BigTV English

Samantha : విడాకులపై మళ్ళీ స్పందించిన సమంత.. అలా ఉండాల్సిందంటూ కామెంట్..!

Samantha : విడాకులపై మళ్ళీ స్పందించిన సమంత.. అలా ఉండాల్సిందంటూ కామెంట్..!

Samantha : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న సమంత (Samantha ), అక్కినేని (Akkineni ) కోడలిగా మారిన తర్వాత ఆ పాపులారిటీని ఇంకాస్త పెంచుకుంది అని చెప్పవచ్చు. అయితే నాగచైతన్య (Naga Chaitanya) ను ఏడేళ్ల పాటు ప్రేమించి, పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్న ఈమె నాలుగేళ్లకే విడిపోవడంతో అందరూ రకరకాల రూమర్లు సృష్టించారు. నాగచైతన్య మంచివాడని, సమంత ఇంకొకరితో ఎఫైర్ పెట్టుకోవడం వల్లే అతడు విడాకులు ఇచ్చాడు అంటూ కొంతమంది కామెంట్లు చేయగా.. మరి కొంతమంది ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ తర్వాతే నాగచైతన్య సమంతను దూరం పెట్టాడు అంటూ కామెంట్లు చేశారు. ఇలా రకరకాల రూమర్స్ గుప్పించి సమంతను తీవ్ర మానసిక వేదనకు గురి చేశారనే వార్తలు కూడా వినిపిస్తూ ఉంటాయి.


విడాకులపై తొలిసారి స్పందించిన సమంత..

ఇదిలా ఉండగా గతంలో సమంత , నాగచైతన్య తో విడాకులపై స్పందించిన విషయం తెలిసిందే. కరణ్ జోహార్ (Karan Johar) షోలో పాల్గొన్నప్పుడు చాలా కఠినంగా మాట్లాడింది. మా ఇద్దరిని ఒకే చోట ఒకే రూమ్లో ఉంచినప్పుడు చుట్టూ కత్తులు లేకుండా చూసుకోవాలి అంటూ తెలిపింది. అప్పుడు అంత కోపంగా సమంత చెప్పినా.. నాగచైతన్య మాత్రం సమంత గురించి పాజిటివ్ గానే స్పందించారు. సమంతతో ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ చాలా బాగుంటుందని, ఆమెతో మళ్లీ కలిసి నటించే అవకాశం వస్తే తప్పకుండా నటిస్తానని కూడా తెలిపారు. ఇకపోతే వీరిద్దరూ పరస్పర అంగీకారంతోనే విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే.


సమంత విడాకులపై కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు..

కానీ ఎందుకు విడాకులు తీసుకున్నారు అనే విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. దీనికి తోడు తెలంగాణ దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ (Konda Surekha) నాగచైతన్య సమంత విడాకులపై హాట్ బాంబ్ పేల్చిన విషయం తెలిసిందే. అయితే నిజానికి వీరిద్దరి మధ్య విడాకులు ఎందుకు జరిగాయి అన్న విషయం తెలియదు. కానీ ఇప్పుడు తాజాగా సిటాడెల్ (Citadel) ప్రమోషన్ లో భాగంగా మరొకసారి నాగచైతన్యకు కౌంటర్ వేసినట్టు అనిపించింది.

నాగచైతన్య తో విడాకులపై మళ్ళీ స్పందించిన సమంత..

అసలు విషయంలోకి వెళితే.. సమంత సిటాడెల్ వెబ్ సిరీస్ లో స్పై ఏజెంట్ గా నటించిన విషయం తెలిసిందే. ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్ లో భాగంగా మీరు ఎప్పుడైనా జీవితంలో స్పై ఏజెంట్ గా పని చేశారా? అని అడగ్గా.. అలాంటిది ఎప్పుడు చేయలేదు. కానీ నా జీవితంలో అలా చేసి ఉండి ఉంటే బాగుండేదేమో అంటూ సమంత నవ్వుతూ తెలిపింది. దీన్ని బట్టి చూస్తే తన వైవాహిక జీవితం గురించి ఆమె స్పై గా చేసి ఉండాల్సిందని భావించిందా..? అంటూ నెట్టింట్లో కొత్త చర్చలు జరుగుతున్నాయి. ఏదేమైనా సమంత భర్తతో గొడవపడి కాపురాన్ని నిలబెట్టుకోలేకపోవడం వల్ల ఇప్పుడు ఇలాంటి కామెంట్లు చేస్తోందని కొంతమంది చెబుతున్నారు.

శోభితతో పెళ్లికి సిద్ధమైన నాగచైతన్య..

ఇకపోతే సమంత నుంచి విడిపోయిన తర్వాత నాగచైతన్య శోభిత (Shobhita dhulipala ) తో ప్రేమలో పడి ఈ ఏడాది ఆగస్టు 8న నిశ్చితార్థం చేసుకొని ఇప్పుడు పెళ్లికి సిద్ధం అయిపోయాడు. తాజాగా శోభిత కూడా పెళ్లి పనులు మొదలు పెట్టేసినట్లు సోషల్ మీడియా ద్వారా ఫోటోలను షేర్ చేసింది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×