E-Paper
Advertisement

Bigg Boss 8 Telugu: విష్ణుప్రియా వన్ సైడ్ లవ్, యష్మీ.. ఏంటీ కన్‌ఫ్యూజన్? నీకు నిఖిల్ కావాలా? పృథ్వి కావాలా?

Bigg Boss 8 Telugu: విష్ణుప్రియా వన్ సైడ్ లవ్, యష్మీ.. ఏంటీ కన్‌ఫ్యూజన్? నీకు నిఖిల్ కావాలా? పృథ్వి కావాలా?
Advertisement

Bigg Boss 8 Telugu Latest Episode Highlights: బిగ్ బాస్ సీజన్ 8లో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ లవ్ స్టోరీ లేదే అని చాలామందికి అనిపించింది. కానీ నిఖిల్, సోనియా, పృథ్వి మధ్య ఏదో ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుందని అనుకున్నారు. అదే సమయంలో సోనియా ఎలిమినేట్ అయ్యి వెళ్లిపోయింది. దీంతో సోనియా స్థానంలోకి యష్మీ వచ్చింది. నిఖిల్, పృథ్విలకు సేమ్ లెవెల్‌లో ప్రేమ చూపిస్తూ మరో ట్రయాంగిల్ లవ్ స్టోరీ స్టార్ట్ చేసింది. ఇక విష్ణుప్రియా విషయానికొస్తే తను ముందు నుండే పృథ్విపై ప్రత్యేకమైన ఇష్టం చూపిస్తుంది. తాజాగా దానివల్లే తనకు భారీగా నామినేషన్స్ కూడా పడ్డాయి. అలా యష్మీ, విష్ణుప్రియాల ప్రేమకథలు ఆడియన్స్‌కు ఎంటర్‌టైన్మెంట్ అందించడంతో పాటు కన్‌ఫ్యూజ్ చేస్తున్నాయి.

ప్లాన్ సక్సెస్

Advertisement

తాజాగా జరిగిన నామినేషన్స్‌లో విష్ణుప్రియాను నామినేట్ చేసింది యష్మీ. పృథ్వితో క్లోజ్‌గా ఉండడమే కారణంగా చెప్పింది. నామినేషన్స్ తర్వాత విష్ణుప్రియా వచ్చి అడగగా.. తనను ఫ్రెండ్‌లాగా భావిస్తున్నానని ఏదేదో చెప్తూ ప్లేట్ మార్చేసింది. మరోవైపు పృథ్వి దగ్గరకు వెళ్లి విష్ణుప్రియా.. తనకు దూరమయ్యేలా రెచ్చగొట్టింది. దీంతో పృథ్విని దూరం నుండి చూస్తూనే బాధపడుతోంది విష్ణు. కానీ యష్మీ మాత్రం కుదిరినిప్పుడు పృథ్వితో లేదా నిఖిల్‌తో పులిహోర కలుపుతూ మధ్యమధ్యలో గౌతమ్‌తో కూడా క్లోజ్‌గా ఉంటోంది. అలా యష్మీ వ్యవహారం ఎవరికీ అర్థం కాకుండా మారుతోంది. కానీ పృథ్విని మాత్రం విష్ణుప్రియాకు దూరం చేయాలనే విషయంలో సక్సెస్ అయ్యింది.

Also Read: మా మధ్య గొడవలు లేవు, నా వల్లే ఇలా జరిగింది.. భార్యతో విభేదాలపై క్లారిటీ ఇచ్చిన మణికంఠ

Advertisement

ఫ్రెండ్‌కంటే ఎక్కువ

ఒకప్పుడు ఉన్నంత క్లోజ్‌గా ఈమధ్య యష్మీతో ఉండడం లేదు నిఖిల్. దీంతో అసలు ఏమైంది అని తనతో డిస్కషన్ మొదలుపెట్టింది. ‘‘ఒకప్పుడు ఫ్రెండ్స్‌గా ఉన్నప్పుడే బాగుండేది. అంటే ఇప్పుడు ఫ్రెండ్స్ కాదని కాదు. కానీ వేరేవాళ్లతో మాట్లాడినట్టు కూడా నాతో మాట్లాడడం లేదు. నాకు నీ నుండి ఎలాంటి అంచనాలు లేవు. ఒకరోజు నువ్వు నా కల్లోకి వచ్చావు. అదే విషయం నీతో చెప్పాను. నిన్ను ఫ్రెండ్‌కంటే ఎక్కువగా నేను చూడడం లేదు. నాతో మామూలుగా మాట్లాడు’’ అని అడిగింది. అయినా కూడా నిఖిల్ దగ్గర నుండి తనకు పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు. దీంతో సైలెంట్‌గా అక్కడి నుండి వెళ్లిపోయింది. ఆపై యష్మీ కిచెన్‌లో ఉన్నప్పుడు వచ్చి తన బుగ్గ గిల్లాడు నిఖిల్. తను సిగ్గుపడింది.

యష్మీ త్యాగం

తాజాగా జరిగిన బిగ్ బాస్ ఎపిసోడ్‌లో బీబీ రాజ్యం అనే టాస్క్ జరిగింది. అందులో రాయల్స్ వర్సెస్ ఓజీగా పోటీపడమన్నారు బిగ్ బాస్. బీబీ రాజ్యంకు సంబంధించిన మొదటి టాస్క్‌లో రాయల్స్ టీమ్ విన్ అవ్వగా వారి నుండి ఒకరు మెగా చీఫ్ కంటెండర్ అయ్యే ఛాన్స్ కొట్టేశారు. ఓజీ టీమ్ ఓడిపోవడంతో అందులో నుండి ఒకరు మెగా చీఫ్ రేసు నుండి తప్పుకోవాలి. దీంతో యష్మీ.. తనంతట తానుగా మెగా చీఫ్ రేసు నుండి తప్పుకుంటున్నట్టు ప్రకటించింది. మరోసారి యష్మీ తీసుకున్న నిర్ణయానికి తనను గట్టిగా హత్తుకున్నాడు నిఖిల్. ఇక గెలిచిన రాయల్స్ టీమ్ నుండి మెగా చీఫ్ కంటెండర్‌ కోసం ఓటింగ్ జరిగింది. అందులో రోహిణి గెలిచింది.

Related News

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్..హౌస్ లోకి వెళ్లేది వీళ్ళే!

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

BiggBoss 10 : బిగ్ బాస్ లోకి క్రేజీ హీరోయిన్ ఎంట్రీ.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Ariana Glory : వామ్మో.. అరియనా నెలకు అన్ని లక్షలు సంపాదిస్తుందా..?

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

Big Stories

Advertisement
×