BigTV English

Balakrishna: ఆదిత్య369 సీక్వెల్ పై బాలయ్య రియాక్షన్.. హీరో ఆయనే అంటూ.?

Balakrishna: ఆదిత్య369 సీక్వెల్ పై బాలయ్య రియాక్షన్.. హీరో ఆయనే అంటూ.?

Balakrishna.. నటసింహ నందమూరి బాలకృష్ణ(Balakrishna) ఆరు పదుల వయసు దాటినా కూడా వరుస సినిమాలు ప్రకటిస్తున్నారు. అంతేకాదు యంగ్ హీరోలు సైతం ఆశ్చర్యపోయేలా వరుస బ్లాక్ బాస్టర్ హిట్స్ అందుకుంటూ బిజీగా మారారు బాలకృష్ణ. ఒకవైపు వరుస సినిమాలు ప్రకటిస్తూనే, మరొకవైపు కొడుకుని ఇండస్ట్రీలో సెటిల్ చేసే పనిలోపడ్డారు బాలకృష్ణ. ఇదిలా ఉండగా బాలకృష్ణ కెరియర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ గా నిలిచింది ‘ఆదిత్య 369’. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన ఈ సినిమా అప్పట్లో సూపర్ హిట్ విజయాన్ని అందుకుంది. అంతేకాదు ఈ చిత్రానికి ఇప్పటికీ సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమా సీక్వెల్ పై కొన్నాళ్లుగా చర్చలు నడుస్తున్న విషయం అందరికీ తెలిసిందే.


ఆదిత్య 369 సీక్వెల్ పై క్లారిటీ..

ముఖ్యంగా ఈ సినిమాలో శుభలేఖ సుధాకర్, సిల్క్ స్మిత, బాలకృష్ణ, మోహిని, గొల్లపూడి చంద్రమోహన్, మారుతీరావు తదితరులు కీలకపాత్రలు పోషించారు. ముఖ్యంగా హీరో తరుణ్ (Tarun)కూడా బాలనటుడిగా కనిపించారు. ఈ సినిమా సీక్వెల్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఆదిత్య 369 సీక్వెల్ పై బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన హోస్టింగ్ చేస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 4 కార్యక్రమం లో ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. ఆదిత్య 369 సీక్వెల్ గా ఆదిత్య 999 రానుంది. అయితే ఇందులో మా అబ్బాయి మోక్షజ్ఞ హీరోగా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పనులు కూడా మొదలయ్యాయి. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనుంది అంటూ తెలిపారు. అంతేకాదు ఈ చిత్రానికి దర్శకత్వం, నిర్మాణం రెండూ బాలకృష్ణ చేస్తున్నట్లు సమాచారం.


ఆదిత్య 369 సినిమా విశేషాలు..

ఇకపోతే ఇందుకు సంబంధించిన ఎపిసోడ్ కూడా డిసెంబర్ 6వ తేదీన ఆహా ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ ఎపిసోడ్ ప్రారంభంలో ఆదిత్య 369 సినిమాకు సంబంధించిన గెటప్ లో బాలయ్య కనిపించారు. ప్రస్తుతం ఈ ఫోటోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఆదిత్య 369 సినిమా విషయానికి వస్తే.. టైం మిషన్, టైం ట్రావెల్ నేపథ్యంలో 1991 జూలై 18న చిత్రాన్ని విడుదల చేశారు.. దాదాపు 110 రోజులు శ్రమించి ఈ సినిమాను పూర్తి చేయగా అప్పట్లోనే కోటిన్నర వరకు ఖర్చయింది. ముఖ్యంగా చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరిని ఈ సినిమా ఆకట్టుకుంది.

బాలయ్య సినిమాలు..

ఇకపోతే బాలకృష్ణ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం బాలకృష్ణ బాబీ దర్శకత్వంలో ‘డాకు మహారాజ్’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమా కూడా భారీ అంచనాల మధ్య విడుదల కాబోతున్న నేపథ్యంలో సినిమా కోసం అభిమానులు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాతో బాలయ్య ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×