Bigg Boss 8 Telugu : తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో మెప్పిస్తున్న వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ (Bigg Boss) ప్రస్తుతం 8వ సీజన్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ షో కి 14 మంది కంటెస్టెంట్స్ అడుగుపెట్టగా.. ఎవరికివారు తమ టాలెంట్ తో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేశారు. అయితే కొంతమంది కాన్సెప్ట్ ను అర్థం చేసుకునే లోపే బయటకు వెళ్లిపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే మొత్తం 7 వారాలలో మొత్తం ఎనిమిది మంది కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. మరొకవైపు ఆరవ వారం వైల్డ్ కార్డు ద్వారా ఎనిమిది మంది మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ను హౌస్ లోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అటు హౌస్ కంటెస్టెంట్స్, ఇటు వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా వచ్చిన కంటెస్టెంట్స్ మధ్య పోటీ గట్టిగానే సాగుతోంది.
వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన గంగవ్వ..
ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్ గా పార్టిసిపేట్ చేసిన గంగవ్వ (Gangavva).. అప్పుడు హెల్త్ బాగాలేదని హౌస్ నుంచి తనకు తానుగా నాగార్జునను రిక్వెస్ట్ చేసుకొని మరీ వెళ్ళిపోయిన విషయం తెలిసిందే. అదే సమయంలో నాగార్జున చేసిన డబ్బు సహాయంతో ఇల్లు కూడా నిర్మించుకుంది. ప్రస్తుతం రూ. కోటికి పైగా ఆస్తులు పోగేసుకుంది. ఇదిలా ఉండగా తాజాగా మళ్లీ బిగ్ బాస్ సీజన్ 8లోకి వైల్డ్ కార్డు ద్వారా అడుగు పెట్టింది. హౌస్ లోకి అడుగుపెట్టిన తొలి వారమే అవినాష్ (Avinash) తో కలిసి గట్టిగానే పోటీ పడ్డ ఈమె ఆ తర్వాత వృద్ధాప్య కారణాలవల్ల ఆటలకు కాస్త దూరంగానే ఉంది. కంటెస్టెంట్స్ తో ముచ్చట్లు పెడుతూ.. ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తోంది.
అర్ధరాత్రి గంగవ్వకు గుండెపోటు..
సాధారణంగా ఒక కంటెస్టెంట్ సరిగా ఆడకపోతే.. తోటి కంటెస్టెంట్స్ నామినేషన్ లో వారి పేరు తీస్తూ ఎలిమినేషన్ దిశగా అడుగులు వేయిస్తారన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ గంగవ్వను మాత్రం ఎవరు నామినేట్ చేయట్లేదు. ఎందుకంటే వయసులో పెద్దది ఇప్పుడు ఈమెను నామినేట్ చేస్తే ఉన్న ఇమేజ్ కూడా పోతుందనే భయం కంటెస్టెంట్స్ లో ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే ఆమెను ఆటలలో పెద్దగా ఇన్వాల్వ్ చేయకపోయినా.. ఆమెకు మాత్రం అన్ని మర్యాదలు ఇస్తున్నారు అని చెప్పాలి. ఇలాంటి సమయంలో ఈమెకు గుండెపోటు వచ్చిందంటూ ఒక వార్త తెరపైకి వచ్చింది. తాజాగా జరిగిన ఎపిసోడ్ లో గంగవ్వకు గుండెపోటు రాగా కంటెస్టెంట్స్ అందరూ భయాందోళనకు గురైనట్లు సమాచారం.
హడలెత్తిపోయిన కంటెస్టెంట్స్..
అసలు విషయంలోకి వెళ్తే.. గత రాత్రి గంగవ్వకు గుండెపోటు వచ్చినట్లు తెలుస్తోంది. అర్ధరాత్రి గుండెపోటు రావడంతో కంటెస్టెంట్స్ అందరూ హడలెత్తిపోయారట..ముఖ్యంగా విష్ణు ప్రియకు చెమటలు కూడా పట్టాయని, తనకు కూడా గుండెపోటు వచ్చినట్లు అయిందని విష్ణు ప్రియ భయపడిందట. దీంతో హుటాహుటిన డాక్టర్స్ టీమ్ బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చి ఆమెకు సరైన సమయానికి వైద్యం అందించినట్లు ఒక వార్త వైరల్ అవుతోంది. అయితే ఈ విషయం తెలిసి కొంతమంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటే.. మరి కొంతమంది ఇది ఫ్రాంక్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. బిగ్ బాస్ ఆదేశాల మేరకే గంగవ్వ గుండెపోటు వచ్చినట్లు నటించిందని ,తోటి కంటెస్టెంట్ లను ఆమె నమ్మించాలి అనేది ఆమెకు ఇచ్చిన టాస్క్ అని, అందులో గంగమ్మ సక్సెస్ అయిందని చెబుతున్నారు. ఏది ఏమైనా ఈ విషయం మాత్రం ఇప్పుడు వైరల్ గా మారుతోంది.
Bigg Boss.. బిగ్ బాస్ సీజన్ 8 లో కి వైల్డ్ కార్డు ద్వారా అడుగుపెట్టిన గంగవ్వ కి, గత రాత్రి గుండెపోటు వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.