Bigg Boss 8 Telugu Finale: దాదాపు ప్రతీ బిగ్ బాస్ సీజన్‌లో టాప్ 5 కంటెస్టెంట్స్‌లో ఒకరు లేదా ఇద్దరు అమ్మాయిలు ఉంటారు. అందులో చాలామంది రన్నర్‌గా నిలిచిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఏ బిగ్ బాస్ సీజన్‌లో కూడా ఒక అమ్మాయి విన్ అవ్వలేదు. అందుకే ఈసారి టాప్ 5లో ఉన్న ఒకేఒక్క లేడీ కంటెస్టెంట్ అయిన ప్రేరణ గెలవాలని తన ఫ్యాన్స్ అంతా బలంగా కోరుకున్నారు. తనకు చాలానే ఓట్లు వేశారు. కానీ ఇతర కంటెస్టెంట్స్ ఫ్యాన్ బేస్ ముందు ప్రేరణకు ఉన్న ఫ్యాన్ బేస్ సరిపోలేదు. అందుకే ఓట్లు తగ్గిపోయి తను టాప్ 4వ కంటెస్టెంట్‌గానే ఫైనల్స్ నుండి తప్పుకోవాల్సి వచ్చింది. మొత్తానికి ప్రేరణ ఎలిమినేట్ అయినా కూడా తను చాలామందికి ప్రేరణగా నిలిచిందని నాగార్జున ప్రశంసించారు.
అబ్బాయిలతో సమానంగా
బిగ్ బాస్ సీజన్ 8లోకి కొందరు సీరియల్ ఆర్టిస్టులు వచ్చారు. అందులో ప్రేరణ కూడా ఒకరు. కానీ తనకు తెలుగు రాదని, తనను కూడా కన్నడ బ్యాచ్‌లో కలిపేసి చాలామంది ప్రేక్షకులు తనపై విమర్శలు చేశారు. మొదట్లో ప్రేరణకు ప్రేక్షకుల దగ్గర నుండి అంతగా సపోర్ట్ దక్కలేదు. కానీ వైల్డ్ కార్డ్ ఎంట్రీలు వచ్చిన తర్వాత ప్రేరణ ఆటతీరు చాలా మారిపోయింది. లేడీ సింగంలాగా అందరితో పోటీపడడం ప్రారంభించింది. మొదటి నుండి దాదాపు ప్రతీ టాస్క్‌లో తన బెస్ట్ ఇవ్వాలనే అనుకునేది ప్రేరణ. అందుకే అబ్బాయిలతో సమానంగా ఆడేది. ఆ స్ఫూర్తి చాలామందికి నచ్చింది. అబ్బాయిలతో సమానంగా ఆడతావని చాలామంది ప్రేరణను చాలాసార్లు ప్రశంసించారు.
Also Read: 9వారాలకు గానూ అవినాష్ ఎంత రెమ్యూనరేషన్ పొందారంటే..?
హ్యాపీగా ఫీలవుతున్నాను
బిగ్ బాస్ సీజన్ 8లో టాప్ 5కు వెళ్లేంత రేంజ్‌లో ఏ అమ్మాయి కూడా ఆటతీరు కనబరచడం లేదని ప్రేక్షకులు మొదట్లో అనుకున్నారు. కానీ పట్టువదలకుండా ఆడిన ప్రేరణ చాలామందికి ఫేవరెట్‌గా నిలిచింది. చాలా ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకుంది. ఇన్నాళ్ల పాటు తన అల్లరిని భరించినందుకు ప్రేక్షకులకు థాంక్యూ చెప్పుకుంది. తాను విన్నర్ అవుతానని తాను కూడా అనుకోలేదని, కానీ ఇక్కడ వరకు వచ్చినందుకు తాను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానని తెలిపింది. తన ఫ్యామిలీ కూడా తను ఇక్కడ వరకు రావడంపై సంతోషం వ్యక్తం చేశారు. బిగ్ బాస్ హౌస్ నుండి వెళ్లిపోయే ముందు కూడా అబ్బాయిలకు సాటిగా ఆడావంటూ అబ్బాయిలంతా తనను ప్రశంసించారు.
యష్మీని దాటేసింది
బిగ్ బాస్ 8 స్టార్ట్ అయిన మొదట్లో యష్మీతో ఫ్రెండ్‌షిప్ ప్రేరణను చాలా నెగివిట్ చేసింది. వాళ్లిద్దరూ కలిసి గ్రూప్ గేమ్ ఆడుతున్నారని చాలామంది అన్నారు. తనను ఇతర కంటెస్టెంట్స్ నామినేట్ చేయడానికి కూడా అదే కారణంగా మారింది. కానీ తాను ఎక్కడా గ్రూప్ గేమ్ ఆడుతున్నట్టుగా తనకు అనిపించడం లేదంటూ గట్టిగా నిలబడింది ప్రేరణ. మెల్లగా యష్మీని దాటుకుంటూ ముందుకు వెళ్లి చాలామంది ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకుంది. అలా టాప్ 5లో మిగిలిన ఒకేఒక్క అమ్మాయిగా మారింది ప్రేరణ. అసలైతే తను రన్నర్ అవుతుందని చాలామంది అనుకున్నారు. కానీ టాప్ 4గానే నిలిచి చాలామందిని డిసప్పాయింట్ చేసింది.