమె మొదటి నుంచి బాలీవుడ్ లోనే కనిపించింది. ఈ మధ్యనే  చై సైతం బాలీవుడ్ వైపు మొగ్గు చూపుతున్నాడు. దీంతో ముంబైలో ఉంటే మరిన్నీ అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉంటుందని.. ముందే ఆలోచించిన  శోభితా.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు టాక్. మరి ఇందులో  నిజమెంత అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×