BigTV English

Bigg Boss 8 Day49 Promo 3: మీమ్స్ తో రచ్చ చేసిన కంటెస్టెంట్స్..!

Bigg Boss 8 Day49 Promo 3: మీమ్స్ తో రచ్చ చేసిన కంటెస్టెంట్స్..!

Bigg Boss 8 Day49 Promo 3.. వరల్డ్ బిగ్గెస్ట్ రియాల్టీ షో గా గుర్తింపు తెచ్చుకున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో ఎనిమిదవ సీజన్ ప్రారంభమైన విషయం తెలిసిందే.అందులో భాగంగానే 49వ రోజుకు చేరుకుంది. ఇక ఏడవ వారం వీకెండ్స్ అంటేనే ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా వారాంతంలో జరిగే ప్రతి విషయాన్ని రివ్యూ వేస్తూ కంటెస్టెంట్స్ ని దారిలో పెట్టే ప్రయత్నం చేస్తారు హోస్ట్ నాగార్జున (Nagarjuna). అంతేకాదు పాటలతో ఆటలతో కంటెస్టెంట్స్ ని ఆనందపరుస్తారు. ఈ నేపథ్యంలోనే ఆదివారం అనగా 49వ రోజుకు సంబంధించి మూడవ ప్రోమోని విడుదల చేయగా ఇందులో కంటెస్టెంట్స్ పైన సోషల్ మీడియాలో వచ్చిన మీమ్స్ ని చూపిస్తూ వారిని ఆనందపరిచారు.


మీమ్స్ తో తెగ నవ్వించిన హోస్ట్..

ప్రోమో విషయానికి వస్తే.. హోస్ట్ నాగార్జున మాట్లాడుతూ.. మీ మీద చాలా మీమ్స్ వచ్చాయి అంటూ ఆ మీమ్స్ కంటెస్టెంట్స్ కి చూపించారు. ఇకపోతే ముక్కు అవినాష్, పృథ్వి మధ్య.. టాస్క్ లో భాగంగా జరిగిన గొడవను మీమర్స్ మీమ్స్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఇది ఎంతలా వైరల్ అయిందో మనందరికీ బాగా తెలుసు. ఇప్పుడు దీనిని కూడా హౌస్ లో కంటెస్టెంట్స్ కి చూపించారు నాగార్జున. అందులోనే ప్రేరణ ఎంటర్ అవ్వగా ప్రేరణని కొట్టినట్టు అన్నీ కూడా సరదాగా చూపించారు. దీంతో కంటెస్టెంట్స్ పగలబడి నవ్వుతూ ఈలలు వేస్తూ తెగ సంతోషం వ్యక్తం చేశారు.


గంగవ్వ పంచ్ అదుర్స్..

ఇక తర్వాత గంగవ్వ, టేస్టీ తేజ, విష్ణు ప్రియ మధ్య జరిగిన సంభాషణను మీమ్స్ రూపంలో వేశారు. గంగవ్వ ఈ వారం పోవా అంటే పోను అంటూ విష్ణు ప్రియ అనడం అన్నీ కూడా సరదాగా చూపించారు. ముఖ్యంగా గంగవ్వ పంచ్ మీద పంచు వేస్తోందని సునీల్ ఫోటో పెట్టి మరీ వైరల్ చేశారు. ఈవారం వెళ్ళనని నాకు అనిపిస్తోంది అని విష్ణు ప్రియా చెబితే.. మళ్లీ వారం నువ్వు కచ్చితంగా వెళ్తామంటూ కామెంట్ చేసిన దానిని కామెడీగా చూపిస్తూ మీమ్స్ వైరల్ చేశారు. దీంతో గంగవ్వ పగలబడి నవ్వేసింది. ఆ తర్వాత గంగవ్వ హౌస్ లో ఉన్నంతసేపు పంచ్ లే పంచులు అంటూ నయని పావని తెలిపింది..

పాపం మణికంఠ..

ఇకపోతే వైల్డ్ కార్డు ఎంట్రీస్ వచ్చేముందు.. బిగ్బాస్ మీకు వైల్డ్ కార్డు ఎంట్రీస్ రాకుండా ఆపే శక్తి ఇస్తున్నాడు అంటూ చెప్పగానే చత్రపతి లో లాగా మణికంఠ తల వంచిన వ్యక్తి ఒక్కసారిగా ధీమాగా పైకి లేవడాన్ని చూపిస్తారు. ఆ తర్వాత మణికంఠ మీరు సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ చాలెంజ్లో పార్టిసిపెంట్ చేయడానికి వీలు లేదు అని బిగ్ బాస్ చెప్పడంతో వీటన్నింటినీ కలిపి పాపం మణికంఠ.. నీ కష్టం పగవాడికి కూడా రాకూడదు రా అంటూ కంత్రి సినిమాలోని ఎన్టీఆ, ర్ బ్రహ్మానందం ఫోటోలతో మీమ్ క్రియేట్ చేశారు. మొత్తానికైతే మీమ్స్ తో తెగ సందడి చేశారు.

Related News

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Ariyana: సొంత ఇంటికల నెరవేర్చుకోబోతున్న అరియానా.. తెగ కష్టపడుతుందిగా?

Big Stories

×