BigTV English

Bigg Boss 8 Day 52 Promo 1: కంటెస్టెంట్స్ కి షాక్.. విష్ణు ప్రియ చేసిన పనికి గేట్లు తీసిన బిగ్ బాస్..!

Bigg Boss 8 Day 52 Promo 1: కంటెస్టెంట్స్ కి షాక్.. విష్ణు ప్రియ చేసిన పనికి గేట్లు తీసిన బిగ్ బాస్..!

Bigg Boss 8 Day 52 Promo 1 : బిగ్ బాస్ (Bigg Boss) ఎనిమిదవ సీజన్ 8వ వారానికి చేరుకున్న విషయం తెలిసిందే. ఎనిమిదవ వారంలో భాగంగా మొదటి రెండు రోజులు నామినేషన్ రచ్చ ఏ రేంజ్ లో జరిగిందో ప్రతి ఒక్కరు చూశారు. ముఖ్యంగా ఒకరికొకరు నామినేషన్ చేసుకుంటూ అసలైన రచ్చ ఇదే అంటూ బిగ్ బాస్ హౌస్ లో ఒక్కసారిగా వేడి పుట్టించారు. కంటెస్టెంట్స్ అప్పటివరకు సన్నిహితంగా, స్నేహంగా ఉన్నా.. నామినేషన్స్ వచ్చాయి అంటే అందరిలోని కుళ్ళు కుతంత్రాలు బయటపడతాయని నెటిజన్స్ సైతం కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ 8వ సీజన్లో 8వ వారానికి సంబంధించి నామినేషన్ ప్రక్రియ పూర్తయింది.


జోక్ చేసి అందరినీ నవ్వించిన విష్ణు ప్రియ..

ఇక కంటెస్టెంట్స్ అందరూ ఒకచోట చేరి జోకులతో తెగ సందడి చేశారు. 52వ రోజుకు సంబంధించి మొదటి ప్రోమోని నిర్వాహకులు విడుదల చేశారు.. అందరూ ఒకచోట చేరి ముచ్చట్లు పెట్టుకుంటూ ఉండగా విష్ణు ప్రియ (Vishnu Priya) నిఖిల్(Nikhil )కి హెడ్ మసాజ్ చేస్తూ కనిపించింది. పృథ్వీ మెడలో ఉన్న గోల్డ్ చైన్ ని చూసి టేస్టీ తేజ పృథ్వి రాజ్ మెడలో చైన్ ఎక్కడ తీసుకున్నావ్ బ్రో అని అడగగా.. పృథ్వి ఈ గోల్డ్ చైనా అంటూ అడిగాడు. వెంటనే విష్ణు ప్రియ గోల్డ్.. గోల్డ్ వేసుకొని తిరగడం ఫస్ట్ టైం చూస్తున్నాను అంటూ కామెంట్ చేసింది .


కంటెస్టెంట్స్ కోసం డోర్ ఓపెన్ చేసిన బిగ్ బాస్..

దీంతో మిగతా కంటెస్టెంట్స్ అంతా ఇక మేము చచ్చిపోతాం .. వెళ్లిపోతాం అంటూ సరదాగా కామెంట్లు చేశారు. వెంటనే హరితేజ కూడా ఇక నేను వెళ్తాను సార్ అంటూ సరదాగా కామెంట్ చేసింది. నయని పావని కూడా.. నేను పోతాను సార్ అంటూ పైకి లేచి నిలబడగా.. ముక్కు అవినాష్ విజిల్ వేస్తూ ఒకేసారి డోర్ దగ్గరకు వెళ్లిపోయారు. హరితేజ కూడా ఓపెన్ ద డోర్.. ఐ వాంట్ టు గో అంటూ కామెంట్ చేసింది. నిఖిల్ మాట్లాడుతూ.. ఇప్పుడు నిజంగా డోర్ వాళ్ళు ఓపెన్ చేయాలి అనగానే వెంటనే బిగ్ బాస్ గేట్స్ ఓపెన్ చేశారు. దీంతో ముక్కు అవినాష్ షాక్ అయ్యారు. ఇక మిగతా కంటెస్టెంట్స్ అందరూ కూడా సరదాగా అవినాష్ ను బయటకు పంపించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ముక్కు అవినాష్ తెలియక చేశానన్న డోర్స్ క్లోజ్ చేయండి అంటూ అందరినీ నవ్వించాడు. ఆ తర్వాత అవినాష్ జిమ్ ట్రైనర్ గా మారి ఇంటి సభ్యులకు జిమ్ నేర్పించాలి అని బిగ్ బాస్ చెప్పగా.. ఆ తర్వాత టేస్టీ తేజ, అవినాష్ చేసిన సందడి మామూలుగా లేదు మొత్తానికి అయితే అలా సరదా సరదాగా ఈ ప్రోమో సాగింది.

Related News

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Ariyana: సొంత ఇంటికల నెరవేర్చుకోబోతున్న అరియానా.. తెగ కష్టపడుతుందిగా?

Big Stories

×