BigTV English

Allu Arjun : ఆ కుటుంబాన్ని కలవాలని ఎదురుచూస్తున్నాను

Allu Arjun : ఆ కుటుంబాన్ని కలవాలని ఎదురుచూస్తున్నాను

Allu Arjun : ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5వ తారీఖున పుష్ప 2 (Pushpa 2) సినిమా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ కంటే ముందు ప్రీమియర్ షోస్ చాలాచోట్ల వేశారు. అయితే హైదరాబాదులో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న సంధ్య థియేటర్లో ఈ సినిమాను చూడటానికి అల్లు అర్జున్ తన కుటుంబంతో పాటు వచ్చాడు. అల్లు అర్జున్ రావడంతో పెద్ద ఎత్తున అభిమానులు మరియు ప్రేక్షకులు సంధ్య థియేటర్ (Sandhya Theatre) కి వచ్చేసారు. అయితే అక్కడ అంత మంది అభిమానులు ఒకేసారి రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో రేవతి అనే ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. తన కుమారుడు శ్రీతేజ్ (Sri Tej) ఇప్పటికీ హాస్పిటల్లో మృత్యుతో పోరాడుతున్నాడు. అతని పరిస్థితి విషమంగా ఉంది.


ఇదే కేసు విషయమై అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు అరెస్టు చేసి చంచల్గూడా జైలుకు తరలించారు. ఇ తరుణంలో అల్లు అర్జున్ 14 రోజులు రిమాండ్ లో ఉంచుతారు అని వార్తలు కూడా వచ్చాయి. అయితే అల్లు అర్జున్ కి మధ్యంతర బెయిల్ లభించింది. ఇక అల్లు అర్జున్ ఒక రాత్రి చంచల్గూడా పోలీస్ స్టేషన్ లో గడిపి పొద్దున్న 6 గంటలకు తన నివాసానికి వచ్చేసారు. చాలామంది సెలబ్రిటీలు అల్లు అర్జున్ పరామర్శించారు. దీనిపై పెద్ద ఎత్తున చాలా విమర్శలు కూడా వచ్చాయి. ఒకరోజు జైల్లో ఉన్నందుకు ఎంతమంది పరామర్శించారు. ఇంకా మృత్యుతో పోరాడుతున్న శ్రీతేజ్ కుటుంబాన్ని ఎంతమంది పరామర్శించారు అంటూ కొంతమంది ప్రశ్నించడం మొదలుపెట్టారు.

Also Read : Vijay Sethupathi : రామ్ చరణ్ సినిమా లో నటించడానికి నాకు టైం లేదు


ఇక తాజాగా శ్రీ తేజ గురించి అల్లు అర్జున్ ట్విట్టర్ వేదిక స్పందించారు.
దురదృష్టకర సంఘటన తర్వాత నిరంతరం వైద్య సంరక్షణలో ఉన్న యువ శ్రీ తేజ్ గురించి నేను చాలా ఆందోళన చెందుతున్నాను. ప్రస్తుతం కొనసాగుతున్న న్యాయపరమైన విచారణల కారణంగా, ఈ సమయంలో ఆయనను మరియు అతని కుటుంబాన్ని సందర్శించవద్దని నాకు సూచించబడింది. నా ప్రార్థనలు వారితోనే ఉంటాయి మరియు వైద్య మరియు కుటుంబ అవసరాలను తీర్చడానికి నేను బాధ్యత వహించడానికి కట్టుబడి ఉన్నాను. నేను అతను త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను మరియు అతనిని మరియు అతని కుటుంబాన్ని వీలైనంత త్వరగా కలవాలని నేను ఎదురుచూస్తున్నాను. అంటూ ట్విట్టర్ లో రాసుకొచ్చారు అల్లు అర్జున్.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×