Bigg Boss 8 Telugu Finale: బిగ్ బాస్ సీజన్ 8లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా వచ్చిన వారిలో అవినాష్ కూడా ఒకడు. ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 4లోకి కంటెస్టెంట్‌గా వచ్చాడు అవినాష్. కానీ ఆ సీజన్‌లో తన పర్ఫార్మెన్స్ అంత ఇంపాక్ట్ చూపించముందే ఎలిమినేట్ అయ్యాడు. బిగ్ బాస్ 8లో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చిన తర్వాత ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తూనే ఉన్నాడు. ఎంటర్‌టైనర్‌గా మాత్రమే కాకుండా కంటెస్టెంట్‌గా కూడా తన బెస్ట్ పర్ఫార్మెన్స్ అందించాడు. అందుకే బిగ్ బాస్ 8లో మొదటి ఫైనలిస్ట్ అయ్యాడు. ఎలాగైతే మొదటి ఫైనలిస్ట్ అయ్యాడో.. టాప్ 5 నుండి ముందు తానే బయటికి వచ్చేశాడు కూడా.
వారిద్దరిలోనే పోటీ
బిగ్ బాస్ సీజన్ 8లో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా 8వ వారంలో ఎంటర్ అయ్యాడు అవినాష్. వచ్చినప్పటి నుండి ఒక ఎంటర్‌టైనర్‌గా అందరినీ ఎంటర్‌టైన్ చేస్తూనే ఉన్నాడు. చాలామంది తను కేవలం కామెడియన్ మాత్రమే అని హేళన చూసినా కూడా ఆ విషయంలో కృంగిపోకుండా ప్రేక్షకులతో పాటు హౌస్‌మేట్స్‌ను కూడా ఎంటర్‌టైన్ చేశాడు. ఫినాలే ఎపిసోడ్‌లో కూడా తన ఎంటర్‌టైన్మెంట్ ఆగలేదు. అందుకే వెళ్లిపోతున్నప్పుడు కూడా తను బాధపడలేదు. ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసి వెళ్తున్నానని హ్యాపీగా ఫీలయ్యాడు. ఇక హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యి స్టేజ్‌పైకి వచ్చిన తర్వాత గౌతమ్, నిఖిల్‌లో ఎవరో ఒకరు విన్ అవుతాడని అభిప్రాయం వ్యక్తం చేశాడు.
Also Read: బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్‌కు భారీ లక్.. ప్రైజ్ మనీని మరింత పెంచిన నాగార్జున
నో నామినేషన్స్
టాప్ 5లో నుండి ఒకరు ఎలిమినేట్ అవ్వాలని నాగార్జున చెప్పినప్పుడే తానే ఎలిమినేట్ అవుతానని అవినాష్ తెలుసుకున్నానని చెప్పాడు. తను కంటెస్టెంట్‌గా బిగ్ బాస్ 8లోకి ఎంటర్ అయినప్పటి నుండి ఒక్కసారి కూడా నామినేషన్స్‌లోకి రాలేదు. ఒకేసారి నామినేషన్స్‌లోకి వచ్చాడు. అప్పుడే ఎలిమినేట్ అయ్యేవాడు కూడా. కానీ నబీల్ చేతిలో ఉన్న ఎలిమినేషన్ షీల్డ్‌ను తనకు ఇచ్చి అవినాష్ బయటికి వెళ్లకుండా కాపాడాడు. ఆ తర్వాత కూడా అవినాష్ ఎప్పుడూ నామినేషన్స్‌లోకి రాలేదు. అలాగే నేరుగా ఫైనలిస్ట్ కూడా అయ్యాడు. దీంతో ఆడియన్స్‌కు తనను బయటికి పంపే ఛాన్స్ రాలేదని, అందుకే ఫైనల్స్ నుండి ముందు తానే ఎలిమినేట్ అవుతానని గెస్ చేశానని అన్నాడు.
ప్రేక్షకులకు దగ్గరయ్యాడు
బిగ్ బాస్ సీజన్ 4లో కంటెస్టెంట్‌గా వచ్చినప్పుడు అవినాష్ ఒక జబర్దస్త్ కామెడియన్. ఆ రియాలిటీ షోలోకి రావడంతో తనకు జబర్దస్త్ ఆఫర్ మిస్ అయినా కూడా స్టార్ మాలోనే సెటిల్ అయిపోయాడు. అలా అవినాష్‌కు మరింత పాపులారిటీ, మరిన్ని అవకాశాలు వచ్చాయి. తనలో ఎంత టాలెంట్ ఉందనే విషయం కూడా బయటపడింది. స్టార్ మాలో వరుస షోలతో బిజీగా ఉన్న సమయంలోనే బిగ్ బాస్ 8లో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ఎంటర్ అయ్యే ఛాన్స్ అవినాష్‌కు దక్కింది. ఆ ఆఫర్‌ను వద్దనకుండా యాక్సెప్ట్ చేసి ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. బిగ్ బాస్ 8లో చాలావరకు నెగిటివిటీ రాని కంటెస్టెంట్ ఎవరు అంటే చాలామంది అవినాష్ పేరే చెప్తారు.