BigTV English

Fahadh Faasil: బాలీవుడ్ డెబ్యూకు సిద్ధమయిన ‘పుష్ప’ విలన్.. ‘యానిమల్’ బ్యూటీతో రొమాన్స్‌కు రెడీ

Fahadh Faasil: బాలీవుడ్ డెబ్యూకు సిద్ధమయిన ‘పుష్ప’ విలన్.. ‘యానిమల్’ బ్యూటీతో రొమాన్స్‌కు రెడీ

Fahadh Faasil: ఈరోజుల్లో చాలావరకు బాలీవుడ్ హీరోలు సౌత్ భాషల్లో గెస్ట్ రోల్స్ చేయడానికి ఎలాగైతే ముందుకొస్తున్నారో.. అలాగే సౌత్ హీరోలు కూడా బాలీవుడ్‌లో అడుగుపెట్టడానికి అంతే ఆసక్తి చూపిస్తున్నారు. పైగా గత కొన్నేళ్లలో సౌత్ నటీనటులు అంటే బాలీవుడ్‌లో క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. అందుకే మేకర్స్ కూడా సౌత్ నుండి హీరోహీరోయిన్లను ఎంపిక చేసి వారి సినిమాల్లో క్యాస్ట్ చేయడానికి ముందుకొస్తున్నారు. అదే విధంగా ‘పుష్ప 2’ విలన్ ఫాహద్ ఫాజిల్ కూడా త్వరలోనే బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అది కూడా ‘యానిమల్’ ఫేమ్ తృప్తి దిమ్రీతో ఆయన రొమాన్స్ చేయబోతున్నారని సమాచారం.


బాలీవుడ్ డెబ్యూ

మలయాళంలో హీరోగా తన కెరీర్‌ను ప్రారంభించాడు ఫాహద్ ఫాజిల్. ఇప్పటివరకు ఎక్కువగా తను మలయాళ సినిమాల్లోనే నటించాడు. ఇక పాత్ర నచ్చితే హీరోగా కాకుండా విలన్‌గా కూడా చేయడానికి వెనకాడని ఫాహద్.. పలు తమిళ చిత్రాలతో కూడా ప్రేక్షకులను అలరించాడు. తెలుగులో నేరుగా సినిమాలు చేయకపోయినా ఫాహద్‌కు ఇక్కడ చాలామందే ఫ్యాన్స్ ఉన్నారు. అలా ‘పుష్ప’లో విలన్‌గా తనకు అవకాశం లభించింది. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా మూవీతో టాలీవుడ్ డెబ్యూ ఇవ్వడానికి ఫాహద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇప్పుడు తన చూపు బాలీవుడ్‌పైన పడింది. క్రేజీ డైరెక్టర్‌తో తన బీ టౌన్ డెబ్యూ జరగనుంది.


Also Read: ఇదెక్కడి స్కామ్ అండి.? టికెట్స్ అన్నీ అల్లు అర్జున్ తీసుకున్నాడట

చర్చలు పూర్తయ్యాయి

బాలీవుడ్ ప్రేమకథలను మరో కోణంలో చూపించి ఎనలేని గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు ఇంతియాజ్ అలీ. అలాంటి దర్శకుడితో కలిసి సినిమా చేయడానికి ఫాహద్ ఫాజిల్ ఒప్పుకున్నట్టు సమాచారం. అంతే కాకుండా ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి అన్ని చర్చలు పూర్తయ్యాయని, 2025 మొదట్లోనే దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ ప్రారంభం కానుందని బాలీవుడ్‌లో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇందులో ఫాహద్ ఫాజిల్‌కు జోడీగా తృప్తి దిమ్రీ (Tripti Dimri) కూడా ఫైనల్ అయినట్టు తెలుస్తోంది. ‘యానిమల్’ తర్వాత తృప్తి ఏ సినిమా చేసినా దానికి విపరీతమైన హైప్ క్రియేట్ అవుతోంది. అలాగే ఫాహద్, ఇంతియాజ్ సినిమాకు కూడా తృప్తి క్రేజ్ తీసుకొస్తుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు.

ఆయనతోనే డెబ్యూ

ఇంతియాజ్ అలీ (Imtiaz Ali) దర్శకత్వంలో తెరకెక్కిన ‘లైలా మజ్ను’ సినిమాతోనే తృప్తి దిమ్రీ హీరోయిన్‌గా అడుగుపెట్టింది. ఆ తర్వాత పలు సినిమాల్లో తను హీరోయిన్‌గా నటించినా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ‘యానిమల్’లో చిన్న పాత్ర చేయడంతోనే తనకు బీ టౌన్‌లో విపరీతమైన పాపులారిటీ దక్కింది. ఇప్పుడు మరోసారి ఇంతియాజ్ అలీ దర్శకత్వంలోనే తను సినిమా చేయడం చాలా ఎగ్జైటింగ్‌గా ఉందని ప్రేక్షకులు అనుకుంటున్నారు. ఇక ఫాహద్ ఫాజిల్ విషయానికొస్తే తను విలన్‌గా నటించిన ‘పుష్ప 2’ (Pushpa 2) డిసెంబర్ 5న విడుదలకు సిద్దమయ్యింది. ఈ మూవీ తర్వాత తెలుగులో ఫాహద్‌కు మరిన్ని అవకాశాలు వస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×