BigTV English
Advertisement

Bigg Boss 8: అడుగుపెట్టిన 24 గంటల్లోనే కంటెస్టెంట్ ఎలిమినేట్.. బిగ్ బాస్ సూపర్ ట్విస్ట్

Bigg Boss 8: అడుగుపెట్టిన 24 గంటల్లోనే కంటెస్టెంట్ ఎలిమినేట్.. బిగ్ బాస్ సూపర్ ట్విస్ట్

Bigg Boss 8 Tamil: బిగ్ బాస్ రియాలిటీ షో అనేది హిందీలో సూపర్ డూపర్ హిట్ అయ్యింది. అందుకే ఈ షోను సౌత్ భాషల్లో కూడా మొదలుపెట్టాలని మేకర్స్ ఆలోచించారు. అనుకున్నట్టుగానే తెలుగు, తమిళంలో ఒకేసారి ప్రారంభించారు. బిగ్ బాస్ సీజన్ 1.. తెలుగు, తమిళంలో ఒకేసారి గ్రాండ్‌గా లాంచ్ అయ్యింది. అలా మూడు సీజన్ల వరకు ఒకేసారి ప్రారంభమయ్యి ప్రేక్షకులను అలరించింది ఈ షో. కానీ తర్వాత తమిళ బిగ్ బాస్ కాస్త వెనకబడింది. ప్రస్తుతం తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభమయ్యి దాదాపు నెలరోజులు అవుతుండగా.. తమిళంలో తాజాగా లాంచ్ అయ్యింది. అందులో మొదటి రోజే ఓ కంటెస్టెంట్‌కు షాకిచ్చాడు బిగ్ బాస్.


మొదటిరోజే షాక్

బిగ్ బాస్ సీజన్ 8.. అక్టోబర్ 6న గ్రాండ్‌గా లాంచ్ అయ్యింది. తమిళలో బిగ్ బాస్ ప్రారంభమయినప్పటి నుండి కమల్ హాసనే హోస్ట్‌గా వ్యవహరించారు. కానీ సీజన్ 8 నుండి తాను హోస్ట్ కాదని చాలాకాలం క్రితమే ప్రకటించారు కమల్. అందుకే ఆ స్థానంలోకి విజయ్ సేతుపతి హోస్ట్‌గా ఎంటర్ అయ్యాడు. లాంచ్ ఎపిసోడ్‌లో ఆయన హోస్టింగ్ కూడా పర్వాలేదే విజయ్ సేతుపతి కూడా బాగానే చేస్తున్నాడు అనే ఫీలింగ్ చాలామంది ప్రేక్షకుల్లో కలిగింది. బిగ్ బాస్ తమిళ్ సీజన్ 8లో 18 మంది కంటెస్టెంట్స్‌ను హౌస్‌లోకి పంపించాడు విజయ్ సేతుపతి. అందులో ‘మహారాజా’ సినిమాలో తనతో పాటు నటించిన సచన నమిదాస్ అలియాస్ సచన కూడా ఒకరు. ఎన్నో ఆశలతో బిగ్ బాస్‌లోకి ఎంటర్ అయిన సచనకు మొదటిరోజే షాక్ తగిలింది.


Also Read: ఆ కోరికను తీర్చుకోవడానికి హౌస్ లోకి వచ్చిన డాక్టర్ బాబు.. మాస్టర్ ప్లానే..

అనర్హురాలిగా ఓట్లు

బిగ్ బాస్ తమిళ్ సీజన్ 8లో కంటెస్టెంట్స్‌గా ఎంటర్ అయిన ఎనిమిది మందిలో సచన చిన్నది. ‘మహారాజా’ సినిమాలో విజయ్ సేతుపతి కూతురిగా నటించిన తను.. బిగ్ బాస్‌తో ప్రేక్షకులకు మరింత దగ్గరవ్వాలనుకునే ఆశతో వచ్చింది. కానీ మొదటిరోజే బిగ్ బాస్ హౌస్‌లో నామినేషన్స్ జరిగాయి. ప్రస్తుతం హౌస్‌లో ఉన్నవారిలో ఎవరు అనర్హులో బిగ్ బాస్ చెప్పమన్నారు. దీంతో చాలామంది సచన పేరు చెప్పారు. తనకే అనర్హురాలిగా ఎక్కువ ఓట్లు పడ్డాయి. అప్పుడే ప్రేక్షకులు ఊహించని విషయం ఒకటి జరిగింది. కంటెస్టెంట్స్ అంతా కలిసి తనను అనర్హురాలు అని డిసైడ్ చేయడంతో సచనను ఎలిమినేట్ చేసి బయటికి పంపించేశారు బిగ్ బాస్.

ఆ సినిమాలతో గుర్తింపు

బిగ్ బాస్ తమిళ్ సీజన్ 8లో వచ్చిన 24 గంటల్లోనే ఎలిమినేట్ అయ్యి వెళ్లిపోవడంతో సచన చాలా ఎమోషనల్ అయ్యింది. తను అనర్హురాలు అంటే ఓటు వేసి బయటికి పంపిన కంటెస్టెంట్సే తనను ఓదార్చడానికి ముందుకొచ్చారు. మొత్తానికి సచన జర్నీ బిగ్ బాస్ హౌస్‌లో ఒక్కరోజుతోనే ముగిసిపోయింది. ఇప్పటివరకు సచన పలు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించింది. అందులో ముందుగా ‘ఆగస్ట్ 16, 1947’ అనే మూవీతో ప్రేక్షకుల్లో తనకు గుర్తింపు వచ్చింది. ఇక తాజాగా విడుదలయిన ‘మహారాజా’లో విజయ్ సేతుపతి కూతురి క్యారెక్టర్ చేసి కోలీవుడ్ మేకర్స్ కంటపడింది. బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ అయినా కూడా తనను మరిన్ని సినిమాల్లో చూస్తామని ప్రేక్షకులు ఆశిస్తున్నారు.

Related News

Bigg Boss 9 Telugu : గౌరవ్ కు గట్టిదెబ్బ… ఇదేందయ్యా ఇదీ… కట్టప్ప కన్నా తనూజా – ఇమ్మాన్యుయేల్ వెన్నుపోటే దారుణం

Bigg Boss 9 Telugu Day 60 : ఇమ్మూను బోల్తా కొట్టించిన రీతూ… తనూజా వల్ల గౌరవ్ కు తీరని అన్యాయం… దివ్య దిక్కుమాలిన ప్లాన్ సక్సెస్

Bigg Boss 9 Madhuri: వాళ్లు రెమ్యునరేషన్‌ ఇచ్చేదేంటి.. నాకే నెలకు కోటి వస్తుంది.. దివ్వెల మాధురి

Bigg Boss 9 Promo: కెప్టెన్సీ వార్‌.. హీటెక్కిన ఆరేంజ్‌ టీం డిస్కషన్‌, తగ్గేదే లే అంటున్న గౌరవ్!

Bigg Boss 9 Promo: సీక్రెట్ టాస్క్.. అడ్డంగా బుక్కైన ఇమ్మూ !

Bigg Boss 9 Telugu : దారుణంగా పడిపోయిన బిగ్ బాస్ ఓటింగ్ రిజల్ట్.. అతనే విన్నర్..?

Bigg Boss Telugu 9 : ఇమ్మూ బట్టతలపై బిగ్ బాస్ పంచులు… ఈ గుడ్డులో గోల ఏందయ్యా మాకు ?

Bigg Boss 9 : ఈ సీజన్ లో అలాంటి వాడు లేడు, కెప్టెన్ కి ఇచ్చి పడేసాడు 

Big Stories

×