BigTV English
Advertisement

 BB Telugu 8: 9వారాలకు గానూ అవినాష్ ఎంత రెమ్యూనరేషన్ పొందారంటే..?

 BB Telugu 8: 9వారాలకు గానూ అవినాష్ ఎంత రెమ్యూనరేషన్ పొందారంటే..?

BB Telugu 8..ఎట్టకేలకు బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 (BB Telugu 8)చివరి దశకు చేరుకుంది. ఇక ఈరోజు సాయంత్రం గ్రాండ్ ఫినాలే చాలా ఘనంగా నిర్వహించబోతున్నారు మేకర్స్. అటు అన్నపూర్ణ స్టూడియోలో ఏకంగా ఏడెకరాల సెట్ ఏర్పాటు చేసి మరీ బిగ్ బాస్ కార్యక్రమాన్ని నడిపిస్తున్న విషయం తెలిసిందే. ఇక గత సీజన్లో లాగా విన్నర్ ప్రకటించిన తర్వాత గొడవలు జరగకుండా, అల్లర్లు రేగకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకున్నారు. అందులో భాగంగానే అన్నపూర్ణ స్టూడియో చుట్టూ ఏకంగా 53 సీసీ కెమెరాలు భద్రత కోసం అమర్చారు. ఇక నిఖిల్, గౌతమ్ టైటిల్ రేస్ లో నువ్వా నేనా అంటూ గట్టిగా పోటీ పడుతున్నారు. ఇద్దరిలో ఒకరు విన్నర్, మరొకరు రన్నర్.. అది ఎవరు అనే విషయం మరింత ఉత్కంఠగా మారింది.


ఇకపోతే ఈ సీజన్లో ఫైనలిస్ట్ కి ఐదు మంది చేరారు.అందులో నిఖిల్, గౌతమ్, ప్రేరణ, నబీల్ అవినాష్. ఈరోజు ఎపిసోడ్ కు సంబంధించి షూటింగ్ నిన్ననే పూర్తి చేయగా.. అందులో మొదట అవినాష్ ఎలిమినేట్ అయ్యారు. అందులో భాగంగానే ఆయన 9 వారాలు హౌస్ లో ఉన్నారు. వాస్తవానికి వైల్డ్ కార్డు ద్వారా బిగ్ బాస్ సీజన్ 8లోకి ఆరవ వారం అడుగు పెట్టారు. ముఖ్యంగా తన కామెడీతో ప్రేక్షకులను అలరించడమే కాకుండా తన అద్భుతమైన పర్ఫామెన్స్ తో ఆటతీరుతో అందరి హృదయాలను గెలుచుకున్నారు. ఇక ఇప్పుడు టాప్ ఫైవ్ కి మొదటి ఫైనలిస్టుగా టికెట్ టు ఫినాలేలో గెలిచి, మొదటి ఫైనలిస్ట్ గా నిలిచిన అవినాష్ ఇప్పుడు ఎలిమినేట్ అయ్యారు.

ఇకపోతే 9 వారాలపాటు హౌస్ లో కొనసాగిన అవినాష్ 9 వారాలకు గానూ ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారు అనే విషయం హాట్ టాపిక్ గా మారింది. బిగ్ బాస్ సీజన్ 4 లోకి పాల్గొనడానికి జబర్దస్త్ కామెడీ షో అగ్రిమెంట్ ప్రకారం అక్కడ అగ్రిమెంట్ ను క్లోజ్ చేయడానికి రూ.10లక్షలు కట్టి బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టాడు ముక్క అవినాష్. 10 వారాల పాటు ఉన్నా రూ.15 లక్షలు రెమ్యునరేషన్ అందుకున్నారు. ఇక ఇప్పుడు బిగ్ బాస్ లోకి మళ్ళీ వైల్డ్ కార్డు ద్వారా అడుగుపెట్టి ఏకంగా తొమ్మిది వారాలు హౌస్ లో కొనసాగారు. అయితే ఈసారి మాత్రం బాగానే డిమాండ్ చేశారు ముక్కు అవినాష్. అందులో బాగానే వారానికి రూ.5లక్షల చొప్పున హౌస్ లోకి అడుగుపెట్టారు. ఇక ప్రస్తుతం ఫినాలే వరకు చేరుకున్న నేపథ్యంలో 9 వారాలు హౌస్ లో ఉన్నారు అవినాష్. అందులో భాగంగానే 9 వారాలకు గానూ రూ.45 లక్షలు రెమ్యునరేషన్ గా అందుకున్నట్లు సమాచారం. ఏది ఏమైనా విన్నర్ ప్రైజ్ మనీ కి చాలా దగ్గరగా వెళ్లారని చెప్పవచ్చు. ఇక ఈ రేంజ్ లో రెమ్యూనరేషన్ అంటే అవినాష్ అదృష్టం భారీగా ఉంది అని నెటిజన్స్ సైతం కామెంట్లు చేస్తున్నారు.


Related News

Bigg Boss 9 Telugu : గౌరవ్ కు గట్టిదెబ్బ… ఇదేందయ్యా ఇదీ… కట్టప్ప కన్నా తనూజా – ఇమ్మాన్యుయేల్ వెన్నుపోటే దారుణం

Bigg Boss 9 Telugu Day 60 : ఇమ్మూను బోల్తా కొట్టించిన రీతూ… తనూజా వల్ల గౌరవ్ కు తీరని అన్యాయం… దివ్య దిక్కుమాలిన ప్లాన్ సక్సెస్

Bigg Boss 9 Madhuri: వాళ్లు రెమ్యునరేషన్‌ ఇచ్చేదేంటి.. నాకే నెలకు కోటి వస్తుంది.. దివ్వెల మాధురి

Bigg Boss 9 Promo: కెప్టెన్సీ వార్‌.. హీటెక్కిన ఆరేంజ్‌ టీం డిస్కషన్‌, తగ్గేదే లే అంటున్న గౌరవ్!

Bigg Boss 9 Promo: సీక్రెట్ టాస్క్.. అడ్డంగా బుక్కైన ఇమ్మూ !

Bigg Boss 9 Telugu : దారుణంగా పడిపోయిన బిగ్ బాస్ ఓటింగ్ రిజల్ట్.. అతనే విన్నర్..?

Bigg Boss Telugu 9 : ఇమ్మూ బట్టతలపై బిగ్ బాస్ పంచులు… ఈ గుడ్డులో గోల ఏందయ్యా మాకు ?

Bigg Boss 9 : ఈ సీజన్ లో అలాంటి వాడు లేడు, కెప్టెన్ కి ఇచ్చి పడేసాడు 

Big Stories

×