Bigg Boss8 Telugu : బుల్లి తెర టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 మరో వారంలో ముగియనుంది.. ప్రస్తుతం 14 వ వారం కొనసాగుతుంది. ఈ వారం నామినేషన్స్ లేవు. ఒక్క అవినాష్ తప్ప మిగిలిన వాళ్లందరిని బిగ్ బాసే నామినేట్ చేశారు. ఈ నామినేషన్స్ నుంచి తప్పించుకోవాలంటే టాస్క్ తప్పక చెయ్యాలనే కండిషన్ పెట్టారు. ఇక ఈరోజు క్రాస్ పాత్ అనే విచిత్రమైన టాస్క్ ను కంటెస్టెంట్స్ కు ఇచ్చాడు. ఆ టాస్క్ లో ప్రేరణ, నబీల్, అవినాష్ మధ్య రచ్చే జరుగుతుందని తాజాగా విడుదలైన ప్రోమోను చూస్తే తెలుస్తుంది. ఈరోజు ఎపిసోడ్ లో రచ్చ మాములుగా ఉండదని తెలుస్తుంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం హౌస్ లో ఉన్నవారిలో విన్నర్ ఎవరు? ఎంత ప్రైజ్ మనీ సొంతం చేసుకుంటారో అని అందరు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇక బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్ ఎప్పుడు జరుగుతుంది? అనేది తెలుసుకోవాలి ఆడియన్స్ ఆరాట పడుతున్నారు.
బిగ్ బాస్ హౌస్ లో 13 వ వారం డబుల్ ఎలిమినేషన్ జరిగిన విషయం తెలిసిందే.. టేస్టీ తేజా, పృథ్వి రాజ్ ఇద్దరు హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. ఇక 14 వ వారం కూడా ఇద్దరు ఎలిమినేట్ అవుతారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈవారం నామినేషన్స్‌లో విష్ణుప్రియ, గౌతమ్, నిఖిల్, ప్రేరణ, రోహిణి, నబీల్ నిలిచారు. ఈవారం కూడా డబుల్ ఎలిమినేషన్ ఉంటుందనే వార్తల నేపథ్యంలో టాప్-5 ఎవరనే ఉత్కంఠ నెలకొంది. ఈ ఆరుగురిలో ఇద్దరు మిడ్ వీక్‌లో ఒకరు, వీకెండ్లో మరొకరు ఎలిమినేట్ అవుతారని.. టాప్-5 నిఖిల్, గౌతమ్, నబీల్, విష్ణుప్రియ, అవినాష్ ఉంటారని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..
ఇకపోతే వచ్చే వారానికి బిగ్ బాస్ సీజన్ 8 కంప్లీట్ గా ఎండ్ అవుతుందన్న విషయం తెలిసిందే.. అయితే ప్రతి సీజన్ కు భిన్నంగా ప్రైజ్ మనీని లాస్ట్ వీక్‌లో లో అనౌన్స్ చేస్తారు. కానీ ఈ సీజన్లో ఆ థీమ్ ను మార్చేశారు. ఈసారి సంపాదించుకున్నోడికి సంపాదించుకున్నంతగా ప్లాన్ చేశారు. దీంతో భారీగా రూ.54,30,000 ప్రైజ్ మనీ వచ్చింది. ఇది పెరగొచ్చు. లేదా తగ్గొచ్చు.. ఈ ప్రైజ్ మనీ తో పాటుగా సుజుకి మారుతి కారు కూడా ప్రైజ్ మనీ లో యాడ్ అయ్యిందని తెలుస్తుంది. ఇక కొన్ని కంపెనీలు ప్రైజ్ మనీ ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. వీటితో పాటుగా గిఫ్ట్స్ కూడా ఉంటాయని తెలిసిందే.. ఈ సీజన్ ఫినాలే ఎపిసోడ్ డిసెంబర్ 15వ తేదీ ఆదివారం రాత్రి 7 గంటలకు ప్రసారమవుతుందని తెలుస్తోంది. ఆకట్టుకునే గేమ్స్, సెలబ్రిటీలతోపాటు చీఫ్ గెస్ట్ ను కూడా పిలుస్తారని సమాచారం. చీఫ్ గెస్టులుగా కొత్త జంట నాగ చైతన్య శోభిత వచ్చే అవకాశాలు ఉన్నాయని ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అలాగే నాని లేదా చిరంజీవి కూడా రావచ్చు అని టాక్. మరి ఇందులో నిజం ఎంత ఉందో తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చెయ్యాల్సిందే..